Switch to English

వీళ్లకి 3.. వాళ్లకు 23: కలసి రావేమో!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వాస్తు, ముహూర్తాలు, సంఖ్యా శాస్త్రం విషయంలో రాజకీయ నాయకులకు కాస్త గట్టి నమ్మకాలే ఉంటాయి. కొన్ని కొన్ని అంకెలు తమకు కలసి రావేమో అని భావిస్తుంటారు. ప్రత్యర్థులు సైతం ఆయా అంశాలపై వారిపై సెటైర్లు కూడా వేస్తుంటారు. తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం మాదిరిగానే 23 కూడా కలిసి రాలేదనే అభిప్రాయాలు ఇటీవల కాలంలో ఎక్కువైన సంగతి తెలిసిందే. గతంలో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను తీసుకున్న టీడీపీకి దేవుడు అదే సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలను మిగిల్చాడంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేశారు.

తాజాగా వైసీపీ పై అదే తరహాలో వ్యంగ బాణాలు సంధించారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మూడు అంకే వైసీపీకి మాడు పగలగొడుతుందేమోనని ఎద్దేవా చేశారు. ‘‘మూడు మాస్కులు అన్నారు క్వాలిటీ లేకపోయే.. మూడు రాజధానులు అన్నారు క్లారిటీలేకపోయే.. మూడు రంగులు అన్నారు ఒక రంగుకి మిగిలిపోయే.. మొత్తానికి ఈ మూడు అన్నది వైసీపీ ప్రభుత్వానికి మాడు పగిలేందుకే అనుకుంటా’’ అని సెటైరికల్ గా వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో జోరుగా తిరుగుతోంది.

ప్రతి ఇంటికీ మూడు మాస్కులు ఇస్తానని ఏపీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, వీటి పంపిణీ సక్రమంగా జరగలేదనే విమర్శలున్నాయి. చాలామందికి ఇవి అందలేదని, ఇచ్చిన మాస్కులు కూడా నాణ్యతపరంగా బాగోలేదని విపక్షాలు ఆరోపణలు చేశాయి. ఇక మూడు రాజధానుల అంశం ఎంత రచ్చ అయిందో చెప్పక్కర్లేదు. రాజధాని తరలింపునకు పెట్టిన ఏ ముహూర్తం కూడా కలిసి రాలేదు. దీంతో ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన సస్పెన్స్ లో పడింది.

అలాగే పంచాయతీ కార్యాలయాలకు పార్టీ మూడు రంగులు వేయాలన్న నిర్ణయంపై కోర్టులో తల బొప్పి కట్టింది. దీంతో నిజంగానే మూడు అనేది వైసీపీకి కలసి రాదా అనే సందేహాలు వైసీపీ శ్రేణుల్లో మొదలయ్యాయి. వీళ్లకు మూడు.. వాళ్లకు ఇరవై మూడు.. కలిసి రావేమో అనే సెటైర్లు కనిపిస్తున్నాయి. తాజాగా ఏపీ సర్కారు ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన 108, 104 వాహనాల ప్రారంభోత్సవం అనంతరం ఒకదానికొకటి ఢీకొని మూడు వాహనాలు దెబ్బతినడం గమనార్హం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...