Switch to English

బులుగు రాజ్యాంగం: వీటిని ప్రభుత్వ ఉద్యోగాలని అనగలమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

అధికార వైసీపీ పాలనలో, గౌరవ వేతనాలు పొందుతున్న వాలంటీర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. నమ్మాల్సిందే.. నమ్మి తీరాల్సిందే. లేకపోతే, పాలకులకు కోపమొస్తుంది. ప్రభుత్వ పెద్దలు నంది అంటే నంది.. అని ఒప్పుకోవాల్సిందే.. కాదు, పంది.. అనంటే.. ఔను అది పందే.. అని ఒప్పుకోవాలి. అసలు ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నారు పాలకులు.? అన్న ప్రశ్న జనబాహుళ్యంలో గట్టిగా వినిపిస్తున్నా, అధికార పార్టీ నేతలు మాత్రం జనం గొంతు నొక్కేస్తున్నారు అధికార మదంతో. లేకపోతే, వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ప్రకటనల్లో పేర్కొనడమేంటి.?

కొద్ది రోజుల క్రితమే, వాలంటీర్లు.. తమ వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రికి లేఖ రాస్తే, ‘మీరు చేస్తున్నది ఉద్యోగం కాదు.. సేవ..’ అని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అలాంటప్పుడు, వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులెలా అవుతారు.? ముఖ్యమంత్రి చెప్పేదానికీ, ముఖ్యమంత్రి పేరుతో ప్రభుత్వ ప్రకటనల్లో పేర్కొన్నదానికీ పొంతన లేదంటే, వ్యవస్థలు.. ముఖ్యమంత్రిని లెక్క చేయని విధంగా పనిచేస్తున్నాయని అనుకోవాలా.? అన్న ప్రశ్న తలెత్తడం సహజమే కదా.

గడచిన రెండేళ్ళలో మొత్తం ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించేశామని చెప్పుకుంది ప్రభుత్వం. ‘2019 జూన్ నుంచి ఇప్పటివరకు జగనన్న ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు’ అంటూ ఈ మొత్తం లెక్క చెప్పారు. ఆరు లక్షల ఉద్యోగాలలో, 2 లక్ష 59 వేల ఉద్యోగాలు వాలంటీర్లవే. కాగా, మొత్తం రెగ్యులర్ ఉద్యోగాలు ఒక లక్షా ఎనభై నాలుగు వేల 264గా ప్రభుత్వం పేర్కొంటోంది. కాంట్రాక్టు ఉద్యోగాలు 19,701. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు 3,99,791. ఇందులో 2,59,585 మంది వాలంటీర్లు కావడం గమనార్హం.

ఇక, 2021-22 సంవత్సరానికిగాను 10,143 ఉద్యోగాల్ని కల్పించబోతోందట జగన్ ప్రభుత్వం. నేతి బీరకాయలో నెయ్యి చందాన.. ఉద్యోగాల కల్పన ప్రకటనలో.. అసలు సిసలు ఉద్యోగాలు ఎన్నో.. అన్న ఆవేదన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఔను, వాలంటీర్లవి ప్రభుత్వ ఉద్యోగాలే.. అని ఇప్పుడు జనం నమ్మాలేమో. ఒకవేళ వాలంటీర్లు, తమ వేతనాలు పెంచాలని అడిగితే మాత్రం.. మళ్ళీ అవి ‘సేవా కార్యక్రమాలు’గా మారిపోతాయ్. వినేవాడు వెర్రి వెంగళప్పలైతే.. చెప్పే కథలు ఇలాగే వుంటాయంటూ సోషల్ మీడియాలో ప్రభుత్వ తీరుపై సెటైర్లు పడుతున్నాయ్.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...