మొత్తానికి పూరి జగన్నాద్ తన ఉనికిని మళ్ళీ చాటుకున్నాడు. వరుస పరాజయాలతో పూరి పని అయిపొయింది అనుకున్న వాళ్లకు .. ఇస్మార్ట్ శంకర్ తో జవాబు చెప్పించాడు. రామ్ హీరోగా పూరి దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కలక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం ఇప్పటి వరకు 63 కోట్ల గ్రాస్ ని వసూలు చేయడం విశేషం. ఇక రామ్ కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ ఇవే.
అయితే ఈ మద్యే విడుదలైన డియర్ కామ్రేడ్ ఎఫెక్ట్ ఇస్మార్ట్ పై పడుతుందని అనుకున్నారు .. కానీ కామ్రేడ్ విషయంలో భిన్నమైన టాక్ రావడంతో అది ఇస్మార్ట్ కు కలిసి వచ్చింది. ఈ సినిమా ఈ వారాంతం వరకు 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం గ్యారంటీ అంటూన్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఈ సినిమా విడుదలకు ముందు పరిస్థితి మరోలా ఉండేది. పూరి జగన్నాధ్ ఈ సినిమా విడుదల విషయంలో చాల టెన్షన్ పడ్డాడు .. టెన్షన్ పెట్టారు కూడా. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పూరి జగన్నాధ్ స్పందిస్తూ చాలా మాటలు చెప్పారు. సినిమా పూర్తయిన తరువాత దర్శకుడిగా ఎలాంటి ఇబ్బంది పడలేదు కానీ నిర్మాతగా మాత్రం చాలా టెన్షన్ పడ్డాను .. కొందరు నన్ను ఒక ఆట ఆడుకున్నారంటూ చెప్పారు. వారు నన్ను ఎంత టార్చర్ పెట్టారో త్వరలో చెబుతా అని అన్నాడు.
నిజమే చిన్న సినిమా విడుదల సమయంలో సినిమా కష్టాలు ఓ రేంజ్ లో ఉంటాయని ఏ నిర్మాతను అడిగిన చెబుతారు. ఇక ప్లాప్ లో ఉన్న దర్శకుడి సినిమా అంటే మరి చీప్ గా చూస్తారని, తక్కువ రేటుకు కొనుగోలు చేసేలా అందరు కలిసి ప్లాన్ చేస్తారని షాకిచ్చాడు. నాకు ఇలాంటివి చాలా జరిగాయని చెప్పాడు పూరి. మొత్తానికి పూరి కష్టాలకు ఇస్మార్ట్ చెక్ పెట్టేసాడు.
870119 436821But wanna remark which you have a really decent internet web site , I love the style it actually stands out. 138711
844442 902163Not long noticed concerning your internet website and are nonetheless already reading along. I assumed ill leave my initial comment. i do not verify what saying except that Ive enjoyed reading. Nice weblog. ill be bookmarking keep visiting this web site actually typically. 543092
38836 411639I extremely happy to locate this site on bing, just what I was searching for : D too bookmarked . 385889