బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ చేస్తున్న చిత్రం జాన్. టైటిల్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాని యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని చాలా రోజుల క్రితమే రిజిస్ట్రర్ చేయించారు. దీన్ని వర్కింగ్ టైటిల్‌గా పరిగణిస్తున్నారు. దీన్నే ఫైనల్‌గా చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే తాజాగా 96 రీమేక్‌కు జాను అనే టైటిల్ పెట్టడంతో ప్రభాస్ జాన్ టైటిల్ ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
96 రీమేక్ టైటిల్ చర్చకు వచ్చిన సమయంలో అంతా జాను అనుకున్నాం. అయితే ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ వారు జాన్ టైటిల్‌ను అనుకుంటున్నట్లుగా మాకు తెలిసింది. అందుకే ప్రభాస్‌ను జాను టైటిల్ పెట్టుకోబోతున్నట్లుగా చెప్పాం. ఆయన యూవీ నిర్మాతలతో మాట్లాడి ఏం ఇబ్బంది లేదు పెట్టుకోండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మా సినిమా విడుదలకు ఇంకా సమయం ఉంది, కనుక మీరు జాను టైటిల్‌ను పెట్టేసుకోండి అంటూ ప్రభాస్ టీం దిల్‌రాజుకు ఓకే చెప్పిందట.
తాజాగా జాను చిత్రం ప్రమోషన్లో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా నిర్మాత దిల్‌రాజు ఈ విషయమై స్పందించాడు. అడిగిన వెంటనే జాను టైటిల్‌ను పెట్టుకునేందుకు ఒప్పుకున్న డార్లింగ్ ప్రభాస్ మరియు యూవీ క్రియేషన్స్ వారికి కృతజ్ఞతలు అన్నాడు. ఈ సినిమాకు జాను టైటిల్ ను పెట్టడంతో ప్రభాస్ సినిమాకు జాన్ టైటిల్‌ను పెట్టడం సాధ్యమా అనే చర్చ జరుగుతుంది. ఇన్ని రోజులుగా జాన్ అంటూ ప్రచారం చేసి ఇప్పుడు మరో టైటిల్ అంటే ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాలి.
482166 85776bless you with regard towards the certain weblog post ive genuinely been looking with regard to this kind of advice on the net for sum time these days hence with thanks 65259
336212 408719I likewise conceive thus, perfectly written post! . 613611
677992 781155Hello there! Great post! Please inform us when I will see a follow up! 416538