‘మాస్ట్రో’ మూవీ రివ్యూ

బాలీవుడ్ లో నేషనల్ అవార్డ్ అందుకున్న అంధధూన్ చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా మేస్ట్రో టైటిల్ తో తెరకెక్కించారు. ఈ చిత్రం ఈరోజు నుండి డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. మరి ఈ రీమేక్ ఒరిజినల్ స్థాయిలో ఉందో లేదో చూద్దాం.

అరుణ్ (నితిన్) అంధుడైన ఒక పియానిస్ట్. నితిన్ అనుకోకుండా ఒక మర్డర్ కు విట్నెస్ గా ఉంటాడు. అయితే దాన్ని రిపోర్ట్ చేయాలనుకుంటాడు. అయితే అరుణ్ అంధత్వం వెనకాల చిన్న డ్రామా ఉంటుంది. అది ఈ కథను ఏ విధంగా మలుపు తిప్పింది. ఇందులో సిమ్రాన్ (తమన్నా) అరుణ్ లైఫ్ లో ఎలా మలుపులు తిప్పింది అన్నది మిగతా కథ.

కథ :

తెరమీద స్టార్స్‌..

అంధుడిగా, అంధత్వం నటించేవాడిగా నితిన్ పెర్ఫార్మన్స్ కు వంకలు పెట్టలేం. తన 100 శాతం ఎఫోర్ట్స్ పెట్టాడు. అయితే ఒరిజినల్ గా చేసిన ఆయుష్మాన్ తో మాత్రం పోల్చి చూడలేం కానీ తన పరిధిలో నితిన్ మెప్పిస్తాడు.

మేస్ట్రో అంధధూన్ ను ఆల్మోస్ట్ ఫాలో అయిపోతుంది. కానీ అంధధూన్ లో ప్లస్ అయిన ఎమోషనల్ కనెక్ట్ ఇక్కడ మైనస్ అయింది. అయితే అక్కడక్కడ సినిమాకు హైలైట్ గా నిలిచే కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. తక్కువ అంచనాలతో చూస్తే మేస్ట్రో ఈజీగా ఒక్కసారిగా చూసేయొచ్చు.

విశ్లేషణ:

 రేటింగ్: 2.5/5