Switch to English

బిగ్‌ ట్విస్ట్‌: తమన్నా క్షమాపణ.. జనం వెర్రి వెంగళప్పలా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

తమన్నా సింహాద్రి బిగ్‌హౌస్‌లోకి ఎప్పుడైతే ఎంటరైందో.. ఆ తర్వాత బిగ్‌ బాస్‌ 3 తెలుగు రియాల్టీ షో ‘స్థాయి’ పడిపోవడం మొదలైంది. ట్రాన్స్‌జెండర్‌కి ఈ షోలో అవకాశం కల్పించడం గొప్ప విషయమే. కానీ, ‘గేమ్‌ స్ట్రాటజీ’ని తమన్నా అమలు చేసిన విధానమే జుగుప్సాకరం. హౌస్‌లోకి వస్తూనే వరుణ్‌ – వితికల సంగతి తేల్చుతానని చెప్పిన తమన్నా, ఆ తర్వాత అలీ రెజాపైనా విరుచుకుపడింది. చివరికి రవికృష్ణని టార్గెట్‌ చేసింది. తొలి ఎలిమినేషన్‌కే ఆమె ఔట్‌ అయిపోయిందనుకోండి.. అది వేరే విషయం.

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చి, తాను ఎదుర్కొన్న తొలి ఎలిమినేషన్‌తోనే షో నుంచి బయటకు వెళ్ళిపోయింది తమన్నా. కానీ, రవికృష్ణపై ఆమె చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, ఆ తర్వాత హౌస్‌లో రవికృష్ణకు పెరిగిన ‘అతి మంచోడు’ ఇమేజ్‌.. వెరసి, షో మీద జనంలో అసహనం పెరిగిపోయింది. రీ-యూనియన్‌లో తమన్నా, రవికృష్ణకి క్షమాపణ చెప్పింది. అయితే, అదంతా చాలా డ్రమెటిక్‌గా అన్పించింది.

శ్రీముఖి యాజ్‌ యూజువల్‌ వెయిట్‌ లిఫ్టర్‌గా మారి తమన్నాని అమాంతం పైకి ఎత్తేసింది. ఒక్క తమన్నానే కాదు, దాదాపు అందరు పాత హౌస్‌మేట్స్‌ (ముఖ్యంగా ఫిమేల్‌ కంటెస్టెంట్స్‌) అలా పైకి లేపేసి, కొందర్నయితే చంకెక్కించేసుకుంది కూడా శ్రీముఖి. శ్రీముఖి – తమన్నా మధ్య గుసగుసలు ఎక్కువగా విన్పించాయి. ‘చెప్పొచ్చో లేదోగానీ..’ అంటూ హౌస్‌లో మళ్ళీ ‘గందరగోళ వాతావరణం’ సృష్టించేందుకు తమన్నా ప్రయత్నించడం గమనార్హం.

మొత్తమ్మీద, రవికృష్ణ మీద ‘గేమ్‌ స్ట్రాటజీ’ అమలు చేశానని తమన్నా ఒప్పుకుందిగానీ, అది ఆమె గేమ్‌ ప్లాన్‌ అనుకోవాలా.? బిగ్‌బాస్‌ ఇచ్చిన స్క్రిప్ట్‌ అనుకోవాలా.? ‘రవికృష్ణ బలైపోయాడు..’ అని తమన్నా చెప్పిన వైనం కొత్త అనుమానాలకు తావిచ్చింది.

2 COMMENTS

సినిమా

సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్‌కు సిద్దు జొన్నలగడ్డ ఎంపిక

నటభూషణ శోభన్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన చిత్రాలు, ఆయన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ చెరగని ముద్రగా నిలిచాయి. శోభన్...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్… ఆసక్తి పెంచుతున్న యాక్షన్ ఎంటర్టైనర్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ఓ కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రత్యేక కానుక రాబోతోంది. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిరాకిల్’...

బడ్జెట్ బ్రేక్‌తో బ్రేక్ పడిన NBK111?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ NBK111 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, అనూహ్యంగా...

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి,...

‘వెంకీ పింకీ జంప్’ ఆడియో రిలీజ్…

 విక్రమ్, రమ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వెంకీ పింకీ జంప్’ సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర...

రాజకీయం

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...

పీపీపీపై కేంద్రం మరో లేఖ.. రాష్ట్ర వైద్య రంగానికి కీలక దిశానిర్దేశం

వైద్య సేవల డిమాండ్‌–లభ్యత మధ్య ఉన్న గ్యాప్‌ను పూరించేందుకు పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరోసారి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ మేరకు...

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...

NTV కేసు మలుపు: ఇన్ పుట్ ఎడిటర్, ఇద్దరు రిపోర్టర్ల అరెస్ట్

తెలంగాణలో మీడియా స్వేచ్ఛ, ప్రభుత్వ చర్యలపై మరోసారి చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. మహిళా ఐఏఎస్ అధికారి మరియు ఓ మంత్రి వ్యవహారంపై ప్రసారమైన వార్తకు సంబంధించి NTV న్యూస్ ఛానల్‌పై కఠిన...

వైసీపీ సంక్రాంతి సంబరాలు… వైఎస్ జగన్ గారు ఎక్కడ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ పండుగ వాతావరణాన్ని పంచుకోవడం రాజకీయ నాయకుల పరంగా సహజమే. ఈ నేపథ్యంలో...

ఎక్కువ చదివినవి

భర్తల జీవిత ప్రశ్నకు సమాధానం చెప్పే సినిమా: కిషోర్ తిరుమల

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో, దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో, ఎస్ఎల్‌వి సినిమాస్...

వరద నీళ్ల పేరుతో దొంగ డ్రామాలా?

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీజల వివాదాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలని వైసీపీ, బీఆర్ఎస్ కలిసి బురద రాజకీయాలు చేస్తున్నాయన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. గోదావరి, కృష్ణా వరద జలాల విషయంలో రెండు...

Daily Horoscope: కార్యసిద్ధి యోగం, ఆర్థిక లాభ సూచనలు: నేటి రాశిఫలాలు

జనవరి 13, 2026 మంగళవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. పనుల్లో వేగం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా చిన్న లాభాలు అందుతాయి....

సంక్రాంతికి భారీ ఊరట: ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు రూ.2653 కోట్ల విడుదల

అమరావతి కేంద్రంగా కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీస్ సిబ్బంది, వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు భారీ ఊరటనిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెండింగ్‌లో...

పిఠాపురం సంక్రాంతి వేడుకల్లో పవన్ కళ్యాణ్ చొరవతో సంస్కృతి పునరుజ్జీవనం

పిఠాపురంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు ఈసారి సాధారణ పండుగ సంబరాలకు మించి, లోతైన సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాయి. ఈ వేడుకల వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి స్పష్టంగా కనిపించిందన్న...