Switch to English

జిల్లాల ’పేరు‘తో రాజకీయం.! ఓ నిరంతర ప్రక్రియ.!

కోనసీమ జిల్లా పేరు రగడ ఇక్కడితో చల్లారిపోతుందా.? ఏమోగానీ, ఇదొక నిరంతర ప్రక్రియ అట.! ఔను, జిల్లాల పేరు మార్పు ఓ నిరంతర ప్రక్రియ.. అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ సెలవిచ్చారు. ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే.

ఓ రకంగా చూస్తే, జిల్లాలకు పేర్లు పెట్టడం అనేది నిరంతర ప్రక్రియ అయితే కావొచ్చుగాక.! కానీ, పేర్లు మార్చడం వల్ల ప్రయోజనమేంటి.? ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో జిల్లాల పేర్లు మార్చడం అనేది చాలా చాలా చాలా అరుదుగా జరిగింది. చంద్రబాబు హయాంలో ఒక్క జిల్లా పేరు కూడా మార్చలేదు.. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి.

ఆయా జిల్లాలకు పేర్లు మార్చాలనే డిమాండ్లు రావడంలో వింతేమీ లేదు. కాకపోతే, పేర్లు మార్చడం వల్ల ప్రజలకు అదనంగా ఒనగూడే ప్రయోజనమేంటని పాలకులు ఆలోచించాలి. తమ రాజకీయ లబ్దికోసం మాత్రమే అధికారంలో వున్న పార్టీలు ఇలా పేర్లతో రాజకీయాలు చేస్తుంటాయి.

కోనసీమ జిల్లా విషయాన్నే తీసుకుంటే.. కోనసీమ అని పేరు వున్నా.. అంబేద్కర్ అనే పేరు వున్నా, అంబేద్కర్ కోనసీమ.. అనే పేర్లు వున్నా.. ఆ జిల్లా వాసుల జీవనంలో పెద్దగా మార్పులేమీ వుండవు. పేర్లు మార్చడం వల్ల కోనసీమ జిల్లాలో ప్రజలంతా రాత్రికి రాత్రి ధనవంతులో, చైతన్యవంతులో అయిపోతారనుకోవడం మూర్ఖత్వం.

మరెందుకు పేర్లతో రాజకీయాలు నడుస్తున్నట్టు.? ఇదేమీ మిలియన్ డాలర్ల ప్రశ్న కాదు. పేరు మార్చమని ఒకరంటారు.. మార్చొద్దని ఇంకొకరు అంటారు. ఎవరు ఏమన్నాగానీ, ప్రభుత్వంలో వున్నోళ్ళు తాము ఏం చేయాలనుకుంటారో.. అదే చేస్తారు. రాష్ట్ర రాజధాని అమరావతిని మూడేళ్ళపాటు తొక్కిపెట్టిన పాలకులు, తద్వారా రాష్ట్రానికి ఏం లాభం చేకూర్చారు.? రాష్ట్రానికి నష్టాన్ని మిగల్చడం తప్ప.. అందులో కలిగిన ప్రయోజనమేమీ లేదు.

కోనసీమ జిల్లా పేరు విషయంలోనూ అంతే. ఈ వివాదం చల్లారితే, ఇంకో జిల్లా పేరుతో కొత్త వివాదం షురూ అవుతుంది. మంత్రిగారే చెప్పారు కదా.. నిరంతర ప్రక్రియ అని.! రాష్ట్ర ప్రజలే, జరుగుతున్న పరిణామాల్ని అర్థం చేసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

గోరంట్ల మాధవ్‌కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోన్న టీడీపీ.?

మళ్ళీ మళ్ళీ అదే చర్చ.! రాజకీయాలు దిగజారిపోయాయి, అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి దిగజారిపోయాయి. ప్రతిసారీ దిగజారిపోవడంలో కొత్త లోతుల్ని వెతుకుంటున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీలు సైతం, తమ స్థాయిని ఎప్పటికప్పుడు దిగజార్చుకోవడానికే...

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు సరైనవి కావు..

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెప్పారు. నల్గొండ జిల్లా చుండూరు సభలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు...

ఎక్కువ చదివినవి

నాగ శౌర్య కృష్ణ వ్రింద విహారి విడుదల తేదీ ఖరారు

ప్రస్తుతం నాగ శౌర్య వరస ప్లాపులతో సతమతమవుతున్నాడు. తను నటించిన వరుడు కావలెను, లక్ష్య కూడా ప్లాపులుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. నాగ శౌర్య నుండి వస్తోన్న...

రాశి ఫలాలు: బుధవారం 10 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:46 సూర్యాస్తమయం: సా.6:32 తిథి: శ్రావణ శుద్ధ త్రయోదశి మ.12:27 వరకు తదుపరి చతుర్దశి సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం) నక్షత్రము:పూర్వాషాఢ ఉ.8:40 వరకు తదుపరి ఉత్తరాషాఢ యోగం: ప్రీతి...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన చిరంజీవి ‘ముఠామేస్త్రి’

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన తీరు ఒక అద్భుతం. క్యారెక్టర్ లో...

ప్రతి ఒక్కరికి నచ్చే మాస్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ : నితిన్‌

నితిన్ హీరోగా రూపొందిన 'మాచర్ల నియోజకవర్గం' విడుదలకు సిద్ధం అయ్యింది. ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి...

రాశి ఫలాలు: గురువారం 11 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:46 సూర్యాస్తమయం: సా.6:32 తిథి: శ్రావణ శుద్ధ చతుర్దశి ఉ.9:48 వరకు తదుపరి పౌర్ణమి సంస్కృతవారం: బృహస్పతి వాసరః (గురువారం) నక్షత్రము:ఉత్తరాషాఢ ఉ.7:01 వరకు తదుపరి శ్రవణం...