మెగాస్టార్ అనే ట్యాగ్‌ని కళ్యాణ్ రామ్‌కి ఎలా ఇచ్చేస్తారు.? ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే జరుగుతోంది. నిజానికి, ఈ విషయాన్ని మెగా ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. జనసైనికులూ పెద్దగా పట్టించుకోవడంలేదు.!
అయితే, సోషల్ మీడియా వేదికగా రచ్చ మాత్రం కొనసాగుతోంది. ఎలా.? ఎవరు ఈ రచ్చకు తెరలేపుతున్నారు.? సమాధానం సింపుల్.! జనసేన – టీడీపీ కలవకూడదన్న కోణంలో బులుగు బ్యాచ్ నానా తంటాలూ పడుతోంది. ఈ క్రమంలోనే ‘మెగాస్టార్ కళ్యాణ్ రామ్’ అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు.
నందమూరి అభిమానుల ముసుగులో మొత్తంగా ఈ రచ్చ చేస్తున్నది బులుగు పేటీఎం కార్యకర్తలేనని, వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ చూస్తే ఇట్టే అర్థమయిపోతుంది. ఒక్కడైనా మెగా ఫ్యాన్స్ స్పందిస్తే, దానిపై కౌంటర్ ఎటాక్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో జనసేన – టీడీపీ మధ్య కూడా ట్వీట్ల యుద్ధం ఓ మోస్తరుగా నడుస్తోంది.
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో లీక్ వ్యవహారంలో ఏపీలోని అధికార పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. దేశవ్యాప్తంగా వైసీపీ పరువు ప్రతిష్టలు మంటగలిసిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌ని నడి రోడ్డు మీదకు లాగేసింది వైసీపీ ఈ ఉదంతంతో.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తమ పరువు పోయిన వైనానికి చింతించడం మానేసి, ఇదిగో.. ఈ తరహా రచ్చకు తెరలేపింది ‘మెగాస్టార్’ హ్యాష్ ట్యాగ్‌తో వైసీపీ. దీని వల్ల టీడీపీ, జనసేనకు ఖచ్చితంగా భావిష్యత్తులో కొంత నష్టం అయితే జరిగే అవకాశం వుంది.
టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయనున్నాయన్న ప్రచారం దరిమిలా, కింది స్థాయిలో టీడీపీ సోషల్ మీడియా విభాగం, జనసేన విషయంలో కాస్త విమర్శలు తగ్గించినమాట వాస్తవం. జనసైనికులు కూడా టీడీపీని పక్కన పెట్టి వైసీపీ మీదనే విమర్శలు చేస్తూ వచ్చారు.
అయితే, మెగాస్టార్ కళ్యాణ్ రామ్ వివాదంతో సీన్ మొత్తం మారిపోయింది. నందమూరి అభిమానుల ముసుగులో పేటీఎం కార్యకర్తలు పన్నిన వ్యూహంలో అటు జనసేన మద్దతుదారులు, ఇటు టీడీపీ మద్దతుదారులు ఇరుక్కుపోయినట్లే కనిపిస్తోంది.
ఒక్క బింబిసార అనే కాదు, అవకాశం వచ్చినప్పుడల్లా ఫ్యాన్ వార్ సృష్టిస్తూ టీడీపీ.. జనసేన మధ్య పరోక్షంగా చిచ్చు పెట్టటానికి ఏవో శక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి.. ముఖ్యంగా నందమూరి, టీడీపీ అభిమానులు.. ఈ విషయంలో బోల్తా పడకుండా, నిజాలు గ్రహించి అప్రమత్తంగా ఉంటే మేలు.