Switch to English

రఘురామ చుట్టూ బిగుసుకుంటోన్న వైసీపీ ఉచ్చు.? నిజమెంత.!

ఏకంగా లక్ష యూరోలు.. సుమారుగా 11 కోట్ల రూపాయల లావాదేవీలు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకీ, టీవీ5 సంస్థ అధినేత బీఆర్ నాయుడికీ మధ్య జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోన్న విషయం విదితమే. రాజద్రోహం కేసులో రఘురామ అరెస్టయ్యాక, ఆయన్నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ ద్వారా, ఈ విషయాన్ని ఏపీ సీఐడీ బయటపెట్టిందని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు ఏపీ సీఐడీ కూడా, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు ఆ మధ్య ఓ కథనం తెరపైకొచ్చింది. ఇందులో నిజానిజాలెంత.? అన్నదానిపై నిగ్గు తేల్చాల్సింది న్యాయస్థానాలే.

అయితే, బ్యాంక్ అకౌంట్ నెంబర్లతో సహా, వైసీపీ.. తీవ్రస్థాయి ఆరోపణలు గుప్పిస్తోంది. ఓ అడుగు ముందుకేసి, ప్రధాని నరేంద్ర మోడీకీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కీ రఘురామ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు. రఘురామ దేశం విడిచి పారిపోకుండా చూడాలనీ, ఆయనపై మనీ లాండరింగ్, ఫెమా చట్టాల కింద చర్యలు తీసుకోవాలనీ వైసీపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం దాకా ఎందుకు.? పక్కా ఆధారాలున్నాయని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం, రఘురామ మీద కొత్తగా కేసులు బనాయిస్తే సరిపోతుంది కదా.? అన్న డౌట్ మీకొస్తే అది మీ తప్పు కానే కాదు.

ఎలాగైనా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మీద అనర్హత వేటు వేయించాలనే ప్రయత్నంలో వుంది వైసీపీ. రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాలక్ష సమస్యల కంటే, వైసీపీకి రఘురామ తలనొప్పి ఎక్కువైపోయింది మరి. అయినా, ఎవరు ఎవరి మీద ఏం ఫిర్యాదులు చేస్తున్నారు.? ఆర్థిక నేరాల విషయమై కదా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నది.? అవే కేసుల్లో విజయసాయిరెడ్డి ఏ2 నిందితుడిగా వున్నారు కదా.? మరి, అలాంటి పార్టీ నేతృత్వంలో నమోదయ్యే ఫిర్యాదుల్లో వాస్తవాలెలా వుంటాయి.? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.

‘20కి పైగా అభియోగాలు మీ ఇద్దరి మీదనే వున్నాయి.. మీరు నా మీద ఆరోపణలు చేయడమేంటి.. సిగ్గులేకపోతే సరి..’ అంటూ ఇప్పటికే రఘురామ తన మీద వైసీపీ చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. అంతేనా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించారు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ప్రధానికి ఫిర్యాదు చేశారు రఘురామ. దానికి కౌంటర్ ఎటాక్ తప్ప.. రఘురామ మీద వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలుంటాయని ఎలా అనుకోగలం.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు...

బిగ్‌బాస్‌ తెలుగు-5 : ప్రియ వ్యాఖ్యలతో రచ్చరచ్చ – ఎపిసోడ్ –...

బిగ్ బాస్ లో సోమవారం వస్తుంది అంటే ప్రేక్షకులు కళ్లు పెద్దవి చేసి చూస్తారు.. కంటెస్టెంట్స్ కారాలు మిరియాలు నూరుతూ రచ్చ చేసేందుకు సిద్దం అవుతారు....

సమంత ఎమోషనల్ ట్వీట్..! నాగ చైతన్యను ఉద్దేశించేనా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం 'చైసామ్' ల విషయమే. ఎంతో చూడముచ్చటగా, అన్యోన్యంగా కనిపించిన నాగ చైతన్య, సమంతల జంట...

తండ్రి, అన్న బాటలో షర్మిల..! తెలంగాణాలో పాదయాత్ర

'పాదయాత్ర' అంటే గుర్తొచ్చేది దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరే. తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వీరిద్దరూ పాదయాత్ర తర్వాత ముఖ్యమంత్రులు అయ్యారనేది...

