అక్రమ సంబంధాలంటే వైసీపీకి ఎంత ఇష్టమో.! ఔను, వైసీపీ రాజకీయాలన్నీ అక్రమ సంబంధాల చుట్టూనే నడుస్తుంటాయ్. జనసేన పార్టీ మీద రాజకీయ విమర్శలు చేయడానికి, వైసీపీ అప్పట్లో ఇదే పంథా ఎంచుకుని, బొక్క బోర్లా పడింది. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ ప్రస్తావనను అధికారిక బహిరంగ సభల్లో, ముఖ్యమంత్రి హోదాలో అత్యంత జుగుప్సాకరంగా తీసుకొచ్చి, జనం నుంచి ఛీత్కారాన్ని ఎదుర్కొన్నారు వైఎస్ జగన్.
151 సీట్ల నుంచి వైసీపీ 11 సీట్లకు పడిపోవడానికి, ఈ జుగుప్సాకరమైన రాజకీయమే కారణమని వైసీపీ ఇప్పటికీ పోస్టుమార్టమ్ చేసుకోలేకపోతోంది. తాజాగా, జనసేన నేత కిరణ్ రాయల్ మీద ‘అక్రమ సంబంధాల’ పేరుతో అత్యంత జుగుప్సాకరమైన రాజకీయానికి తెగబడింది వైసీపీ.
కిరణ్ రాయల్ మీద ఆరోపణలు రాగానే, పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుండాలని ఆదేశాలు జారీ చేసింది జనసేన పార్టీ. అంతకు ముందు జనసేన నేత, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయంలోనూ ఇదే విధంగా బాధ్యతాయుతమైన రీతిలో వ్యవహరించింది జనసేన పార్టీ.
వైసీపీ సంగతేంటి.? వైసీపీకి చెందిన గోరంట్ల మాధవ్ అత్యంత జుగుప్సాకరంగా, నగ్నంగా వీడియో కాల్ చేసి దొరికిపోతే, అతన్ని వెనకేసుకొచ్చింది వైసీపీ. వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైతే, దాన్ని గుండె పోటుగా ఏమార్చే ప్రయత్నం చేసిన వైసీపీ, వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయాక ఆయనకీ అక్రమ సంబంధాల్ని అంటగట్టింది.
ఈ అక్రమ సంబంధాల ఫాంటసీ వైసీపీకి ఏంటి.? అని వైసీపీ క్యాడర్ సైతం తరచూ ఆశ్చర్యపోతుంటుందనడం అతిశయోక్తి కాదేమో. ‘నువ్వసలు రాజశేఖర్ రెడ్డి కూతురివే కాదు..’ అని షర్మిల మీద ఒకప్పుడు వైసీపీకి చెందిన ఓ ప్రజా ప్రతినిథి అత్యంత జుగుప్సాకరమైన కామెంట్ చేస్తే, అతన్ని పార్టీ నుంచి బయటకు పంపలేకపోయిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది.
అన్నట్టు, చెల్లెలు కట్టుకున్న చీర రంగు మీద దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి, ఇంతకు మించిన రాజకీయాన్ని ఎలా ఆశించగలం.?