Switch to English

ఓటిటి రివ్యూ: గుంజన్ సక్సేన – ది కార్గిల్ గర్ల్ : ఓకే ఓకే బయోపిక్.!

Critic Rating
( 2.50 )
User Rating
( 3.30 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow
Movie గుంజన్ సక్సేన - ది కార్గిల్ గర్ల్ :
Star Cast జాహ్నవి కపూర్, పంకజ్ త్రిపాఠి
Director శరన్ శర్మ
Producer కరణ్ జోహార్ - అపూర్వ మెహతా - జీ స్టూడియోస్
Music జాన్ స్టీవర్ట్ ఎదురి అండ్ అమిత్ త్రివేది
Run Time 1 గంట 52 నిముషాలు
Release ఆగష్టు 12, 2020

1999లో ఇండియా – పాక్ మధ్య జరిగిన కార్గిల్ వార్ లో తన వీరోచిత రెస్క్యూ ఆపరేషన్స్ తో ‘ది కార్గిల్ గర్ల్’ గా పేరు తెచ్చుకున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా రూపొందించిన సినిమా ‘గుంజన్ సక్సేనా – ది కార్గిల్ గర్ల్’. జాహ్నవి కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా థియేటర్ రిలీజ్ కోసం సిద్దమైనప్పటికీ కరోనా పాండెమిక్ వలన ఓటిటి ద్వారా నెట్ఫ్లిక్స్ లో రిలీజయింది. మరి ఈ బయోపిక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

గుంజన్ సక్సేనా(జాహ్నవి కపూర్) చిన్నప్పటి నుంచే పైలట్ అవ్వాలని కలలు కంటుంది. తన ఆలోచనని అనూప్ సక్సేనా(పంకజ్ త్రిపాఠి) సపోర్ట్ చేస్తాడు. పైలర్ అవ్వడం కోసం కావాల్సిన చదువును కూడా పూర్తి చేస్తుంది. కానీ ఫైనాన్షియల్ గా ట్రైనింగ్ ఫీజ్ ని భరించలేక డ్రాప్ అవుతుంది. అప్పుడే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొదటి సారి మహిళా పైలట్స్ కోసం ఓపెనింగ్స్ మొదలు పెడుతుంది. ఎంట్రన్స్ టెస్ట్ లో వందల మంది పాల్గొనగా ఒకే ఒక్క అమ్మాయి సెలక్ట్ అవుతుంది, తనే గుంజన్ సక్సేనా.. ఇక అక్కడి నుంచి కార్గిల్ వార్ వరకూ తన జర్నీ ఎలా సాగింది? అంతమంది ఉన్న జెంట్స్ ఎయిర్ ఫోర్స్ లో మొదటి విమెన్ గా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? అనేదే కథ.

తెర మీద స్టార్స్..

జాహ్నవి కపూర్ కి ఇది రెండవ సినిమా.. కానీ పర్ఫెక్ట్ గా గుంజన్ సక్సేనా పాత్రలో మెప్పించారు. ముఖ్యంగా ఫాదర్ – డాటర్ మరియు ట్రైనింగ్ క్యాంపులో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించింది. రెండవ సినిమాతో తనలోని టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన ఈ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంది. ఫాదర్ పాత్రలో పంకజ్ త్రిపాఠి పాత్ర చాలా బాగా చేసాడు. అంగద్ బేడీ, వినీత్ కుమార్ సింగ్, మానవ్ విజ్ లు కూడా మంచి సపోర్టింగ్ పాత్రల్లో మెరిశారు.

తెర వెనుక టాలెంట్..

కథ పరంగా చూసుకుంటే… ఇది ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గుంజన్ సక్సేనా బయోపిక్.. ఈ బయోపిక్ లో డైరెక్టర్ ఎక్కువగా మొదటి మహిళ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా గుంజన్ సక్సేనా పేస్ చేసిన ప్రాబ్లెమ్స్ గురించి ఎక్కువగా చూపించారు కానీ తన హీరోయిక్ మూమెంట్స్ అలా చూపించి ఫినిష్ చేసేయడం వలన కథని ముగించిన విధానం కాస్త సంతృప్తిని ఇవ్వదు. తన జర్నీలో కొన్ని సీన్స్ ని కూడా డ్రాగా చేసినట్టు అనిపిస్తుంది. కథనం పరంగా కూడా చాలా సన్నివేశాల్లో హై మోమెంట్స్ కి తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పటికీ చాలా సింపుల్ గా తీసుకెళ్లిపోయారు. డైరెక్టర్ కూడా ఉన్న కథని బాగానే తీశారు.. కానీ ఒక హీరోయిక్ లేడీ కథని చెబుతున్నప్పుడు ఆమె పడిన స్ట్రగుల్ తో పాటు తను ఫైట్ చేసిన తీరుని కూడా పలు సీన్స్ తో పాటు తను పేస్ చేసిన అత్యంత కష్టతరమైన మిషన్ ని కూడా చూపించి చివరికి ఓ మంచి కిక్ వచ్చేది. కానీ అది మిస్ అవ్వడం వలన కొంత అసంతృప్తి ఉండిపోతుంది.

మిగిలిన టెక్నికల్ టీం పరంగా చూసుకుంటే.. మనుష్ నందన్ నందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. అమిత్ త్రివేది పాటలు బాగున్నాయి.. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చెప్పుకునే స్థాయిలోలేదు . జాన్ స్టీవర్ట్ ఇంకొంచం బెటర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్కోర్ ఇవ్వాల్సింది. ఆర్ట్ వర్క్ అండ్ సిజి వర్క్ కూడా డీసెంట్ గా ఉన్నాయి.

విజిల్ మోమెంట్స్:

– జాహ్నవి కపూర్ నటన
– ఎమోషనల్ సీన్స్
– మహిళా సాధికారత గురించి చెప్పిన విధానం

బోరింగ్ మోమెంట్స్:

– సాగదీసి సీన్స్
– బెటర్ గా ఉండాల్సిన స్క్రీన్ ప్లే
– క్లైమాక్స్ సడన్ గా ముగించేయడం

విశ్లేషణ:

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఎందరికో స్ఫూర్తి, ఆవిడ కథ ద్వారా మహిళల్లో ఇంకా స్ఫూర్తిని నింపేలా కొన్ని సీన్స్ ని చాలా బాగా చేశారు. కానీ సినిమా పరంగా చూస్తున్నప్పుడు కథతో పాటు ఆడియన్స్ ని ఆధ్యంతం కూర్చోపెట్టే విధంగా కథని తెరపై చూపడంలో కొంతవరకూ విఫలమయ్యారు. టైటిల్ అండ్ పోస్టర్ పరంగా వార్ ఎపిసోడ్స్ అవీ ఇవీ ఉంటాయి అనుకుంటే మాత్రం నిరాశ పడతారు. ఓవరాల్ గా గుంజన్ సక్సేనా అక్కడక్కడా మంచి ఫీల్ ఇస్తుంది, అక్కడక్కడా సాగదీత అనే ఫీలింగ్ ని ఇస్తుంది.

చూడాలా? వద్దా?: బయోపిక్ సినిమాలు ఇష్టపడే వారు హ్యాపీగా చూడచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2.5/5

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...