Switch to English

జనసేనాని సభల్లో కనిపించేవాళ్ళెవరూ ఓట్లెయ్యరా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో, ఆయన ఎక్కడికి వెళ్ళినా జనం పోటెత్తేవారు. కానీ, ఆ స్థాయికి తగ్గ రీతిలో ప్రజారాజ్యం పార్టీ అప్పట్లో సత్తా చాటలేకపోయింది. సాక్షాత్తూ చిరంజీవి, పాలకొల్లులో ఓడిపోయారు. తిరుపతిలో గెలిచారనుకోండి.. అది వేరే సంగతి. ప్రజారాజ్యం పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలుగా గెలిచారు కూడా.

కానీ, ప్రజారాజ్యం పార్టీ మనుగడ సాధించలేకపోయింది. రెండు ప్రధాన రాజకీయ పార్టీలు, రెండు సామాజిక వర్గాలు ప్రజారాజ్యం పార్టీ మీద కక్షగట్టాయి.. ప్రజారాజ్యం పార్టీ కాలగర్భంలో కలిసిపోవడానికి కారణమయ్యాయి. సరే, చిరంజీవి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసెయ్యడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజ్యసభకు వెళ్ళి, కేంద్ర మంత్రి అవడం.. ఆ తర్వాత శాశ్వతంగా రాజకీయాలకు దూరమవడం.. అవన్నీ వేరే వ్యవహారాలు.

మరిప్పుడు, జనసేన పరిస్థితేంటి.? 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ దారుణ పరాజయాన్ని చవిచూసింది. 2024 ఎన్నికల్లో ఏమవుతుంది.? గతంలో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన జనసేనాని కోసం ఇప్పుడు పెద్దయెత్తున జనం స్వచ్ఛందంగా ఎందుకు తరలి వస్తున్నారు.? వచ్చేవాళ్ళెవరూ ఓట్లెయ్యరా.? ఇలాంటి చర్చ జరగడం సహజమే.

ఎన్నికలంటే, బోల్డన్ని ఈక్వేషన్స్ వుంటాయి. కుల, మత, ప్రాంత రాజకీయాలు నడుస్తాయ్. డబ్బుతో ఓట్లను కొనేయడం రాజకీయ పార్టీలకు అలవాటే. ఇవన్నీ చేయగలిగితే, జనసేన పార్టీ ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సంపాదించేది.

కానీ, జనసేనకు కావాల్సింది అది కాదు.! మార్పు ప్రజల్లోంచి రావాలి. వైసీపీకి ఓట్లేసి, రోడ్ల మీద నరకం చూస్తున్న ప్రజల్లో మార్పు రావాలి. సంక్షేమ పథకాల పేరుతో అప్పులు చేసి, డబ్బులు పంచుతున్న జగన్ సర్కారు, తమను నిలువునా ముంచేస్తుందన్న ఆలోచన జనంలో రావాలి. జనసేనాని కోరుకునేది అదే. అలాంటి మార్పు వచ్చినప్పుడే, రాష్ట్రం బలోపేతమవుతుంది.

వస్తోంది.. ఆ మార్పు కనిపిస్తోంది.. కానీ, ఓటర్ల మెదళ్ళను కలుషితం చేసేందుకు అటు వైసీపీ, ఇటు టీడీపీ.. ఆ రెండు సామాజిక వర్గాలు.. తమదైన రీతిలో దిక్కుమాలిన వ్యూహాలు రచించడం మొదలెట్టేశాయ్. మరి, ఈసారి జనం ఏం చేస్తారో.. తమ భవిష్యత్తుని ఎలా రాసుకుంటారో వేచి చూడాల్సిందే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

రాజకీయం

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

ఎక్కువ చదివినవి

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది. కేదార్ సెలగంశెట్టి నిర్మాణంలో వీరి...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...