అమరావతి ‘వైసీపీ విషం’.! ఏళ్ళ తరబడి నడుస్తున్న తతంగం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,098FansLike
57,764FollowersFollow

ఆయనెవరో జర్నలిస్టు అట.! ఆయన సాక్షిలో ఏదో మాట్లాడితే వైసీపీకి ఏంటి సంబంధమట.? ఇదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘వేశ్యల రాజధాని అమరావతి’ వివాదంపై స్పందించిన తీరు.

సాక్షి మీడియా ఎవరిది.? అసలు, ఆ జర్నలిస్టు ఎవరు.? ఛానెల్‌లో డిబేట్ నడిపిస్తున్న సీనియర్ జర్నలిస్టు ఎవరు.? ఏ పార్టీకి చెందిన వ్యక్తి.? వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరో సీనియర్ జర్నలిస్టు ఎవరు.? ఏ పార్టీకి చెందిన వ్యక్తి.?

డిబేట్ నిర్వహించింది సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు. నిజానికి, జర్నలిస్టులంటే పార్టీలకు అతీతంగా పని చేయాలి. కానీ, వైసీపీ హయాంలో నామినేటెడ్ పదవి తీసుకున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు. ఆయన వైసీపీ కార్యకర్తే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

ఇక, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరో సీనియర్ జర్నలిస్టు పేరు కృష్ణం రాజు. ఈయన కూడా వైసీపీ కార్యకర్తే.! ఆయన ఏ డిబేట్‌లో పాల్గొన్నా వైసీపీకి అనుకూలంగానే మాట్లాడతారు. వైసీపీ హయాంలో నామినేటెడ్ పదవి కోసం ఈయనా ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు ఫలించి వుంటే, అధికారికంగా ఈయనా వైసీపీ కార్యకర్త అయి వుండేవారు.

ఇక, సాక్షి ఛానల్.. అందరికీ తెలిసిందే, అది వైసీపీ ఛానల్. వైసీపీ ఛానల్‌లో వైసీపీ జర్నలిస్టు నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మరో వైసీపీ జర్నలిస్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, ఆ వ్యాఖ్యలు సదరు వ్యక్తి వ్యక్తగతమంటూ వైసీపీ బుకాయిస్తోంది.

వాస్తవానికి, అమరావతి మీద వైసీపీ విషం చిమ్మడం ఇదే తొలి సారి కాదు. వైసీపీ హయాంలో అమరావతి మహిళల్ని, ‘కూకట్‌పల్లి ఆంటీలు..’ అంటూ అత్యంత జుగుప్సాకరంగా వ్యాఖ్యానించారు వైసీపీ నేతలు, అందులో మంత్రులుగా పని చేసినవారూ వున్నారు.

అసభ్యకరం.. అత్యంత అసభ్యకరమైన రీతిలో, అమరావతి మహిళలపై ‘చీప్’ కామెంట్స్ వైసీపీ నాయకులు చేసిన సందర్భాలు కోకొల్లలు. అమరావతి మీద అక్కసుతో, పోలీసుల్ని అమరావతి మహిళలపైకి ఉసిగొల్పి, అత్యంత కిరాతకంగా వారిని హింసించిన సందర్భాలు వైసీపీ హయాంలో బోలెడు.

‘చంద్రబాబేమో అమరావతిని దేవతల రాజధాని అంటున్నారు.. కానీ, అది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారింది..’ అంటూ జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం. పదుల సంఖ్యలో వుండే సెక్స్ వర్కర్ల డేటాతో, లక్షలాది మంది మహిళల్ని అవమానించాలన్న ఆలోచన, వైసీపీ అనే చెత్తని బుర్ర నిండా నింపుకోగలిగాడు కాబట్టే వచ్చింది జర్నలిస్టు కృష్ణంరాజుకి.

సినిమా

“గాయాల మచ్చలతోనే గ్లామర్… నభా నటేష్ న్యూ స్టిల్స్ వైరల్!”

తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన Nabha Natesh తాజాగా విడుదల చేసిన స్టిల్స్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, గతంలో ఎదుర్కొన్న...

