Switch to English

ఆ ఐదు నిమిషాల పని వైసీపీకి ఎందుకు చేతకావట్లేదు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,517FansLike
57,764FollowersFollow

‘యాత్రను అడ్డుకోవడమెంత పని.? ఐదు నిమిషాలు చాలు..’ అంటున్నారు వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యానారాయణ. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దుర్మార్గుడిగా ఇదే బొత్స సత్యనారాయణ అభివర్ణించారు. ఇప్పుడు అదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పంచన చేరి, మంత్రి పదవి పొందరు. ‘వైఎస్ మరణం వెనుక ఆయన కుటుంబ సభ్యుల పాత్ర కూడా వుండి వుడొచ్చు..’ అని ఇదే బొత్స గతంలో ఆరోపించారు.. అప్పట్లో కాంగ్రెస్ నేతగా వున్నప్పుడు.

ఈ బొత్స సత్యనారాయణే, ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోతే తప్పేంటన్నారు.. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ ప్రాంతం వుంటే బావుంటుందని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ బొత్స సత్యనారాయణే, అమరావతి ముంపు ప్రాంతమని చెబుతున్నారు.

అసలు ఈ పాత కథ ఇప్పుడెందుకు.? అంటే, రాజకీయ నాయకులు ఉసరవెల్లుల్లా ఎలా మాట మార్చుతారో చెప్పడానికి మాత్రమే.! రాజకీయ నాయకులు ఊసరవెల్లుల్లా రంగులు మార్చేయగలరు.. కానీ, రాజధానుల్ని కూడా మార్చేస్తారా.? అన్నదే ఇక్కడ అసలు చర్చ. ఎవరూ అధికారంలో వుంటే, వారికి నచ్చినట్లు రాజధానులు మార్చుకుంటూ పోతే ఎలాగన్న ఇంగితం బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్లకు కలగకపోవడం ఆశ్చర్యకరం.

బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ పొలిటీషియన్. ఆ ఉత్తరాంధ్ర బాగు కోసం ఏనాడూ ఆయన రాజకీయంగా కృషి చేసింది లేదు. రాజకీయంగా కీలక పదవుల్లో వుండి, ఉత్తరాంధ్రకు ఆయన చేసిన మేలు ఏంటి.? విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపగలుగుతున్నారా.? ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో కీలకమని భావిస్తున్న రైల్వే జోన్ గురించి ఆయన మాట్లాడగలుగుతున్నారా.?

ఉత్తరాంధ్రలో ప్రజలకూ సెంటిమెంట్లు వుంటాయట.. వాటిని రెచ్చగొట్టొద్దంటూ అమరావతి రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు బొత్స. సెంటిమెంట్లు ఎలా వుంటాయో, బొత్సకి సమైక్య ఉద్యమం సమయంలోనే బాగా తెలిసి వచ్చి వుండాలి. ఆ వ్యవహారాన్ని ఆయన మర్చిపోయినట్లున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు శాంతి కాముకులు. రాజధాని అంశం వేరు, ఉత్తరాంధ్ర సెంటిమెంట్ వేరు.

న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. అంటూ అమరావతి నుంచి తిరుపతికి అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే, అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి ప్రభుత్వమే విఫలమైంది. అమరావతి నుంచి అరసవెల్లికి రైతులు పాదయాత్ర చేస్తోంటే, దీన్ని అడ్డుకునేందుకూ ప్రభుత్వ పరంగా చాలా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఆ విషయం బొత్సకు అర్థమవుతుందో లేదో.!

కొంతమంది వైసీపీ గూండాల్ని గతంలో టీడీపీ కార్యాలయం పైకి పంపించినట్లుగా, అమరావతి రైతుల మీదకు అలాంటి గూండాల్ని పంపే ఆలోచన ఏమైనా చేస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. రాజధానికి భూములిచ్చిన రైతులు వాళ్ళంతా. రాజకీయాలు చేసేటోళ్ళు కాదు. పూటకో పార్టీ మార్చే రాజకీయ నాయకులు అసలే కాదు. రాజధానికి భూములివ్వడమంటే, రాష్ట్రానికి భూములిచ్చారని అర్థం. ఆ మాత్రం ఇంగితం ఉత్తరాంధ్ర ప్రజలకైనా, రాయలసీమ ప్రజలకైనా వుంటుంది.. వైసీపీ రాజకీయ నాయకులకు తప్ప.

మేమెందుకు రాజధానికి భూములివ్వాలని ఆ రైతులు అనుకుని వుంటే, ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం రాజధాని కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమరావతి వుండేదే కాదు.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా...

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే...

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో...

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక...

Ram Charan : ‘మగధీర’తో రానున్న గేమ్‌ చేంజర్‌

Ram Charan : మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్ బర్త్‌డే మరి కొన్ని గంటల్లో రాబోతుంది....

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా...

రాజకీయం

రాముడి విగ్రహం తల నరికినోళ్ళకి.. అర్చకులు ఓ లెక్కా.?

అంతర్వేది రథం తగలబడితే.. దోషులెవరో దొరకలేదు. వైసీపీ పాలనలో వ్యవస్థలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? తేనెపట్టుని తీసే ప్రయత్నంలో ఆకతాయిలెవరో మంట పెడితే, అంతర్వేది రథం తగలబెట్టారంటూ వైసీపీ...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

ఎక్కువ చదివినవి

‘ప్రేమలు’ ఎదురు చూపులకు తెర పడనుంది

మలయాళంలో సూపర్‌ హిట్ అయ్యి తెలుగు లో డబ్‌ అయ్యి ఇక్కడ కూడా మంచి వసూళ్లు సాధించిన చిత్రం ప్రేమలు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ మలయాళ సినిమా ను...

RC16 : లాంఛనంగా చరణ్ కొత్త సినిమా ప్రారంభం

RC16 : రామ్‌ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా ప్రకటన వచ్చి ఏడాది దాటింది. గేమ్ చేంజర్ సినిమా ఆలస్యం అవ్వడంతో బుచ్చిబాబు సినిమాను చరణ్ ఆలస్యం చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు...

Ustaad Bhagat Singh : గ్లాస్ డైలాగ్‌ ని బలవంతంగా చెప్పించాడు : పవన్‌

Ustaad Bhagat Singh : పవన్‌ కళ్యాణ్ రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా ఉస్తాద్‌ భగత్ సింగ్ టీజర్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ లో పవన్ కళ్యాణ్‌...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్ చరణ్ ప్రశ్న

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ ఆ సుజిత్ ఎవరు.. ఫన్నీ సంభాషణ...

Hyderabad: ధీర వనితలు..! పోరాడి దొంగలను పోలీసులకు పట్టించారు

Hyderabad: నాటు పిస్తోలుతో బెదిరించిన ఇద్దరు దొంగలను.. తల్లీ, కుమార్తె ధైర్యంగా ఎదుర్కొన్న ఘటన హైదరాబాద్ (Hyderabad) లో జరిగింది. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రసూల్ పురా జైన్...