వాలంటీర్లతో దున్నేద్దాం.. ఈ మాట దాదాపు అందరు వైసీపీ నేతల నోటి నుంచీ వినిపిస్తోంది. ప్రజలతో వైసీపీకి అనుకూలంగా ఓట్లేయించే బాధ్యత పూర్తిగా వాలంటీర్లదేనని వైసీపీ నేతలు అంటున్నారు. ‘వైసీపీకి ఓటెయ్యించకపోయారో.. మీ అంతు చూస్తాం..’ అనే బెదిరింపులూ వాలంటీర్లకు ఎదురవుతున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చాక తెరపైకి వచ్చిన వాలంటీర్ వ్యవస్థ తాలూకు ఉద్దేశ్యం, సంక్షేమ పథకాలను గడప గడపకూ చేర్చడమే కాదు.. వైసీపీకి అనుకూలంగా వాళ్ళని మార్చడం. నిజానికి, వైసీపీ అసలు ఉద్దేశ్యమే.. జనాన్ని బతిమాలో, భయపెట్టో.. వైసీపీకి అనుకూలంగా మార్చడం.
సంక్షేమ పథకాల ముసుగులో గడప గడపకీ వైసీపీ వాలంటీర్లు వెళుతున్నదే, ఎవరు ఏ పార్టీకి అనుకూలమో తెలుసుకునేందుకు. ఆయా కుటుంబాల పూర్తి డేటా సేకరించి, వైసీపీకి ఓటెయ్యకపోతే, సంక్షేమ పథకాలు లేకుండా చేస్తామని గతంలో.. అంటే, స్థానిక ఎన్నికల సమయంోనూ వాలంటీర్లు బ్లాక్‌మెయిల్ చేసిన సందర్భాలున్నాయి.
‘మేం బటన్లు నొక్కుతున్నాం.. మీరు, వాలంటీర్లను జాగ్రత్తగా మచ్చిక చేసుకోండి..’ అని పార్టీ అధినాయకత్వం నుంచి పార్టీ నేతల మీద, అందునా అభ్యర్థుల మీద ఒత్తిడి పెరుగుతోంది. ‘మా ఇంట్లో ముగ్గురు ఆడ పిల్లలు.. సివిల్స్ రాస్తూ వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నారొకరు.. ఇంకొకరు ఉన్నత చదువులు చదివీ వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నారు..’ అంటూ పెయిడ్ ప్రచారాల్నీ కొందరు ఎంపిక చేసిన జనాలతో చేయిస్తోంది వైసీపీ.
సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతూ, వాలంటీర్ ఉద్యోగం చేయడమేంటి.? ఇంజనీరింగ్ చేసిన విద్యార్థి నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనానికి వాలంటీర్‌గా పని చేయడమేంటి.? ఈ ఆణిముత్యాలన్నీ వైసీపీ కార్యకర్తలేనని నిస్సందేహంగా చెప్పొచ్చు.
అయితే, గ్రౌండ్ రియాల్టీ వేరేలా వుంది. నిశ్శబ్ద విప్లవం అయితే రాబోతోంది. వాలంటీర్.. అనే వైసీపీ మార్కు ‘నీలి’ కంచు కోటని బద్దలుగొట్టేందుకు జనం కంకణం కట్టుకున్నట్లే కనిపిస్తోంది.