కరోనా లాక్ డౌన్ కారణంగా అయిదు నెలల క్రితం ప్రారంభం అవ్వాల్సిన ‘పుష్ప’ చిత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం షూటింగ్స్ కు అనుమతులు ఇస్తున్నా కూడా కరోనా భయంతో స్టార్స్ ఎవరు ముందుకు రావడం లేదు. బన్నీ కూడా పుష్ప చిత్రం షూటింగ్ కు ఇప్పట్లో వెళ్లేలా కనిపించడం లేదు. సినిమాను శేషాచలం అడవులతో పాటు పలు పల్లెటూర్లలో చిత్రీకరించాలనుకున్నారు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ శ్రేయష్కరం కాదని బన్నీ మరియు సుకుమార్ భావించి ఇంటికే పరిమితం అయ్యారు.
ఖాళీగా ఉన్న ఈ సమయంలో బన్నీ కథలు వింటున్నాడట. పలువురు దర్శకుల కథలు విన్న బన్నీ వారికి మార్పులు చేర్పులు చెబుతూ వారిని తిప్పించుకుంటూ ఉన్నాడట. ఐకాన్ చిత్రంకు గాను చాలా సార్లు వేణు శ్రీరామ్ తో చర్చలు జరిపిన బన్నీ ఇంకా ఆయన స్క్రిప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనే లేదు. అలాగే లింగు స్వామి మరియు విక్రమ్ కుమార్ ల తో కూడా కథా చర్చలు జరిపి చివరకు నచ్చలేదు అంటూ వారికి నో చెప్పాడు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా దర్శకులతో ఒక్క కథకు మూడు నాలుగు వర్షన్ ల స్క్రిప్ట్ ను రాయించి ఎక్కువ శాతం స్క్రిప్ట్ లను క్యాన్సిల్ చేయడం జరుగుతుంది.
సురేష్ బాబు మాదిరిగానే బన్నీ కూడా ఎక్కువ స్క్రిప్ట్ లు విని పదే పదే మార్పులు చేర్పులు చేప్పడం చేస్తూ ఉన్నాడు అంటూ ఆయన గురించి ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త వారి స్క్రిప్ట్ ను ఒక్క పట్టాన మెచ్చని బన్నీ కొరటాల శివ స్క్రిప్ట్ విషయంలో మాత్రం ఏమాత్రం ఆలోచన లేకుండా ఒక్కటి రెండు సిట్టింగ్స్ లోనే పూర్తి చేశాడట. మరి కొత్త వారిని ఎందుకు బన్నీ విసిగిస్తున్నాడు అంటూ కొందరు మౌనంగా ప్రశ్నిస్తున్నారు.
298190 794352Yay google is my king aided me to uncover this outstanding web site! . 780018
536697 528447I visited plenty of web site but I believe this one contains something extra in it in it 398223
57448 981521Wonderful post, Im seeking forward to hear a lot more from you!! 674041
299817 706965Excellent details, greater still to find out your blog that has a great layout. Nicely done 401336
450661 742255Gnarly article mate, maintain the good work, just shared this with ma friendz 959873