Switch to English

నితిన్ ‘మాస్ట్రో’ మూవీ రివ్యూ

Critic Rating
( 2.50 )
User Rating
( 3.00 )

No votes so far! Be the first to rate this post.

Movie ‘మాస్ట్రో’
Star Cast నితిన్, నభానటేష్, తమన్నా, నరేష్
Director మేర్లపాక గాంధీ
Producer ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి
Music మహతి స్వరసాగర్‌
Run Time 2 hr 15 Mins
Release సెప్టెంబర్ 17, 2021

బాలీవుడ్ లో నేషనల్ అవార్డ్ అందుకున్న అంధధూన్ చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా మేస్ట్రో టైటిల్ తో తెరకెక్కించారు. ఈ చిత్రం ఈరోజు నుండి డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. మరి ఈ రీమేక్ ఒరిజినల్ స్థాయిలో ఉందో లేదో చూద్దాం.

కథ:

అరుణ్ (నితిన్) అంధుడైన ఒక పియానిస్ట్. నితిన్ అనుకోకుండా ఒక మర్డర్ కు విట్నెస్ గా ఉంటాడు. అయితే దాన్ని రిపోర్ట్ చేయాలనుకుంటాడు. అయితే అరుణ్ అంధత్వం వెనకాల చిన్న డ్రామా ఉంటుంది. అది ఈ కథను ఏ విధంగా మలుపు తిప్పింది. ఇందులో సిమ్రాన్ (తమన్నా) అరుణ్ లైఫ్ లో ఎలా మలుపులు తిప్పింది అన్నది మిగతా కథ.

నటీనటులు:

అంధుడిగా, అంధత్వం నటించేవాడిగా నితిన్ పెర్ఫార్మన్స్ కు వంకలు పెట్టలేం. తన 100 శాతం ఎఫోర్ట్స్ పెట్టాడు. అయితే ఒరిజినల్ గా చేసిన ఆయుష్మాన్ తో మాత్రం పోల్చి చూడలేం కానీ తన పరిధిలో నితిన్ మెప్పిస్తాడు. తమన్నా బాగానే చేసింది కానీ ఆమె తన వయసుకు మించిన పాత్ర చేసింది. నభ నటేష్ ది గ్లామర్ డాల్ పాత్ర మాత్రమే. అంతకు మించి ఏం లేదు. నరేష్ కు తన పాత్రలో మిస్ ఫిట్ లా అనిపిస్తాడు. అనన్య నాగళ్ళ డీసెంట్. హర్షవర్ధన్, మంగ్లీ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం:

మేర్లపాక గాంధీ స్క్రిప్ట్ విషయంలో సేఫ్ గేమ్ ఆడాడు. పెద్దగా కథ, స్క్రీన్ ప్లే లను మార్చాలని ప్రయత్నించలేదు. అయితే ఎందుకనో మొత్తంగా చూసుకుంటే ఎమోషనల్ కనెక్ట్ కన్సిస్టెంట్ గా మైంటైన్ చేసినట్లు అనిపించదు. మహతి స్వర సాగర్ సంగీతం బాగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్ గా ఉంది.

ప్లస్ పాయింట్స్:

  • నితిన్ పెర్ఫార్మన్స్
  • థ్రిల్లింగ్ సీన్స్

మైనస్ పాయింట్స్:

  • అంధధూన్ చూసిన వాళ్లకు కొత్తగా ఏం ఉండదు.
  • ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం

విశ్లేషణ:

మేస్ట్రో అంధధూన్ ను ఆల్మోస్ట్ ఫాలో అయిపోతుంది. కానీ అంధధూన్ లో ప్లస్ అయిన ఎమోషనల్ కనెక్ట్ ఇక్కడ మైనస్ అయింది. అయితే అక్కడక్కడ సినిమాకు హైలైట్ గా నిలిచే కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. తక్కువ అంచనాలతో చూస్తే మేస్ట్రో ఈజీగా ఒక్కసారిగా చూసేయొచ్చు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సాయి ధరమ్ తేజ్‌ ను కలిసిన హరీష్‌ శంకర్‌

యాక్సిడెంట్‌ కు గురయ్యి చాలా రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి ఇటీవలే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్న సాయి ధరమ్‌ తేజ్ ను సన్నిహితులు ఇంటికి...

ముక్కు అవినాష్‌ పెళ్లి తంతు పూర్తి

కమెడియన్‌ గా తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్న ముక్కు అవినాష్ బిగ్‌ బాస్ కు వెళ్లినప్పటి నుండి పెళ్లి పెళ్లి అంటూ హడావుడి చేశాడు....

సమంత పరువు నష్టం దావా

స్టార్‌ హీరోయిన్ సమంత మూడు యూట్యూబ్‌ ఛానెల్స్ పై పరువు నష్టం దావా వేసింది. తాను విడాకుల గురించి సోషల్‌ మీడియాలో వెళ్లడించిన సమయంలో కొన్ని...

