Switch to English

మహేష్‌ వదిలేసిన సినిమా విజయ్‌ చేతుల్లోకి!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

సుకుమార్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కాల్సి వుంది. అయితే, కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్‌ అటకెక్కింది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ని వదిలేసి, కమర్షియల్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి వైపు మొగ్గు చూపాడు మహేష్‌. అలా ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా పట్టాలెక్కిన సంగతి తెల్సిందే. మహేష్‌ తనను తిరస్కరించడంతో సుకుమార్‌ తొలుత డీలాపడ్డాడు. అయితే, అతనికి అల్లు అర్జున్‌ నుంచి తీపి కబురు అందింది. సుకుమార్‌ – అల్లు అర్జున్‌ కాంబోలో సినిమా ఫైనల్‌ అయ్యింది కూడా. అయితే, అల్లు అర్జున్‌ ముందుగా త్రివిక్రమ్‌ సినిమా పూర్తి చేయాల్సి వుంది. ఆ సినిమా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయనుకోండి. అది వేరే విషయం.

ఇదిలా వుంటే, మహేష్‌తో చేయాలనుకున్న సినిమా విషయమై సుకుమార్‌ చాలా సీరియస్‌గా వున్నాడట. మహేష్‌ వద్దన్నాడు గనుక, ఆ సబ్జెక్ట్‌తోనే ఇంకో హీరోని పెట్టి హిట్టు కొట్టాలన్నది సుకుమార్‌ ‘కసి’ అని తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, బన్నీతో సినిమా పట్టాలెక్కగానే, సుకుమార్‌ తన తదుపరి సినిమాని అనౌన్స్‌ చేస్తాడట. అయితే, హీరో ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. విజయ్‌ దేవరకొండ పేరు ప్రముఖంగా విన్పిస్తున్నా, విజయ్‌ ఎంతవరకు సుకుమార్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తాడన్నది ఇప్పుడే చెప్పలేం.

విజయ్‌కి ఇప్పుడు చాలా కమిట్‌మెంట్స్‌ వున్నాయి. అయితే, అక్కడున్నది సుకుమార్‌ కదా.. విజయ్‌ ‘ఓకే’ చెప్పేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయం కూడా విన్పిస్తోంది టాలీవుడ్‌లో. ప్రస్తుతం విజయ్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా విడుదల హడావిడిలో వున్నాడు. ఆ తర్వాత మూడు నాలుగు సినిమాలు లైన్‌లో వున్నాయి. మరోపక్క సుకుమార్‌ కూడా బన్నీతో సినిమా పూర్తయ్యాకే ఇంకో సినిమా వైపు దృష్టిపెట్టగలడు. సో, అన్నీ కలిసొస్తాయనీ సుకుమార్‌ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ని తెరకెక్కించి తీరతాడనీ ఆశించొచ్చు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vignesh Shivan: పిల్లలతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేసిన విఘ్నేశ్-నయనతార

Vignesh Shivan: దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత జీవితంలో ఒక్కటయ్యారు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)-నయనతార (Nayanthara). ఇటివలే వారి రెండో పెళ్లి రోజు వార్షికోత్సవం...

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు...

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట...

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

రాజకీయం

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

జగన్ మార్కు దుబారా: ‘రిషికొండ’ ప్యాలెస్ సాక్షిగా.!

దేనికోసం రిషికొండ మీద పర్యావరణ విధ్వంసానికి పాల్పడి మరీ, అత్యంత ఖరీదైన భవంతుల్ని నిర్మించినట్టు.? అంతకు ముందు పర్యాటక శాఖ కొన్ని నిర్మాణాల్ని అక్కడ చేపట్టింది. కాటేజీల ద్వారా కొంత ఆదాయం ప్రభుత్వానికి...

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘వేదికపై మోదీ మా ఇద్దరితో అన్న మాటలు ఇవే..’ చిరంజీవి పోస్ట్ వైరల్

Chiranjeevi: విజయవాడలో నిన్న జరిగిన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవి-పవన్ కల్యాణ్ తో ప్రధాని మోదీ (PM Modi) సంభాషణ, చూపిన ఆప్యాయత కార్యక్రమం మొత్తానికి హైలైట్ అయిపోయింది. ఈ...

పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి..హోమ్ మినిస్టర్ అనిత

ఆంధ్రప్రదేశ్ లో పూర్తిస్థాయిలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈనెల 12 న నాలుగో సారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేసిన రోజే 25 మంత్రులను ప్రకటించారు. శుక్రవారం వారికి ముఖ్యమంత్రి శాఖలను...

ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో జగన్ రాజీనామా చేయిస్తారా.?

ప్రత్యేక హోదా మళ్ళీ గుర్తుకొచ్చింది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. అదేంటో, అధికారంలో లేనప్పుడే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

యంగ్ హీరోతో హీరో అర్జున్ కూతురి వివాహం..

స్టార్ యాక్షన్ హీరో అర్జున్( Arjun Sarja) కూతురు ఐశ్వర్య(Aishwarya Arjun) వివాహం.. ప్రముఖ తమిళ దర్శకుడు, కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఘనంగా జరిగింది. వీళ్ళిద్దరి వివాహం సంప్రదాయ పద్ధతిలో...