Switch to English

8న ఏపీలో నామినేటెడ్ జాతర

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పదవుల పందేరానికి తెర లేవబోతోంది. ఈనెల 8న వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆ రోజున నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఖాళీగా ఉన్న రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులను అసెంబ్లీ సమావేశాలు పూర్తి కావడానికి ముందే కేటాయించే దిశగా కసరత్తు చేస్తున్నారు.

రాష్ట్ర స్థాయి పదవులను మంత్రి పదవులు రానివారికి, జిలా స్థాయి పదవులను ద్వితీయ శ్రేణి నాయకులకు ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కసరత్తు వేగంగా సాగుతోందని, ఈనెల 8న వైఎస్ జయంతి సందర్భంగా వారి పేర్లను ప్రకటిస్తారని పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఎలాగైనా జగన్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుల కోసం ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు. పలువురు నేతలు తమకు అవకాశం కల్పించాలని సీఎం జగన్ ను కలిసి విన్నవించుకుంటున్నారు.

టీటీడీ బోర్డు సభ్యలుగా గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిల పేరు ఖరారయ్యాని సమాచారం. తెలంగాణ నుంచి మైహోం రాజేశ్వరరావు ఎంపిక ఖాయమైందని తెలుస్తోంది. ఇక రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ప్రముఖ నటుడు మోహన్ బాబును నియమిస్తారని అంటున్నారు. ఇంతకుముందే ఈ అంశం వెలుగులోకి వచ్చినా, మోహన్ బాబు వాటిని ఖండించారు. కానీ, వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన మోహన్ బాబు ఆ పదవి ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు. ఆ

ర్టీసీ చైర్మన్ గా అంబటి రాంబాబు పేరు పరిశీలనలో ఉంది. భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కి కాపు కార్పొరేషన్ చైర్మన్ గా, ద్రోణంరాజు శ్రీనివాస్ కు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం కల్పించాలని జగన్ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మొత్తమ్మీద మంత్రి పదవులు రానివారిని, చాలాకాలంగా పార్టీ కోసం కష్టపడుతున్నవారిని నామినేటెడ్ పదవులతో గౌరవించనున్నారు. అలాగే జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్సీ, బీసీలకు 50 శాతం ఇస్తామని గతంలో జగన్ ప్రకటించారు. ఇప్పుడు అందుకు అనుగుణంగానే జాబితా సిద్దం చేస్తున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...