Switch to English

Home సినిమా ప్రభాస్ బర్త్ డే స్పెషల్: మైండ్ బ్లోయింగ్ టాప్ 10 యాక్షన్ ఎపిసోడ్స్.!

ప్రభాస్ బర్త్ డే స్పెషల్: మైండ్ బ్లోయింగ్ టాప్ 10 యాక్షన్ ఎపిసోడ్స్.!

0
ప్రభాస్  బర్త్ డే స్పెషల్:  మైండ్ బ్లోయింగ్ టాప్ 10 యాక్షన్ ఎపిసోడ్స్.!
Firstname
Movie Name
Star Cast
Director
Producer
Run Time
Release Date

ప్రభాస్ బర్త్ డే స్పెషల్: మైండ్ బ్లోయింగ్ టాప్ 10 యాక్షన్ ఎపిసోడ్స్.!ఆరడుగుల ఆజానుబాహుడు, ఆ కౌటౌట్ చూడగానే విలన్స్ వెన్నులో వణుకు పుడుతుంది, అతనే మన బాహుబలి అలియాస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. మొదటి నుంచీ ప్రతి డైరెక్టర్ తన కటౌట్ ని సరికొత్తగా చూపించడానికి, తన బాడీకి తగ్గట్టు యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకునేవారు. ప్రభాస్ కెరీర్లో క్లాస్ సినిమాలు ఉన్నప్పటికీ తన స్టంట్స్ మరియు కటౌట్ కి మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అందుకే డైరెక్టర్స్ ఎంత క్లాస్ సినిమా తీసిన ఒకటి రెండు యాక్షన్ ఎపిసోడ్స్ పక్కాగా ఉండేలా చూసుకునేవారు.

అలా ప్రభాస్ కెరీర్లో ఎప్పుడు చూసినా మనకు రోమాలు నిక్కబొడుచుకునే ఫీల్ ని క్రియేట్ చేసే టాప్-10 యాక్షన్ ఎపిసోడ్స్ లిస్టుని మీకందిస్తున్నాం..

1. రాఘవేంద్ర

ప్రభాస్ బర్త్ డే స్పెషల్: మైండ్ బ్లోయింగ్ టాప్ 10 యాక్షన్ ఎపిసోడ్స్.!‘రాఘవేంద్ర’ సినిమా ప్రీ క్లైమాక్స్ లో తన తల్లి తండ్రులు చెప్పారని రాఘవేంద్ర స్వామి దీక్షని విడిచి నార్మల్ గా మారి తన మరదల్ని అల్లరి పెట్టిన రౌడీ గ్యాంగ్ ని చితక్కొట్టే సీన్ లో తన ఎలివేషన్ కి ఇప్పటికీ విజిల్స్ ఉంటాయి.

2. వర్షం

ప్రభాస్ బర్త్ డే స్పెషల్: మైండ్ బ్లోయింగ్ టాప్ 10 యాక్షన్ ఎపిసోడ్స్.!‘వర్షం’ ఫస్ట్ హాఫ్ లో గోపీచంద్ మనిషైన రఘుబాబు ప్రభాస్ అక్క కొడుకుని కిడ్నాప్ చేసి ప్రభాస్ తో ఆడుకునే యాక్షన్ ఎపిసోడ్ లో ప్రభాస్ లోని కంప్లీట్ మాస్ ప్రెజన్స్ ని బయటకి తీసుకొచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా ఇందులో తనకి కంపోజ్ చేసిన షాట్స్, తన కటౌట్ బిహేవియర్, తన పెర్ఫార్మన్స్ మనకు కంటిన్యూగా రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ముఖ్యంగా ఆటోని ఢీ కొట్టే షాట్ , బోరింగ్ ని పీకి కొట్టడం లాంటి బ్లాక్స్ సూపర్బ్ అనిపిస్తాయి.

3. చక్రం

ప్రభాస్ బర్త్ డే స్పెషల్: మైండ్ బ్లోయింగ్ టాప్ 10 యాక్షన్ ఎపిసోడ్స్.!‘చక్రం’ సినిమా అంతగా ఆడకపోయినా ఇందులో ఉన్న ఒకే ఒక్క యాక్షన్ బ్లాక్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. జీవ అండ్ గ్యాంగ్ వచ్చి పద్మనాభం ఇంటిని ఖాళీ చేస్తుంటే మొదట కూల్ గా చెప్పడానికి ట్రై చేసి తర్వాత కోపంతో చేసే ఫైట్ సింప్లీ సూపర్బ్. అలాగే కృష్ణవంశీ ప్రభాస్ కటౌట్ దృష్ట్యా ఒక మనిషిని ఒకే దెబ్బ కొట్టాలి అని కండిషన్ పెట్టి మరీ ఫెంటాస్టిక్ గా కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ ఇది.

