వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ

0
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ
Firstname
Movie Name
Star Cast
Director
Producer
Run Time
Release Date

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 2/5

నటీనటులు: విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, క్యాథెరిన్, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్ తదితరులు
దర్శకత్వం: క్రాంతి మాధవ్
నిర్మాత: కెఏ వల్లభ
మ్యూజిక్: గోపి సుందర్
రన్ టైమ్: 2 గంటల 26 నిముషాలు
విడుదల తేదీ: ఫిబ్రవరి 14, 2020

విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని చాలా నమ్మాడు. ఇది ఒక ప్యూర్ లవ్ స్టోరీ అని చెప్పాడు. ఒకేసారి నాలుగు ప్రేమ కథల్లో నటించడం వల్లనో ఏమో ఇకపై ప్రేమకథలు చేయబోనని చెప్పాడు. మరి యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ నటించిన చివరి ప్రేమకథ చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ ఎలా ఉందో చూద్దాం.

కథ:

గౌతమ్ (విజయ్ దేవరకొండ) రచయిత కావాలనే తన ప్యాషన్ కారణంగా ఉన్న జాబ్ ను కూడా వదిలేసుకుంటాడు. తన ప్యాషన్ ను చేరుకునే క్రమంలో కాలేజీ నుండి లవ్ చేస్తూ ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న యామిని (రాశి ఖన్నా)ను విస్మరిస్తుంటాడు. దీన్ని భరించలేని యామిని గౌతమ్ ను వదిలేసి వెళ్ళిపోతుంది. మొదట కథలు రాయడానికి ఇబ్బంది పడ్డ గౌతమ్, బ్రేకప్ అయిపోయాక ఒకటికి మూడు ప్రేమ కథలు రాస్తాడు. శీనయ్య, సువర్ణల ఇల్లందులో ప్రేమ కథ, ప్యారిస్ లో గౌతమ్, ఇజాల మధ్య ప్రేమకథ.. ఈ నేపథ్యంలో గౌతమ్ రైటర్ గా సక్సెస్ అయ్యాడా? యామినితో గౌతమ్ లవ్ స్టోరీ చివరికి ఏ టర్న్ తీసుకుంది అన్నది మిగతా కథ.

తెర మీద స్టార్స్..

ముందుగా విజయ్ దేవరకొండ నటన కంటే భిన్నమైన కథలు చేయాలన్న తన తపనను మెచ్చుకోవాలి. వరల్డ్ ఫేమస్ లవర్ చాలా కంప్లికేటెడ్ కథ. ఇందులో విజయ్ మూడు భిన్న పాత్రలు చేయాలి. ఒక రైటర్ గా, ఒక యూనియన్ లీడర్ గా, ఒక మ్యుజిషియన్ గా విజయ్ మూడు పాత్రల్లోనూ పరకాయ ప్రవేశం చేసాడు. అన్నిట్లోకీ శీనయ్య క్యారెక్టర్ మెప్పిస్తుంది. రాశి ఖన్నా పాత్ర ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ క్యారెక్టర్. ఆమె బాగానే చేసింది కానీ అవసరానికన్నా ఆమె పాత్రను ఎక్కువ డిప్రెషన్ లో ఉన్నట్లు చూపించారేమో అనిపిస్తుంది.

ఐశ్వర్య రాజేష్ మెప్పిస్తుంది. ఒక పల్లెటూరి అమ్మాయిగా ఆమె నటన సూపర్బ్. క్యాథెరిన్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. అయితే ఆమెకు దక్కింది పరిమిత పాత్ర మాత్రమే. ఇజబెల్ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. మిగిలిన వాళ్ళందరూ మామూలే.

తెర వెనుక టాలెంట్..

సినిమాటోగ్రఫీ బాగుంది. భిన్న నేపధ్యాలున్న ప్రేమ కథలైనా కూడా జయకృష్ణ గుమ్మడి తన కెమెరా వర్క్ తో మెప్పిస్తాడు. గోపి సుందర్ మ్యూజిక్ ఇంకా బాగుండొచ్చు అన్న ఫీలింగ్ కలిగిస్తుంది. ప్రేమకథలకు సంగీతం ప్రధానం. ఇక్కడే ఈ సినిమా వెనకడుగు వేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎడిటింగ్ ఓకే, అయితే సెకండ్ హాఫ్ పై మరింత శ్రద్ధ పెట్టొచ్చు అనిపిస్తుంది.

కథ పరంగా చూసుకుంటే వరల్డ్ ఫేమస్ లవర్ లో భిన్న లేయర్స్ కనిపిస్తాయి. ఇంత కంప్లికేటెడ్ కథను చెప్పడానికి క్రాంతి మాధవ్ తన వంతు ప్రయత్నం చేసాడు. అయితే ఫస్ట్ హాఫ్ వరకూ ఈ సినిమా బాగానే ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది. సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి ఈ సినిమా బాగా డల్ అవుతుంది. ఇక్కడ నరేషన్ పూర్తిగా గాడి తప్పింది. దర్శకుడిగా క్రాంతి మాధవ్ కు యావరేజ్ మార్కులే పడతాయి. నిర్మాణ విలువులకు ఢోకా లేదు.

విజిల్ మోమెంట్స్:

  • విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్
  • శీనయ్య, సువర్ణల పెర్ఫార్మన్స్
  • ఐశ్వర్య రాజేష్ పెర్ఫార్మన్స్

బోరింగ్ మోమెంట్స్:

  • సోల్ లెస్ స్క్రిప్ట్
  • వీక్ సెకండ్ హాఫ్
  • సాధారణంగా అనిపించే పాటలు

విశ్లేషణ:

మూడు ప్రేమకథలు సమాహారంగా వరల్డ్ ఫేమస్ లవర్ రూపొందింది. ఫస్ట్ హాఫ్ స్టోరీ పరంగా కానీ ఎమోషన్స్ పరంగా కానీ మెప్పిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ తో ప్రేక్షకులు డిస్ కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. మెయిన్ ప్రేమ కథే సోల్ లెస్ గా తయారై తేలిపోవడంతో ఆ ఎఫెక్ట్ మిగతా సినిమాపై కూడా పడుతుంది. విజయ్ దేవరకొండ ఛరిస్మా ఈ సినిమాను ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

ఇంటర్వల్ మోమెంట్: ఎమోషన్స్ బాగున్నాయి. ముఖ్యంగా శీనయ్య, సువర్ణల ప్రేమకథ మనసును హత్తుకుంటుంది. సెకండ్ హాఫ్ బాగుంటే ఈ చిత్రానికి తిరుగులేదు.

ఎండ్ మోమెంట్: ఈ ప్రేమకథలో అసలు ఫీల్ లేదేంటి. ఆమ్మో క్లైమాక్స్!!

చూడాలా? వద్దా?: ట్రైలర్ చూస్తే చూడాలనిపించినా లైట్ తీసుకోవడం బెటర్

బాక్స్ ఆఫీస్ రేంజ్: విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ మూలంగా సినిమాకు ఓపెనింగ్స్ విషయంలో ఢోకా లేదు. అయితే సినిమా కంటెంట్ విషయంలో వీక్ గా ఉండడంతో బిలో యావరేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

గమనిక: మా బాక్స్ ఆఫీస్ రేంజ్ అనేది సినిమా రేటింగ్ మీదే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా హీరో స్టార్డం, భారీ రిలీజ్ మరియు రిలీజ్ అయిన సీజన్ ని కూడా కలుపుకొని చెబుతాం.

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 2/5

No posts to display