వైసీపీ ‘కల్తీ’ రాజకీయం.! నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,337FansLike
57,764FollowersFollow

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం వైసీపీ హయాంలో ‘కల్తీ’కి గురయ్యిందన్న ఆరోపణల నేపథ్యంలో, కేసులు నమోదయ్యాయి.. అరెస్టులు కూడా జరిగాయి.

టీటీడీకి అప్పట్లో నెయ్యి సరఫరా చేసిన కంపెనీల ప్రతినిథులు అరెస్టవడం, విచారణలో నిందితులు ‘కల్తీ’ని అంగీకరించడం తెలిసిన విషయాలే. అనామక కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టిన టీటీడీ అధికారులు, వారిని అటు వైపుగా నడిపించిన అప్పటి టీటీడీ ఛైర్మన్, అప్పటి ప్రభుత్వ పెద్దలు.. అందరిపైనా విచారణ జరుగుతోంది.

తాజాగా, ఈ కేసుకు సంబంధించి, సీబీఐ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, సర్వోన్నత న్యాయస్థానం ముందు తమ వాదనలు వినిపించింది.. అదీ నిందితుల విషయమై. ‘అసలు వాడింది నెయ్యే కాదు’ అన్నది సీబీఐ వాదన. అదేంటీ, వాడింది కల్తీ నెయ్యి కదా.? అసలంటూ నెయ్యే కాదని సీబీఐ అంటోందేంటి.? అని అంతా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.

పామాయిల్, కొన్ని రసాయనాలు కలిపి కల్తీ నెయ్యిని తయారు చేశారన్నది సీబీఐ వాదన. ఇది మామూలు విషయం కాదు. కలిపిన రసాయనాలు ఏంటి.? నెయ్యి పేరుతో, ప్రసాదంలో వాడేందుకు ఎవరు అనుమతులిచ్చారు.? వంటి అంశాలకు సంబంధించి నిజాలు నిగ్గు తేలాలి.

అయితే, వైసీపీ వాదన మరోలా వుంది. ‘అసలు నెయ్యే కాదని సీబీఐ అంటోంది.. పామాయిల్, రసాయనాలు కలిపారని సీబీఐ చెబుతోంది. అలాంటప్పుడు, నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితరులు ఆరోపించడం తప్పే కదా..’ అన్నది వైసీపీ వాదన.

వైసీపీ కల్తీ రాజకీయాలు ఇలా వుంటాయి. అంటే, లడ్డూలో నెయ్యి వాడాల్సి వుండగా, నెయ్యి వాడకుండా, పామాయిల్ అలానే రసాయనాలతో తయారు చేసిన పదార్థాన్ని తమ హయాంలో వినియోగించామని వైసీపీ పరోక్షంగా ఒప్పుకుంటున్నట్లే కదా.?

హత్య చేశాం.. కానీ, అందరూ ఆరోపిస్తున్నట్లు గొడ్డలితో నరకలేదు.. కత్తితో కడుపులో పొడిచి చంపేశాం.. అన్నట్లుంది వైసీపీ వాదన.

సినిమా

Vijay: ‘విజయ్ వెనక ఏదో దైవశక్తి ఉంది’.. నటుడి కామెంట్స్

Vijay: గంటగంటకీ తమిళనాడు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. కూతవేటు దూరంలో సీఎం కాకుండా ఆగిపోయారు టీవీకే పార్టీ అధినేత విజయ్. అయితే.. రాజకీయ పరిణామాలు...

Peddi: ‘పెద్ది’ ప్రమోషన్స్.. హైప్ ఎక్కడ..? ఆందోళనలో ఫ్యాన్స్

Peddi: రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది....

“‘పెద్ది’ సెట్స్ సెట్‌లా కనిపించవు”: అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా *‘పెద్ది’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

“రామ్ చరణ్ ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు.. చిరంజీవి కుటుంబ...

Lavanya Tripathi ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై...

SVC63: సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి-దిల్ రాజు సినిమాలో విలన్.. పరిశీలనలో పలువురి...

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను ప్రముఖ...

రాజకీయం

పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయానికి కొత్త రూపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్,...

“టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు బయటికి రాదు”.. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్‌లో మంత్రి నిమ్మల సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో...

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న ఏపీ”.. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి...

“విద్యలో గాలి మేడలు వద్దు.. గట్టి పునాదే ముఖ్యం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గాలిలో మేడలు కట్టే ఫ్యాన్సీ విద్యా విధానాల కంటే, విద్యార్థుల్లో ప్రాథమిక...

“డేటా సెంటర్ పరికరాల తయారీలో భారత్ అగ్రగామి కావాలి”: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, కూలింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి...

ఎక్కువ చదివినవి

“ఇది కేవలం ఆరంభం మాత్రమే…”: ఏపీ ప్రగతిపై లోకేష్ వ్యాఖ్యలు

అమరావతి: గత 22 నెలల్లో ఆంధ్రప్రదేశ్ సాధించిన పురోగతి దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలిచిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’...

తెలుగు రాజకీయాలపై టీవీకే విజయ్ గెలుపు ప్రభావం శూన్యం.!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్ ఘన విజయం సాధించాక, తెలుగు రాష్ట్రాల్లో ఇదే అంశం చుట్టూ పెద్ద రాజకీయ చర్చ జరుగుతోంది. చర్చ అనడం కంటే రచ్చ అనడం కరెక్టేమో. నిజానికి,...

అందర్నీ ఒకే వేదికపైకి రప్పించిన బండ్ల గణేష్.. కూతురు ఎంగేజ్‌మెంట్ గ్రాండ్ వేడుక!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు పొందిన నిర్మాత Bandla Ganesh మరోసారి తన స్టైల్‌ను చూపించాడు. తన కుమార్తె Janani Bandla ఎంగేజ్‌మెంట్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించి ఇండస్ట్రీతో పాటు...

మంగ్లీ కేసులో మలుపు.. అరెస్ట్ ముంగిటేనా?

గాయని మంగ్లీకి సంబంధించిన మైక్రోఫైనాన్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో భాగంగా పోలీసులు మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంకు ఖాతాలను పరిశీలించగా, అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి వచ్చినట్లు...

“అమరావతి సచివాలయం గ్లాస్ ఖర్చుపై నిజం ఏమిటి?”

అమరావతి సచివాలయం భవనాల నిర్మాణంలో గ్లాస్ కోసం రూ.2540 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అధికార వర్గాలు మరియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఈ ఆరోపణలు...