Switch to English

Home సినిమా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో రాజమౌళి.. అప్పుడు, ఇప్పుడు.!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో రాజమౌళి.. అప్పుడు, ఇప్పుడు.!

0
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో రాజమౌళి.. అప్పుడు, ఇప్పుడు.!
Firstname
Movie Name
Star Cast
Director
Producer
Run Time
Release Date

Auto Draft‘స్టూడెంట్‌ నెం.1’ సినిమాకి 18 ఏళ్ళు పూర్తయ్యాయి. రాజమౌళి దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన చిత్రమది. అప్పట్లో ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, రాజమౌళి.. ఈ ఇద్దరూ ఆ నాటి సంగతుల్ని సోషల్‌ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు.

ప్రస్తుతం రాజమౌళి – ఎన్టీఆర్‌ కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కోసం పనిచేస్తున్నారు. ‘స్టూడెంట్‌ నెం.1’ సినిమాలో చాలావరకు రామోజీ ఫిలిం సిటీ లొకేషన్లను వాడుకున్న విషయం విదితమే. ఇప్పుడూ అక్కడే వున్నారు రాజమౌళి, ఎన్టీఆర్‌. అచ్చంగా ఆనాటి ఆ పరిస్థితులకు తగ్గట్టుగా ఇప్పుడు లేటెస్ట్‌గా ఫొటోలు దిగి, వాటిని సోషల్‌ మీడియాలో ఇద్దరూ పోస్ట్‌ చేశారు. యంగ్‌ టైగర్‌ ఏం చేసినా సంచలనమే. రాజమౌళి సంగతి సరే సరి. అప్పుడే పద్ధెనిమిదేళ్ళయిపోయిందా.? అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

నిజమే, ఈ 18 ఏళ్ళలో యంగ్‌ టైగర్‌ చాలా మారిపోయాడు. ఎన్నో విజయాల్ని అందుకున్నాడు, కొన్ని ఫ్లాపుల్ని కూడా చూశాడు. టాలీవుడ్‌ అగ్రహీరోల్లో ఇప్పుడు ఎన్టీఆర్‌ కూడా ఒకడు. మరోపక్క, రాజమౌళి.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పే స్థాయికి ఎదిగాడు. ఎన్టీఆర్‌ – రాజమౌళి వేసిన తొలి అడుగు ఓ అద్భుతం. ఆ తర్వాత ‘సింహాద్రి’ సినిమాతో మరో ఘనవిజయాన్ని అందుకున్నారు. మధ్యలో ఈ ఇద్దరూ ‘యమదొంగ’ సినిమా కోసం పనిచేశారు.

ఇప్పుడు ముచ్చటగా నాలుగోసారి.. రాజమౌళి – ఎన్టీఆర్‌ చేతులు కలిపారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి అదనపు ఆకర్షణ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా! ఏదిఏమైనా, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. జక్కన్న రాజమౌళి ఆనాటి ఆ తీపి గుర్తుల్ని గుర్తు చేసుకుంటోంటే.. అభిమానుల ఆనందానికి హద్దులుంటాయా.?