చిరంజీవి అంటే జగన్ కు అభిమానం.. పరిశ్రమ అభివృద్ధికి ఓకె: పేర్ని...

చిరంజీవి అంటే సీఎం జగన్‌కు ఎంతో గౌరవమని, ఆయనను సోదరభావంతో చూస్తారని.. ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా...

రాజకీయం

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు నాయకులు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కొన్నాళ్లుగా...

వినోదం.. సరసమైన ధరకి.. నిత్యావసర వస్తువులో మరి.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ వినోదం సరసమైన ధరకు ప్రేక్షకులకు అందజేసి తీరుతాం.. సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్ విధానంలోనే విక్రయిస్తాం..’ అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని ఈ పైత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు.?...

గోదావరి వైకాపాలో గ్రూప్‌ రాజకీయం

తూర్పు గోదావరి జిల్లాలో వైకాపా నాయకుల మద్య గ్రూప్‌ రాజకీయం ముదిరింది. స్థానిక ఎమ్మెల్యే మరియు ఎంపీల మద్య జరుగుతున్న ఆధిపత్యం తీవ్రం అయ్యింది. రాజా నగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరియు...

తెలంగాణలో ‘వైట్’ ఛాలెంజ్: రాజకీయాల్లో ఎవరు సుద్దపూసలు.?

రాజకీయ నాయకులు తెలుపు వస్త్రాలు ధరిస్తుంటారు. తెలుపు అనేది స్వచ్ఛతకు గుర్తు. మరి, రాజకీయ నాయకులంతా స్వచ్ఛమేనా.? స్వచ్ఛమైన రాజకీయాలే చేస్తున్నారా.? ఇప్పుడీ ‘తెలుపు’ చర్చ ఎందుకు.? అంటే, ‘వైట్ ఛాలెంజ్’ అంటూ...

టీడీపీ మార్కు చారిత్రక తప్పిదం.! ఇక గల్లంతైపోయినట్టే.!

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం.. అని పదే పదే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెబుతుంటారు. స్థానిక ఎన్నికలు ఏ ప్రాతిపదికన జరుగుతాయో, ఎలాంటి రాజకీయాలు ఆ ఎన్నికల చుట్టూ వుంటాయో.. చంద్రబాబుకి...

ఎక్కువ చదివినవి

సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నారు..! హెల్త్ బులెటిన్ విడుదల

మెగా హీరో సాయిధరమ్ తేజ్ క్రమంగా కోలుకుంటున్నారని అపోలో ఆసుపత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈమేరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి యాజమాన్యం తాజా బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన స్పృహలోనే...

తన ట్వీట్‌ ను వెనక్కు తీసుకున్న కేటీఆర్‌

సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరు ఏళ్ల అమ్మాయిపై అత్యాచారంకు పాల్పడ్డ వ్యక్తి ని గంటల వ్యవధిలోనే పట్టుకున్నామని.. బాలిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. నింధితుడికి కఠిన శిక్ష పడాలంటూ కేటీఆర్...

ఒక్క రూపాయి 10 కోట్లు తెచ్చిపెట్టింది..! ఎలా అంటే..?

పాత కరెన్సీ నోట్లు, నాణేలు సేకరించే అలవాటు చాలామందికి ఉంటుంది. ఏదో ఆశించి కాకుండా వారిలో ఉన్న ఆసక్తి మేరకు సేకరిస్తూంటారు చాలా మంది. అయితే.. ఇలా పాత నాణేలను సేకరించడమే ఓ...

అక్కడ జగన్, ఇక్కడ షర్మిల.. ఇదీ అసలు రాజకీయం.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విభేదించి, తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్లు గతంలో సాక్షాత్తూ వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డి సెలవిచ్చారు. ‘పార్టీ పెట్టొద్దన్ని జగన్ వారించారు.. అయినా,...

చైతన్య ఓటిటి డెబ్యూ ఎప్పుడంటే!

అక్కినేని నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితం కారణంగా ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో ఉంటూ వస్తున్నాడు. అంతే కాకుండా చైతన్య నటించిన లవ్ స్టోరీ సెప్టెంబర్ 24న విడుదల కాబోతోంది. ఈ...