4. ఛత్రపతి

ప్రభాస్ బర్త్ డే స్పెషల్: మైండ్ బ్లోయింగ్ టాప్ 10 యాక్షన్ ఎపిసోడ్స్.!ఛత్రపతి’లో కాట్రాజ్ యాక్షన్ బ్లాక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా.. ఈ బ్లాక్ ప్రభాస్ కెరీర్లో ఎన్ని సినిమాలు వచ్చిన, ఎన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చేసినా టాప్ – 5 లో ఇది పక్కాగా ఉంటుంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ లో రాజమౌళికి ప్రభాస్ ఇచ్చిన ఎలివేషన్,, చూపించిన విధానం నెక్స్ట్ లెవల్. దాంతోనే ప్రభాస్ టాప్ స్టార్స్ లో ప్లేస్ సంపాదించుకున్నాడు.

5. బుజ్జిగాడు

ప్రభాస్ బర్త్ డే స్పెషల్: మైండ్ బ్లోయింగ్ టాప్ 10 యాక్షన్ ఎపిసోడ్స్.!బుజ్జిగాడులో కెరీర్లో చాలా డిఫరెంట్ గా, తనని తానూ కొత్తగా ఆవిష్కరించుకుంటూ చేసిన సినిమా. ఈ మూవీలో డైలాగ్స్ తో పాటు, యాక్షన్ ఎపిసోడ్స్ లో మ్యానరిజమ్స్ కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఇంటర్వల్ బ్లాక్ లో మోహన్ బాబుని వేసెయ్యడానికి చేసే ఫైట్ సూపర్బ్..

6. రెబల్

ప్రభాస్ బర్త్ డే స్పెషల్: మైండ్ బ్లోయింగ్ టాప్ 10 యాక్షన్ ఎపిసోడ్స్.!అప్పటి వరకూ అమాయకుడిగా రెబల్ స్టార్ కృష్ణంరాజు ముందు కనిపించిన ప్రభాస్ ఒక్కసారిగా ఉగ్ర రూపుడై, కండలు తిరిగిన బాడీతో చేసే ఫైట్ ‘రెబల్’ సినిమాకే హైలైట్.

7. మిర్చి

ప్రభాస్ బర్త్ డే స్పెషల్: మైండ్ బ్లోయింగ్ టాప్ 10 యాక్షన్ ఎపిసోడ్స్.!‘మిర్చి’లో ఆడియన్స్ కి కిక్ ఇచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కొన్ని ఉన్నాయి. అందులో హైలైట్ అంటే సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ పెళ్లి జరుగుతున్న టైంలో విలన్స్ అటాక్ చేసినప్పుడు ప్రభాస్ పంచ కట్టులో చేసే ఫైట్ సూపర్బ్ మరియు సంపత్ మా వాళ్ళని పది మందిని కొట్టు నువ్వు మగాడివని నమ్ముతా అని ఛాలెంజ్ చేసినప్పుడు వచ్చే యాక్షన్ బ్లాక్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. ముఖ్యంగా ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమా అరిలీజ్ అయినప్పుడు లేదు తర్వాత యాడ్ చేశారు.

8. బాహుబలి

ప్రభాస్ బర్త్ డే స్పెషల్: మైండ్ బ్లోయింగ్ టాప్ 10 యాక్షన్ ఎపిసోడ్స్.!బాహుబలి’లో ప్రభాస్ మొదటి నుంచి ఎదో ఒక స్టంట్ లాంటిది చేస్తూనే ఉంటాడు. కానీ క్లైమాక్స్ లో వార్ ఎపిసోడ్ మాత్రం ఫెంటాస్టిక్. ఈ వార్ లో ప్రభాస్ ఎపిసోడ్ మొత్తం ఆడియన్స్ రోమాలు నిక్కబొడుచుకొని, సీట్ చివర్లో కూర్చొని వాళ్లే యుద్ధం చేస్తున్న ఫీల్ ని క్రియేట్ చేసాడు.

9. బాహుబలి 2

ప్రభాస్ బర్త్ డే స్పెషల్: మైండ్ బ్లోయింగ్ టాప్ 10 యాక్షన్ ఎపిసోడ్స్.!ఎన్ని ఫైట్స్ చేసినా హీరో – మెయిన్ విలన్ కి మధ్య జరిగే ఫైట్ పై ఆడియన్స్ కి ఎప్పుడు అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అనుకున్నదానికన్నా ఎక్కువగా మెప్పించిన యాక్షన్ ఎపిసోడ్ ప్రభాస్ – రానాల క్లైమాక్స్ బ్లాక్. ఈ ఎపిసోడ్ చూసి ఫిదా కానీ వాళ్ళు ఎవరూ ఉండరు.

10. సాహో

ప్రభాస్ బర్త్ డే స్పెషల్: మైండ్ బ్లోయింగ్ టాప్ 10 యాక్షన్ ఎపిసోడ్స్.!రీసెంట్ గా వచ్చిన ‘సాహో’లోనూ క్లైమాక్స్ లో తనని కట్టేసి ఉండగా క్లైమాక్స్ లో విలన్స్ తో చేసే ఫైట్ మనషి హై ఫీల్ ఇస్తుంది.

ఎంతోమందితో పాటు మాకు నచ్చిన ఈ టాప్ – 10 యాక్షన్ ఎపిసోడ్స్ ని లిస్టుగా చేసాం. మేము ఏదన్నా మిస్ అయ్యి ఉన్నా, లేక మీకు నచ్చినవి వేరే యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలపండి.