Switch to English

ఒకే ఒక్కడు కౌశల్‌ – ది రియల్‌ ‘బిగ్‌బాస్‌’!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

బుల్లితెరపై బిగ్‌ బాస్‌ రియాల్టీ ఓ సంచలనం అయితే. ఆ బిగ్‌బాస్‌ని మించిన సంచలనంగా మారాడు తెలుగునాట ‘బిగ్‌’ పార్టిసిపెంట్‌ కౌశల్‌ మండా. ‘బిగ్‌ బాస్‌’ రియాల్టీ షో తెలుగువారికి పరిచయమైంది యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించిన తొలి సీజన్‌తో. ఆ సీజన్‌ విజేత, సినీ నటుడు శివ బాలాజీతో పోల్చితే, రెండో సీజన్‌ విజేత కౌశల్‌ మండా సాధించిన పేరు ప్రఖ్యాతులు చాలా చాలా ఎక్కువ. శివ బాలాజీ చుట్టూ అసలు వివాదాల్లేవు. ఆయనకు శతృవులు అసలే లేరు బిగ్‌ హౌస్‌లో. కానీ, కౌశల్‌ అలా కాదు. పెద్దగా ఎవరికీ పరిచయం లేనోడు. పైగా, అతనికి బిగ్‌ హౌస్‌లో అందరూ శతృవులే.

సినీ నటుడిగా పలు సినిమాల్లో చేసి, యాడ్‌ ఫిలింస్‌ మేకర్‌గా తన పని తాను చేసుకుపోతుండేవాడు కౌశల్‌ మండా, బిగ్‌ బాస్‌ రియాల్టీ షోలో పార్టిసిపెంట్‌గా అవకాశం వచ్చేదాకా. కానీ, ‘బిగ్‌ బాస్‌’ రియాల్టీ షో, సీజన్‌ 2 అతన్ని పూర్తిగా మార్చేసింది. కొత్త కౌశల్‌ మండాని ప్రపంచానికి పరిచయం చేసింది. నిజానికి, అంతకు ముందూ.. ఆ తర్వాతా ఆయనేం పెద్దగా మారలేదు. కానీ, సమాజానికి అతనేంటో చూపించింది మాత్రం బిగ్‌ బాస్‌ రియాల్టీ షోనే. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా, కొంతమంది వ్యక్తులతో కలిసి కొన్ని రోజులపాటు (దాదాపు వంద రోజులకు పైగా) ఒక ఇంట్లో వుండిపోవడం చిన్న విషయం కాదు. ఆ ఇంట్లో అందరూ తనకు శతృవులే అయినప్పుడు, ఆ పెయిన్‌ ఇంకో లెవల్‌లో వుంటుంది.

ఫస్ట్‌ ఎలిమినేషన్‌ నుంచి లాస్ట్‌ ఎలిమినేషన్‌ వరకు.. కౌశల్‌ మండాని మిగతా హౌస్‌ మేట్స్‌ టార్గెట్‌ చేస్తూనే వచ్చారు. అతని వ్యక్తిత్వంపై దాడి చేశారు.. ఆఖరికి, కుటుంబ సభ్యుల్ని సైతం వివాదంలోకి లాగే ప్రయత్నం చేశారు. ‘బయటకొస్తే, నీ అంతు చూస్తా’ అంటూ బెదిరింపులకు గురిచేశారు హౌస్‌ మేట్స్‌. ఎవరికి వారు తాము గెలవాలన్న ఆలోచన చేయకుండా, అందరూ కలిసి, కౌశల్‌ని ఓడించేందుకు ప్రయత్నించారు. ఏమో, అదే పరోక్షంగా కౌశల్‌కి కలిసొచ్చిందేమో. అందరూ ఓ వైపు, తానొక్కడినే ఇంకో వైపు నిల్చున్నాడు. దృఢ సంకల్పం ముందు ఎన్ని వెకిలి వేషాలైనా ఓడిపోతాయని నిరూపించాడు కౌశల్‌.

తనకెంతో ఇష్టమైన తన గారాల పట్టి తన కుమార్తెను తలచుకుని కంట తడి పెడితే చాలు, కౌశల్‌ నేరం చేసేసినట్లే.. అదో పెద్ద పబ్లిసిటీ స్టంట్‌.. అన్నట్లుగా ఇతర టీమ్‌ మేట్స్‌ వ్యవహరించారు. ఆ టీమ్‌ మేట్స్‌లో కౌశల్‌ కంటే ఎన్నో రెట్లు పాపులర్‌ అయిన స్టార్స్‌ వున్నారు. బుద్ధి బలం సరిపోక, భుజ భలం ప్రదర్శించి కౌశల్‌ మీద భౌతిక దాడులకూ దిగారు. కొంతమంది లేడీ పార్టిసిపెంట్స్‌ అయితే తమ స్థాయిని మరిచి, కౌశల్‌ విషయంలో జుగుప్సాకరంగా ప్రవర్తించారు.. అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేశారు. వల్గర్‌గా తిట్టేశారు. నిలబడ్డాడు, తట్టుకున్నాడు. ఏడాది క్రితం నాటి మాట ఇది.

అప్పటికీ ఇప్పటికీ, కౌశల్‌ అదే దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తున్నాడు. కౌశల్‌ని ఈ స్థాయికి తెచ్చింది అతని మనో నిబ్బరం మాత్రమే కాదు, కౌశల్‌ ఆర్మీ కూడా. ఎలా పుట్టిందో తెలియదు కానీ, కౌశల్‌ని భుజానికెత్తుకుంది. సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా కౌశల్‌ ఏ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడంటే, తెలుగులో ఏ అగ్ర హీరోకీ లేనంతగా. కానీ, బిగ్‌ బాస్‌ రియాల్టీ షో ముగిశాక కూడా కుట్రలు జరిగాయి. ఓ సినిమాలో కౌశల్‌ నటించాల్సి వుంది హీరోగా. కౌశల్‌ని హౌస్‌లో అడ్డుకోలేకపోయిన కొందరు హౌస్‌ మేట్స్‌, సినిమాల్లో మాత్రం అడ్డుకున్నారు. కానీ, కౌశల్‌ ఆర్మీ సేవా కార్యక్రమాల్ని అడ్డుకోలేకపోయారు.

కౌశల్‌ ఆర్మీ మీద బురద జల్లడానికి కొన్ని మీడియా సంస్థలూ ప్రయత్నించాయి. కానీ, అన్నిటినీ తట్టుకుని కౌశల్‌ ధైర్యంగా నిలబడ్డ వైనం.. చాలామందికి ధైర్యాన్నిచ్చింది. అందుకే, కౌశల్‌ ఒకే ఒక్కడు. కౌశల్‌ బిగ్‌ బాస్‌ విన్నర్‌ మాత్రమే కాదు. ఎప్పటికీ బిగ్‌ బాస్‌ అతడే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...