‘వైసీపీ ఓటు బ్యాంకు చీలనివ్వను..’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారు.? ఈ విషయమై వైసీపీ వాదన చూస్తే ‘నవ్వులాట’ని తలపిస్తోంది. ఆ పార్టీ ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.
చంద్రబాబుని వదిలేసి మరీ, జనసేన అధినేతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలంతా విరుచుకుపడుతున్నారు ఇటీవలి కాలంలో. సోషల్ మీడియాలో అయితే వైసీపీ ‘పేటీఎం’ కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
నిత్యం మార్ఫింగులు చేసుకుంటూ, అడ్డగోలు కామెంట్లతో సోషల్ మీడియా వేదికగా జనసేన అధినేతని తూలనాడటమే పని. ఆ లెక్కన, జనసేన అధినేత కారణంగా చాలామంది వైసీపీ ‘సోషల్’ కార్మికులకు ఉపాధి దొరుకుతోందనుకోండి.. అది వేరే సంగతి.
ఇలా వైసీపీ తరఫున పనిచేస్తోన్న చాలామంది సోషల్ కార్మికులు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ గల్లంతేనని ఆఫ్ ది రికార్డుగా అభిప్రాయపడుతున్నారట. ఇటీవలి కాలంలో ఏ సర్వే వెలుగు చూసినా, అందులో వైసీపీ పరిస్థితి దయనీయంగానే కనిపిస్తోంది. కానీ, వాటికి ‘ఆల్టర్’ చేసి, బ్లూ మీడియా ద్వారా బయటకు వదులుతోంది వైసీపీ.
60 నుంచి 70 శాతం మంది ప్రజా ప్రతినిథులపై వ్యతిరేకత వుందని కొన్నాళ్ళ క్రితం అప్పటి ‘తాజా మాజీ మంత్రి’ ప్రకటించేయడం పెను దుమారానికి కారణమైన సంగతి తెలిసిందే.
తాజాగా వైసీపీ సొంత సర్వే ఒకటి, వైసీపీకి 35 శాతానికి లోబడే ఓట్లు వస్తాయని తేల్చిందట. ఇక్కడ జనసేన పార్టీకి 20-25 శాతం వరకూ ఓట్లను ఆ సర్వే పేర్కొందిట. మెజార్టీ ఓట్లు టీడీపీకి దక్కే అవకాశం వున్నా.. జనసేన పార్టీకి చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు వస్తాయని (కొన్ని నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టడం వల్ల) తేల్చిందట ఆ సర్వే.
అధికార వైసీపీ సర్వేలో ఇలాంటి ఫలితాలు రావడంతో.. ఒకవేళ టీడీపీ – జనసేన కలిస్తే పరిస్థితి ఏంటి.? అని వైసీపీ అధినాయకత్వం తెగ బాధపడిపోతోందట. ఈ సర్వే వ్యవహారం కూడా వైసీపీ నుంచే లీకవుతోందంటే.. ఇక బాధపడటానికేమీ లేదు.. వైసీపీ గల్లంతే.. అన్న అభిప్రాయానికి వైసీపీలో మెజార్టీ నేతలు వచ్చేసినా ఆశ్చర్యమేముంటుంది.?