Switch to English

Chiranjeevi Helping Hand: ఫ్యాన్స్ కు అభయహస్తం. కరోనాతో దూరమైన అభిమానుల కుటుంబాలకు చిరంజీవి అండ..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

కోవిడ్ సమయం.. ప్రపంచమే అతలాకుతలం.. పక్కింటివాళ్లు కాదు.. సొంత మనుషులనే అనుమానంగా చూసిన భయానకమైన రోజులు. పాత తరం, ప్రస్తుత తరం, భవిష్యత్ తరం కూడా మర్చిపోలేని ఓ ప్రళయ కాలం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎందరినో పలకరించేసింది కరోనా మహమ్మారి. వారిలో మెగాభిమానులు ప్రసాద్ రెడ్డి, రవి ఉన్నారు. చికిత్సకు లైన్లు.. ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితులు.. మందులకు కష్టకాలం.. ఇంట్లో ఉండాలంటే భయం.. ఇలాంటి భీతావాహ పరిస్థితులు చవిచూశారు. సరిగ్గా అప్పుడే మెగాస్టార్ చిరంజీవి తానున్నాని ముందుకొచ్చారు. ఓ విధంగా చెప్పాలంటే కరోనా సమయంలో మానవ రూపంలో వచ్చిన దైవంగా చిరంజీవి గారి గురించి చెప్పుకోవచ్చు. అభిమానులనే కాదు.. ఆయన చేయగలిగినంత సాయం దూరంలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకున్న దైవం మానుష్య రూపం చిరంజీవి.

అనంతపురం అభిమాని..

అనంతపురం జిల్లా హిందూపురంవాసి శ్రీ ప్రసాద్ రెడ్డి. రాష్ట్ర చిరంజీవి యువత మాజీ అధ్యక్షులుగా పని చేశారు. చిరంజీవి అభిమాన సంఘాలను ముందుండి నడిపించారు. చిరంజీవి బాటలో పయనించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. స్థానికంగనే కాకుండా రాష్ట్రస్థాయి నాయకత్వంలో పని చేసి చిరంజీవి మన్ననలు పొందారు. ఆయన కరోనా సమయంలో కరోనా బారిన పడ్డారు. చికిత్స తీసుకున్నా కూడా పరిస్థితి విషమించి ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీంతో అభిమానులను ప్రాణంగా చూసే చిరంజీవి వారి కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ప్రసాద్ రెడ్డి భార్య ఖాతాలో అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునేలా 2లక్షల నగదు జమ చేయించారు. ఎటువంటి పరిస్థితుల్లో సాయం కావాలన్నా తనకు విషయం చేరవేయాలని వారి ఫ్యామిలీకి సూచించారు. అదే చిరంజీవి మంచి మనసు.

కడప అభిమాని..

చిరంజీవికి మరో వీరాభిమాని కడపకు చెందిన శ్రీ రవి గారు. కడప పట్టణంలో రవి పేరు చెబితే చిరంజీవి అభిమాని అనే పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి సినిమా విడుదలైతే చేసే హంగామా నుంచి చిరంజీవి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బృహత్తర కార్యక్రమాలెన్నింటినో చేపట్టారు. రక్తదానం కార్యక్రమాలు నిర్వహించారు. నేతృదానంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. శ్రీ రవి కూడా కోవిడ్ బారిన పడ్డారు. అవసరమైన చికిత్స తీసుకున్నారు. అయినా.. పరిస్థితులు చేజారి ఆయన మృతి చెందారు. తన వీరాభిమాని మృతి చెందారన్న బాధతో చిరంజీవి స్పందించారు. వారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకున్నారు. రవి పిల్లల పేరు మీద 2లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయించారు. ఎటువంటి అవసరం ఉన్నా నేనున్నాను.. మర్చిపోవద్దనే భరోసా కల్పించారు. దీంతో కరోనా సమయంలో అభిమానులకు సాయం అందించి వారిలో ధైర్యం నింపారు చిరంజీవి.

10 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....