Switch to English

తమ్ముడికి అన్నయ్య చిరంజీవి ఓదార్పు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ ఘోర పరాభవాన్ని చవి చూసింది. పోటీ చేసిన రెండు చోట్లా పవన్‌ కళ్యాణ్‌ ఓడిపోయారు. ఇది పార్టీని మరింత కృంగదీసింది. గెలిచినా, ఓడినా మీ వెంటే మేమంతా.. అంటూ అభిమానులు తమ అభిమాన నటున్ని సోషల్‌ మీడియా వేదికగా ఓదార్చుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ జయాపజయాలకు అతీతుడు. సినీ రంగంలో ఏ పరాజయమూ ఆయన ఇమేజ్‌ని తగ్గించలేకపోయింది. రాజకీయాలు వేరు. ఇక్కడ గెలుపే సమర్ధతకు కొలమానం. కనీసం 8 శాతం ఓట్లు వస్తాయనుకుంటే, 6 శాతం కూడా ఓట్లు సాధించలేకపోయింది జనసేన. దాదాపు 120 స్థానాల్లో డిపాజిట్లు దక్కలేదు.

అయితే, జనసేన ఫక్తు రాజకీయాలు చేయలేదు. చాలా మంది కొత్త వాళ్లే బరిలోకి దిగారు. వాళ్లెవరో కూడా ఆయా నియోజక వర్గాల్లో ఎవరికీ తెలీదు. ఇలా చాలా అంశాలున్నాయి జనసేన పరాజయానికి కారణాలుగా. ఎట్టి పరిస్థితుల్లోనూ, ప్రజలతోనే ఉంటానంటూ, ఓటమి తర్వాత పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన మాటలు జనసైనికుల్లో కొండంత ఉత్సాహాన్నిచ్చాయి. మరోపక్క తమ్మున్ని ఓదార్చేందుకు అన్నయ్య చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారక్కడ. రాజకీయాల్లో ఇలాంటివి మామూలేనని పవన్‌కి చెప్పిన చిరంజీవి, లక్ష్యం పెద్దదైనప్పుడు మార్గం కఠినంగానే ఉంటుందని, మరింత ధైర్యంతో ముందడుగు వేయాలనీ సూచించారట.

ప్రజారాజ్యం పార్టీ విషయంలో చిరంజీవికి అండదంగా పవన్‌ నిలిచినా, జనసేన వైపు చిరంజీవి కన్నెత్తి చూడలేదు. దానికి కారణాలు వేరే ఉన్నాయి. తమ్ముడి గెలుపును కాంక్షించే అన్యయ్యగా చిరంజీవి జనసేనానికి ఓదార్పుగా పలు సూచనలు, సలహాలు ఇచ్చారట. అన్నయ్య ఓదార్పు తమ్ముడికి కొండంత భరోసా అయ్యిందని భావించొచ్చు. అయితే, భవిష్యత్తులో కూడా జనసేనతో చిరంజీవి ప్రత్యక్ష సంబంధాలు నడిపే అవకాశం లేదట. ఎందుకంటే, చిరంజీవి రాజకీయాలకు గుడ్‌బై చెప్పేసి, పూర్తిగా సినిమాలకే సమయం కేటాయిస్తున్నారు. ఇదిలా ఉంటే, నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయిన నాగబాబు నియోజక వర్గ ప్రజలకు అందుబాటులోనే ఉండాలనీ పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారట. అతి త్వరలో పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలో నియోజక వర్గాల వారీగా సమీక్షలు జరగనున్నాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...