Switch to English

అఖిల్ నాలుగోది మొదలెట్టాడు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow
అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ప్రోడ‌క్ష‌న్ నెం 5 గా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో నిర్మాత‌లు బ‌న్నీవాసు , వాసు వ‌ర్మ లు నిర్మాత‌లుగా  తెరకెక్కే చిత్రం పూజాకార్య‌క్ర‌మాలు ఈరోజు  ఫిల్మ్‌న‌గ‌ర్ టెంపుల్ లో మొదలైంది .  కింగ్ నాగార్జున గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా అల్లు అర్జున్ త‌న‌యుడు  అల్లు  ఆయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా  అల్లు అర‌వింద్ మ‌న‌మరాలు  బేబి అన్విత క్లాప్ కొట్టారు.

అక్కినేని  న‌ట వార‌సుడుగా ప‌రిచ‌య‌మైన అఖిల్ అక్కినేని త‌న‌ సినిమాల ద్వారా త‌న‌కంటూ  ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. త‌ను చేసిన హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్జూ లాంటి ల‌వ్ కమ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్స్ తో అక్కినేని అభిమానుల‌నే కాకుండా ఫ్యామిలి అండ్ గ‌ర్ల్స్ సెక్టార్ లో అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. బొమ్మ‌రిల్లు లాంటి చిత్రం ఇప్ప‌టికి ట్రెండ్ సెట్ట‌ర్ ఇన్ ల‌వ్ అండ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా నిలిచిపోయిందంటే అది కేవ‌లం ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ విజ‌న్ అండ్ వాల్యూస్ అని చెప్పాలి. ఆ త‌రువాత వ‌చ్చిన ప‌రుగు చిత్రం ప్ర‌తి ఓక్క‌రిని ఆలోచింప‌చేసేలా అద్బుతంగా తీర్చిదిద్దాడు. ఫ్యామిలి ఆడియ‌న్స్ లో భాస్క‌ర్ ది సెప‌రేటు ఇమేజ్ వుంది. ఇప్ప‌డు వీర‌ద్దిరి కాంబినేష‌న్ లో చిత్రం అన‌గానే ఈ క్రేజ్ మ‌రింత పెరిగింది.  గ‌తం లో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో మెగా హీరోలు కాకుండా చేసిన చిత్రం 100% ల‌వ్‌.. ఈ చిత్రం లో అక్కినేని నాగ చైత‌న్య హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం లో బ‌న్ని వాసు నిర్మించాడు. ఈ చిత్రం చాలా మంచి విజ‌యాన్ని సాధించ‌టం విశేషం.. మ‌ళ్ళి ఇప్పుడు అక్కినేని వారి మ‌రో న‌ట వార‌సుడు అఖిల్ అక్కినేని హీరోగా నిర్మాత‌లు బ‌న్ని వాసు, వాసు వ‌ర్మ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని బొమ్మ‌రిల్లు   భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నారు.

మెగాప్రోడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్స‌ణ లో బ‌న్ని వాసు ప్రోడ్యూస‌ర్ గా 100% ల‌వ్ నుండి పిల్లా నువ్వులేని జీవితం, గీతా గోవిందం వ‌ర‌కూ వ‌ర‌స బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాలు సొంతం చేసుకున్నారు. సెలెక్టెడ్ స్క్రీప్ట్ ల‌తో అప్‌డేటెడ్ గా అల్లు అర‌వింద్  స‌ల‌హ‌లు సూచ‌న‌ల‌తో బ‌న్ని వాసు యువ నిర్మాత గా స‌క్స్‌రేట్ ఎక్కువుగా వున్న నిర్మాతల్లో ఓక‌డిగా త‌న‌కంటూ  ప్రత్యేకత ని ఏర్ప‌రుచుకున్నాడు. ఇప్ప‌డు ఈ చిత్ర క‌థ న‌చ్చిన మ‌రో యంగ్ ద‌ర్శ‌కుడు వాసు వ‌ర్మ మెట్ట‌మెద‌టిసారిగా నిర్మాణ రంగంలోకి బ‌న్ని వాసుతో క‌లిసి అఖిల్ అక్కినేని తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు, మ‌రియు షూటింగ్ షెడ్యూల్స్ వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం అని నిర్మాత‌లు తెలిపారు..

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...