బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై నిన్న ఓ పబ్‌లో దాడి జరిగింది. పబ్ అన్నాక తాగి తందనాలాడేయడం సహజమే. ఈ క్రమంలో మాట తూలడం కూడా సర్వసాధారణమే. ఒక్కోసారి చిన్న వివాదం ముదిరి పాకాన పడి, కొట్టుకునేదాకా వెళుతుంది. ఇక్కడా అదే జరిగినట్లు కన్పిస్తోంది.
ఏకంగా ఓ వ్యక్తి, రాహుల్ సిప్లిగంజ్ నెత్తి మీద ‘సినిమా స్టయిల్లో’ బీరు బాటిల్‌తో గట్టిగా కొట్టాడు. మద్యం మత్తులో వున్నాడేమో.. రాహుల్ వెంటనే కింద పడిపోలేదు. కానీ, అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అక్కడే వున్న ఆయన సన్నిహితులు. తన స్నేహితులతో కలిసి (ఓ స్నేహితురాలు కూడా వుందట) పబ్‌కి వెళ్ళిన రాహుల్, ఈ గొడవతో ఇలా వార్తల్లోకెక్కాడు.
మరోపక్క, కొట్టిన వ్యక్తికి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ వున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గర్ల్‌ఫ్రెండ్‌ని అవతలి వ్యక్తి తాలూకు గ్యాంగ్ టీజింగ్ చేసిందన్నది ఓ వెర్షన్. కాదు కాదు, రాహుల్ ఇంకో గ్యాంగ్‌లోని యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఇంకో వెర్షన్ తెరపైకొస్తోంది. ఇదిలా వుంటే, ఆసుపత్రిలో చేరిన కాస్సేపటికే రాహుల్ డిశ్చార్జి అయిపోయాడు. స్వల్ప గాయాలే అయ్యాయో.. లేదంటే, వివాదం ముదిరితే మంచిది కాదనుకున్నాడోగానీ.. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు.
కాగా, ఘటన జరిగిన వెంటనే రాహుల్‌పై పొలిటికల్ ఒత్తిడి పెరిగిపోయిందనీ, ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రాహుల్ భయపడిపోయూడనీ అంటున్నారు. ఇందులో నిజమెంతోగానీ.. ఇలాంటి కేసుల్లో ‘పొలిటికల్ ఎంట్రీ’ చాలా ఎక్కువగా జరుగుతుంటుందన్నది నిర్వివాదాంశం.
పైగా పబ్బుల్లో గొడవలంటే.. వాటికి ఎంత పబ్లిసిటీ వస్తుందో.. అంతే తొందరగా ఆ వివాదాలూ సద్దుమణిగిపోతాయి. దానిక్కారణం, పబ్బుల నిర్వహణలో పొలిటికల్ లీడర్ల పాత్రే. ఇదిలా వుంటే, రాహుల్ సిప్లిగంజ్‌కి ఈ విషయంలో అండగా నిలవాలంటూ ఆయా పొలిటికల్ పార్టీల లీడర్లకు అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తులు పంపుతున్నారు. రాహుల్ మాత్రం ఇప్పటిదాకా ఈ ఘటనపై స్పందించలేదు. మరోపక్క, పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
269057 592262Reasonably unusual. Is likely to appreciate it for those who add forums or something, website theme . a tones way for your customer to communicate. Excellent task.. 606989
539678 149107Neat blog! Is your theme custom made or did you download it from somewhere? A theme like yours with a few simple tweeks would really make my blog stand out. Please let me know where you got your design. Kudos 206093