తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో టాప్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన జబర్దస్త్ చలాకి చంటి అనూహ్యంగా 5 వారాలు పూర్తయ్యేప్పటికీ వెను తిరిగి వచ్చేసాడు. రెమ్యూనరేషన్ విషయంలో చలాకి చంటి టాప్ లో ఉన్నాడంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ టాప్ రెమ్యూనరేషన్ స్థాయిలో చంటి హౌస్ లో ఆకట్టుకోలేక పోతున్నాడు అంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు.
ముఖ్యంగా ఆయన ఈగో వల్ల కొందరిని ఇబ్బంది పెట్టి తాను ఇబ్బంది పడ్డాడు. ఆట విషయంలో ఎప్పటికప్పుడు చేతులెత్తేస్తూ నాగార్జున ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి వారం కూడా నెక్స్ట్ వారం నుండి తాను ఏంటో చూపిస్తాను అంటూ ప్రగల్బాలు పలికి అదే మూస ధోరణిలో ఆట ఆడి ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు, దాంతో ప్రేక్షకులు ఈ వారం అతడికి ఓట్లు వేయకుండా వేరే వాళ్ళకి ఓటు వేసి చంటిని బయటకు తీసుకొచ్చేశారు.