Switch to English

గోరంట్ల లీక్స్: నాలుగ్గోడల మధ్య జరిగిన వ్యవహారమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వివాదం రోజు రోజుకీ ముదిరి పాకాన పడుతోంది. ఈ వివాదాన్ని ఎలాగైనా సైడ్ లైన్ చేసెయ్యాలని అధికార వైసీపీ విశ్వ ప్రయత్నాలూ చేస్తుండడం చూస్తోంటే, ‘న్యూడ్ వీడియో కాల్’ ఫేక్ కాదు, రియల్.. అనే అనుమానాలు రోజురోజుకీ బలపడుతున్నాయి.

తాజాగా, వైసీపీ ముఖ్య నేత.. ప్రభుత్వ సలహాదారు కూడా అయిన సజ్జల రామకృష్ణారెడ్డి, గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారాన్ని నాలుగ్గోడల మధ్య జరిగిన వ్యవహారంగా అభివర్ణించారు. ‘ఒకవేళ అది జరిగి వుంటే.. అది నాలుగ్గోడల మధ్య జరిగిన వ్యవహారమే అవుతుంది.. లేదూ, అది మార్ఫింగ్ వ్యవహారమైనా అయి వుంటుంది.. చంద్రబాబు బాహాటంగా ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు కదా..’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి, తన తెలివినంతా ఉపయోగించి, గోరంట్ల లీకు వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.

ఓ ప్రభుత్వ సలహాదారుగా, ఆ నగ్న వీడియో కాల్ వెనుక నిజానిజాల్ని ప్రభుత్వం ఎంత సమయంలో బయటపెట్టగలదో సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియదా.? ఈ కేసులో నిజా నిజాలు బయటకు తీసేందుకు ప్రభుత్వమెందుకు అలసత్వం ప్రదర్శిస్తోందో ఆయనకు అర్థం కావడంలేదా.? అర్థమయ్యీ, అన్నీ తెలీసీ ఆయన జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నది విపక్షాల విమర్శ.

నాలుగ్గోడల మధ్య వ్యవహారం కాదది. ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం అసలే కాదది. గోరంట్ల మాధవ్ లక్షలాది మంది ప్రజలకు ప్రతినిధి. ఆయనకు లక్షలాది మంది ఓట్లేస్తే గెలిచారు, లోక్ సభకుఎంపికయ్యారు. హిందూపురం నియోజకవర్గ ఎంపీ.. ఆంధ్రప్రదేశ్ ఎంపీ.. లక్షలాది మంది నియోజకవర్గ ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రజలకే కాదు.. దేశ ప్రజలందరికీ ఈ విషయమై గోరంట్ల మాధవ్ సమాధానం చెప్పాలి.

గోరంట్ల మాధవ్ మాత్రమే కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయమై రాష్ట్ర ప్రజలకీ, దేశ ప్రజలకీ వాస్తవాలేంటో వివరించి చెప్పగలగాలి. అది మానేసి, నాలుగ్గోడల మధ్య వ్యవహారమంటారేంటి.? అంటే, నాలుగ్గోడల మధ్య ఏం జరిగినా అది ‘లీగల్’ అని ప్రభుత్వ సలహాదారు చెప్పదలచుకున్నారా.? అన్నది సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఎక్కువ చదివినవి

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...