క్లైమాక్స్ కోసమే 50 కోట్లు ఎందుకు డార్లింగ్!!

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా రాధే శ్యామ్. మూడేళ్ళ క్రితమే షూటింగ్ మొదలైన ఈ చిత్రం బోలెడన్ని అడ్డంకులను దాటుకుని షూటింగ్ ను...

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్

పవర్ స్టార్ సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నాడా? 2022 తర్వాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయకూడదు అని భావిస్తున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాల్లోకి...

రాజకీయం

బాబు దీక్షకు పోటీగా వైకాపా దీక్షలు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరుకు నిరసనగా.. తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా 36 గంటల దీక్షను చేసేందుకు సిద్దం అయ్యాడు. తెలుగు దేశం...

హద్దు మీరితే ఇకపై కూడా ఇలాగే ఉంటుంది : సజ్జల

తెలుగు దేశం పార్టీ నాయకులు హద్దు మీరి దుర్బాషలాడితే పరిస్థితులు ఇలాగే ఉంటాయని.. వారు ఏం మాట్లాడినా కూడా చూస్తూ ఊరుకునేది లేదు అంటూ సజ్జల సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. తెలుగు...

నారా లోకేష్‌ ఉగ్ర స్వరూపం

ఏపీలో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై వైకాపా శ్రేణుల దాడికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు నేడు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. బంద్ పాటించేందుకు ప్రయత్నించారు. కాని పోలీసులు మాత్రం ఎక్కడికి...

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన అవసరమా.? కాదా.?

అధికార పార్టీకి చెందిన నేతలైతే పొద్దున్న లేచిన దగ్గర్నుంచి బూతులు తిట్టొచ్చు.. వాటిపై విపక్షాలకు చెందిన నేతలు సమాధానం కూడా చెప్పకూడదు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నది భారత రాజ్యాంగం కాదు.. ఇంకోటేదో...

బీపీ, రియాక్షన్… ఇదేం సమర్థన సీఎం జగన్ గారూ.?

‘ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక నా మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారు. నన్ను బూతులు తిడుతున్నారు. ఈ నేపథ్యంలో నన్ను అభిమానించేవారు, ప్రేమించేవారు బీపీకి...

ఎక్కువ చదివినవి

ఇలాంటి డ్రస్ లు వేయడం ఎందుకు.. ఇబ్బంది పడటం ఎందుకు?

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అషు రెడ్డి. అప్పట్లో జూనియర్ సమంత అంటూ పేరు దక్కించుకుంది. డబ్ స్మాష్ వీడియోలతో అత్యధికంగా పాపులర్ అయ్యింది ఎవరయ్యా అంటే ఈమె...

పెట్రోల్‌ రేట్లకు నిరసనగా బస్సుకు నిప్పు పెట్టిన యువకుడు

దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ రేట్లకు నిరసనగా ప్రకాశం జిల్లా కనిగిరి కి చెందిన ఏడు కొండలు అనే 21 ఏళ్ల కుర్రాడు బస్సుకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాడు....

రాశి ఫలాలు: సోమవారం 18 అక్టోబర్ 2021

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు ఆశ్వీయుజమాసం శుక్ల పక్షం సూర్యోదయం: ఉ.5:57 సూర్యాస్తమయం: సా‌.5:37 తిథి: ఆశ్వీయుజ శుద్ధ త్రయోదశి రా.6:11 వరకు తదుపరి చతుర్దశి సంస్కృతవారం: ఇందువాసరః (‌సోమవారం) నక్షత్రము: పూర్వాభాద్ర మ.12:07 వరకు తదుపరి ఉత్తరాభాద్ర యోగం:...

రాశి ఫలాలు: శనివారం 16 అక్టోబర్ 2021

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు ఆశ్వీయుజమాసం శుక్ల పక్షం సూర్యోదయం: ఉ.5:57 సూర్యాస్తమయం: సా.5:37 తిథి: ఆశ్వీయుజ ఏకాదశి రా.7:07 వరకు తదుపరి ఏకాదశి సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం) నక్షత్రము: థనిష్ట మ.12:01 వరకు తదుపరి శతభిషం యోగం: గండ...

బిగ్ బాస్ 5: సీక్రెట్ రూమ్ లో కూడా సేఫ్ గేమ్ ఎందుకు లోబో!- ఎపిసోడ్ 43

బిగ్ బాస్ సీజన్ 5 లో మరో ఎవిక్షన్ జరిగింది. ముందుగా ఈరోజు సన్ డే, ఫన్ డే కావడంతో ఏ మాత్రం ఆలస్యం లేకుండా నాగార్జున కంటెస్టెంట్స్ చేత గేమ్స్ ఆడించాడు....