Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో సాధించిన పేరు ప్రఖ్యాతుల గురించి కొత్తగా చెప్పేదేముంది.? రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు నడుస్తున్నాగానీ, పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఎగబడుతున్న పరిస్థితి వుంది.
ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటున్న పవన్ కళ్యాణ్, ఒక్కో సినిమాకీ 50 నుంచి 75 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. 100 కోట్ల పైన బిజినెస్ అయితే తప్ప, ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్‌కి రెమ్యునరేషన్ ఇవ్వడం సాధ్యమా.?
‘నీ సినిమా వంద కోట్ల బిజినెస్ ఏనాడైనా చేసిందా.?’ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని, పవన్ కళ్యాణ్ మీద ప్రశ్నలు సంధించారు. అసలు పవన్ కళ్యాణ్ స్టార్డమ్ ఏంటి.? పేర్ని నాని ప్రశ్నించడమేంటి.? పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’, ‘భీమ్లానాయక్’ సినిమాలకి నెగెటివ్ రివ్యూలు ప్రచారం చేసుకున్న బ్యాచ్‌లో పేర్ని నాని ప్రథముడు.
కానీ, ఆ సినిమాల్ని, వాటి విజయాల్ని పేర్ని నాని అండ్ టీమ్ అడ్డుకోగలిగిందా.? ‘వంద కోట్లు వసూలు చేశాయి.. ఆ రెండు సినిమాలు..’ అని ఓ సందర్భంలో ఇదే పేర్ని నాని సెలవిచ్చారాయె.! పూటకో మాట.! అసలేం మాట్లాడుతున్నారో అర్థం కాని స్థితిలో ఏవేవో మాట్లాడేసే నాయకులు.!
అయినా, పవన్ కళ్యాణ్ సినిమాల గురించి, వాటి వసూళ్ళ గురించి.. నిర్మాతలు కదా లెక్కలేసుకోవాల్సింది.? పవన్ కళ్యాణ్ మీద 75 కోట్ల మేర నిర్మాత ఖర్చు చేస్తున్నాడంటే, ఆ నిర్మాతకు లాభం లేకుండానే సినిమా తీస్తాడా.? ఛాన్సే లేదు. నిర్మాతకు లేని నొప్పి.. రాజకీయ నాయకులకు ఎందుకు.? పైగా, ఆ సినిమాల్ని అడ్డుకుంటున్నవారికి ఎందుకంత నొప్పి.?