గల్లీ రౌడీ మూవీ రివ్యూ

సందీప్ కిషన్ కెరీర్ హిట్స్, ప్లాప్స్ తో సమంగా సాగిపోతోంది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ చిత్రం గల్లీ రౌడీ. టాలెంటెడ్ నటుడు బాబీ సింహా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం వాసును (సందీప్ కిషన్)ను రౌడీగా తయారుచేస్తాడు తన తాత. ఆ రకంగా గల్లీ రౌడీగా మారిన వాసుకు వెంకట్ రావు (రాజేంద్ర ప్రసాద్)కు సంబంధించిన ప్రాపెర్టీను అక్కడే రౌడీ పోలీస్ అయిన రఘు నాయక్ (బాబీ సింహా) నుండి కాపాడాల్సి వస్తుంది. రఘు నాయక్ కారణంగా బాబీ సింహా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. రఘు నాయక్ కు వెంకట్ రావు ప్రాపెర్టీకి సంబంధం ఏంటి?

కథ :

తెరమీద స్టార్స్‌..

సందీప్ కిషన్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. కాకపోతే కొన్ని చోట్ల అవసరమైన దానికంటే ఎక్కువ ఎనర్జీ చూపించాడు. ఇక కొన్ని హీరోయిజం సన్నివేశాలు ఓవర్ బోర్డ్ అయినట్లు అనిపించాయి.

సందీప్ కిషన్, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్ తమ పాత్రలకు న్యాయం చేసినా కానీ క్యారెక్టర్లను పైపైన నడిపించేసిన విధానం, సినిమాతో ట్రావెల్ అయ్యేలా చేయదు. ఆ విషయంలో సినిమా నిరుత్సాహపరుస్తుంది.

విశ్లేషణ:

 రేటింగ్: 2/5