Peddi: మరోసారి ‘పెద్ది’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల...

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా...

వాలీబాల్ ప్రాక్టీస్‌లో గాయం… వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

మెగా హీరో Varun Tej కాలికి గాయం అయినట్లు ప్రాధమిక సమాచారం నిన్న ముందుగానే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మొదటగా TeluguBulletin ప్రచురించగా, ఇప్పుడు...

న్యూ కమర్స్ ఎదురు చూపులు, కష్టాలు తెలియచెప్పిన.. తిమ్మరాజుపల్లి ప్రీ రిలీజ్...

కొత్త వాళ్ల ఆశలు, కష్టాలు, అవకాశాల కోసం పడే పోరాటం… ఇవన్నీ ఒక్క వేదికపై ప్రతిధ్వనించిన వేడుకగా “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది....

రాజకీయం

జనసేన స్పోక్స్‌పర్సన్స్‌కు స్పెషల్ ట్రైనింగ్… వర్క్‌షాప్ ముగింపు

విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు, ఔత్సాహిక నాయకులు పాల్గొని...

వైఎస్ జగన్ మకాం హైద్రాబాద్‌కి.! సూచించిన ‘పండితుడు’ ఎవరో.?

మొన్నీమధ్యనే ఓ పండితుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉత్తరాదికి చెందిన ఆ పండితుడ్ని, వైసీపీకి గతంలో ‘సలహాదారు’గా పని చేసిన ‘పీకే’ అలియాస్ ప్రశాంత్ కిషోర్...

“ఈ పదవి అదృష్టం కాదు… కృషి ఫలితం”: లోకేష్ వ్యాఖ్యలు

చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో Nara Lokesh కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి స్థానిక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన,...

“కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు… లోకేష్ ప్రయాణం”

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్లగలదో నేటి పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ ఉదాహరణగా నిలిచిన పేరు Nara Lokesh. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...

పవన్‌పై వ్యాఖ్యలు… శంకర్ గౌడ్ తీవ్ర హెచ్చరిక

మంగళగిరిలో జరిగిన ఓ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyanపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై...

ఎక్కువ చదివినవి

“మంగ్లీ కేసు ట్విస్ట్… ఆరోపణలకు కౌంటర్ స్టేట్‌మెంట్!”

హైదరాబాద్‌లో ప్రముఖ గాయని Mangli చుట్టూ కొనసాగుతున్న వివాదం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆమె Panjagutta Police Station ను ఆశ్రయించి సింగపోగు సుబ్బు అనే వ్యక్తిపై వేధింపులు, డబ్బుల డిమాండ్ ఆరోపణలతో...

Venu Udugula: ‘కుటుంబ పరువు ఏమైపోవాలి..’ మంగ్లీ కేసుపై దర్శకుడు వేణు ఉడుగుల

Venu Udugula: ప్రముఖ సినీ గాయకురాలు మంగ్లీపై వచ్చిన ఆర్ధిక లావాదేవీల ఆరోపణలు చిత్రసీమలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంలో సంబంధం ఉందంటూ దర్శకుడు వేణు ఉడుగుల పేరు...

“త్రివిక్రమ్ సినిమాలో కొత్త విలన్..? వెంకటేష్ మూవీకి ఆసక్తికర ట్విస్ట్!”

ఉదయ్‌బీర్ సందు తాజాగా ‘ధురంధర్’ సినిమాలో పిందా పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయనకు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన అవకాశం దక్కే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’...

Stand-up Comedian Anudeep: అనుదీప్ క్షమాపణలు.. శాంతించని అభిమానులు

Stand-up Comedian Anudeep: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నిహారికలపై స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల చేసిన కామెంట్స్ తీవ్ర...

అమరావతిపై కేంద్రం స్పీడ్.. వైసీపీకి ఢిల్లీ సిగ్నల్స్ మిస్ అయ్యాయా?

అమరావతి రాజధాని అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. తాజాగా అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెలువడిన...