Switch to English

‘సైరా’ రచ్చ: లక్షల కోసమా.? కోట్ల కోసమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్టోబర్‌ 2న సినిమా విడుదల కానుండగా, అక్టోబర్‌ 1 రాత్రికే తొలి షో పడిపోనుంది. అంటే.. కొద్ది గంటల్లో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకి సంబంధించి ‘రిపోర్ట్స్‌’ వచ్చేస్తాయన్నమాట. సినిమా ఎలా వుంటుంది.? అన్నదానిపై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసింది.

మరోపక్క, ‘సైరా నరసింహారెడ్డి’కి వ్యతిరేకంగా జరుగుతున్న రచ్చ మాత్రం కొనసాగుతూనే వుంది. మొత్తం 7 కుటుంబాలు.. ఒక్కో కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుని మోసం చేశారంటూ ఉయ్యాలవాడ వారసుల పేరుతో కొందరు ఆరోపిస్తోన్న విషయం విదితమే. ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తంగా 50 కోట్లు డిమాండ్‌ చేయడం వల్లే సమస్య జఠిలం అయ్యిందన్నది ఇంకో వాదన. మెగాస్టార్‌ చిరంజీవి తన తాజా ఇంటర్వ్యూలో 50 కోట్ల ప్రస్తావన తీసుకురావడంతో, ఉయ్యాలవాడ వారసులంటూ తెరపైకొచ్చినవారు మరింత గగ్గోలు పెడుతున్నారు. ‘వారు ఇస్తామని చెప్పింది కుటుంబానికి 15 లక్షలు మాత్రమే.. మొత్తంగా కోటి రూపాయల పై చిలుకు మాత్రమే.. 50 కోట్లని ఎలా చెబుతారు.?’ అని ‘సైరా’కి వ్యతిరేకంగా నినదిస్తున్నవారు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా వుంటే, ఈ వ్యవహారంపై ‘గద్దలకొండ గణేష్‌’ దర్శకుడు హరీష్‌ శంకర్‌ స్పందిస్తూ, తాను ‘వాల్మీకి’ పేరుతో సినిమా తీసి, వివాదం కారణంగా పేరు మార్చుకోవాల్సి వచ్చిందనీ, సినిమా ముందు వరకూ తనను ఏడిపించారనీ వాపోయాడు. ‘మా తాత లేదా ముత్తాత మీద ఎవరైనా సినిమా తీస్తే, వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళను నా నెత్తిన జల్లుకుంటా.. నాకు చరిత్ర మీద అవగాహన తక్కువ.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి తెలిసింది ఈ సినిమాతోనే.. ఈ విషయంలో చిరంజీవికి హేట్సాఫ్‌..’ అంటూ హరీష్‌ తనదైన స్టయిల్లో స్పందించాడు.

ఇక్కడ మేటర్‌ క్లియర్‌.. ‘సైరా నరసింహారెడ్డి’ వివాదం వెనుక ఎవరో వున్నారు. పనిగట్టుకుని ‘మెగా’ సినిమాల మీదనే ప్రతిసారీ వివాదాలు పుట్టుకొస్తున్నాయంటే.. ఇందులో రాజకీయ కుట్ర కోణం లేదని ఎలా అనుకోగలం.? అన్నది మెగా అభిమానుల వాదన.

6 COMMENTS

  1. 615990 244484Good post. I be taught 1 thing much more challenging on entirely different blogs everyday. It will all the time be stimulating to learn content material from other writers and apply slightly one thing from their store. Id desire to use some with the content on my blog whether you dont mind. Natually Ill give you a hyperlink on your net weblog. Thanks for sharing. 801675

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...