కుప్పంలో కుప్పకూలిపోయిన తారకరత్న.! నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. తొలి అడుగు నందమూరి తారక రత్న గుండెలపై.! శనిగాడు నారా లోకేష్ వల్లనే తారకరత్నకి ఈ దుస్థితి.! బొల్లిబాబు దెబ్బ.. నందమూరి వారసుడికి ప్రాణాపాయమబ్బా.!
చెప్పుకుంటూ పోతే చాలానే.! సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు చేస్తున్న దుష్ప్రచారం చూస్తోంటే, ‘రాజకీయం అంటే ఇంతేనా.?’ అన్న ఆవేదన మనిషన్నవాడెవడికైనా కలుగుతుంది.
టీడీపీ తక్కువేం తిన్లేదు. టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే, ‘తారకరత్న చనిపోయాడని అనుకున్నాం.. బాలకృష్ణ రావడంతోనే తారకరత్నలో చలనం కన్పించింది.. మాకు ధైర్యమొచ్చింది..’ అంటూ బాలయ్యని దేవుడ్ని చేసేశారు.
దీనిపై మళ్ళీ ట్రోలింగ్.! తారకరత్న శరీరం ఎందుకు నీలంగా మారింది.? అన్న అంశంపైనా చర్చోపచర్చలు. ‘తారకరత్న చనిపోయాడు.. పాదయాత్ర తొలి రోజే ఆ విషయం ప్రకటించడం బాగోదు గనుక.. తమకు అనుకూలంగా వుండే ఆసుపత్రికి తరలించి.. అక్కడ డ్రామా కొనసాగిస్తారు కొన్నాళ్ళపాటు..’ అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నాయి.
ఇదా రాజకీయమంటే.? ఓ మనిషి చావు బతుకుల మధ్య పోరాటం సాగిస్తున్నాడు. ఏ పార్టీ.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఆయనా ఓ మనిషే. బతికున్నోళ్ళకు ఎలాగూ విలువ లేదు.. చావుకీ బతుక్కీ మధ్య పోరాడుతున్న వ్యక్తికైనా కనీసపాటి గౌరవం ఇవ్వాలి కదా.? గౌరవం ఇవ్వడం సంగతి తర్వాత.. కనీసం ఈ విషయాన్ని వివాదాస్పదం చేయకూడదన్న ఇంకితం వుండాలి కదా.?
ఎవరైతే ఈ అంశంపై జుగుప్సాకరమైన రాజకీయం చేస్తున్నారో.. అత్యంత అభ్యంతరకరమైన రీతిలో సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారో.. వాళ్ళ ఇంట్లో ఇలాంటి పరిస్థితి వస్తే.?
అరేయ్ సన్నాసి అనం తింటున్నవా? అసుద్దం తింటున్నావా? వివేకానందరెడ్డి మరణించి నప్పుడు ఆర్థిక ఉగ్రవాది గురించి కూడా ఇలానే రాసవ సన్నాసి. ఇది గొడ్డలి వేటు కాదు, హార్ట్ ఎటాక్. నీలాంటి చిల్లర నాకొడుకులు, చిల్లర రాతలు రాస్తున్నారు.