శోభా నాగిరెడ్డి మరణం.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనా నేరం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,456FansLike
57,764FollowersFollow

వైసీపీ నేత శోభా నాగిరెడ్డి, ఎన్నికల ప్రచారంలో దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమె వైసీపీలో వుండేవారు. వైసీపీ అభ్యర్థిగా ఆ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమె చనిపోయారుగానీ, గెలిచేశారు.! ఆ తర్వాత ఉప ఎన్నిక వచ్చిందనుకోండి.. అది వేరే చర్చ.

శోభా నాగిరెడ్డి మరణానికి సంబంధించి నేరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద మోపెయ్యగలమా.? ఛాన్సే లేదు.! అనూహ్యమైన రీతిలో జరిగిన ప్రమాదమది. ఘోర రోడ్డు ప్రమాదమే.! దాన్ని ప్రమాదంగా మాత్రమే చూడాలి. పార్టీ అధినేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ ఘటనకు ఎలా బాధ్యత వహిస్తారు.?

అలాగే, ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూసేందుకు వచ్చి, తిరిగి వెళ్ళే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు అభిమానులు చనిపోవడం కూడా అనూహ్య ఘటనే. ‘దయచేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. సినిమా మీకు ఆనందాన్నిస్తుంది. ఇంటికి వెళ్ళే సమయంలో అజాగ్రత్తగా వుండొద్దు.. మీకేమైనా జరిగితే మీ కుటుంబ సభ్యులు బాధపడతారు.. మాకూ ఆ బాధ వుంటుంది..’ అని చేతులు జోడించి మరీ, అభిమానులకు విజ్ఞప్తి చేశారు సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకి బాధ్యత వహిస్తూ, ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలనీ, పవన్ కళ్యాణ్‌ని వెంటనే అరెస్ట్ చేయాలనీ వైసీపీ నేతలు కొందరు డిమాండ్ చేసెయ్యడం మొదలు పెట్టారు.

పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ నేతలు, ఒక్కసారి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదాన్ని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ‘గేమ్ ఛేంజర్’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చూసి, తిరిగి వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురైన అభిమానులకు సంబంధించి పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాల్సి వస్తే, శోభా నాగిరెడ్డి మరణానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యుడవుతారు కదా.?

‘పుష్ప 2 ది రూల్’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన వేరు. అక్కడ తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ రాక వల్ల జరిగిన తొక్కిసలాట. పోలీసులు వద్దంటున్నా అల్లు అర్జున్ ఆ థియేటర్‌కి వచ్చాడన్నది అసలు విషయం.

దానికీ, ‘గేమ్ ఛేంజర్’ ఘటనకీ అస్సలు సంబంధం లేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో నిర్వహించిన బహిరంగ సభల దగ్గరే పలవురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా కూడా పలువురు ప్రాణాలు కోల్పోవడం చూశాం.

2024 ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం తర్వాత వైసీపీ నేతలకు పూర్తిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అప్పటినుంచి వారి మానసిక స్థితి అస్సలేం బావున్నట్టు లేదు. ‘పుష్ప 2 ది రూల్’ సినిమా హీరో అల్లు అర్జున్ తరఫున వకాల్తా పుచ్చుకుంటారు.. తమిళ రాజకీయ నాయకుడు, అక్కడి డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ తరఫున మాట్లాడతారు.. ప్రకాష్ రాజ్‌ని వెనకేసుకొస్తారు.. తమిళ కమెడియన్లనీ సమర్థించేస్తుంటారు.. ఇదంతా పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగానే సుమీ.!

‘గేమ్ ఛేంజర్’ ఘటన విషయంలోనూ వైసీపీ నేతల తుత్తర అదే.! ముందైతే, సోకాల్డ్ వైసీపీ నేతలకి, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకీ మానసిక చికిత్స అవసరం. ఆ దిశగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

సినిమా

Urvashi Rautela: కేన్స్ లో మెరిసిన ఊర్వశి రౌతేలా..! ఆమె లుక్...

Urvasi Rautela: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాల్తేరు వీరయ్య, డాకూ మహారాజ్, బ్లాక్ రోజ్, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్...

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి...

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం...

Producers Guild: ఇన్నాళ్లూ గుర్తురాని సమస్య ‘పెద్ది’ వస్తుంటే గుర్తొచ్చిందా?: రవిశంకర్

Producers Guild: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పర్సంటేజీ వివాదంపై ఇప్పుడు మరో వర్గం తన వాదన వినిపించింది. నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ...

‘కలెక్షన్లు పెరిగాయి.. కానీ ప్రేక్షకులు తగ్గారు’: బన్నీ వాస్

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత Bunny Vas చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ల ఆదాయం తగ్గిపోవడం, ప్రేక్షకులు సినిమాలకు...

Sirish: ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లోనే సమస్య గుర్తొచ్చిందా..? శిరీష్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ థియేటర్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు...

రాజకీయం

“20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ఎంఎస్ఎంఈ లే బలం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి Nara Lokesh పేర్కొన్నారు....

పెట్రోల్ పొదుపునకు కాన్వాయ్ సగం తగ్గించిన పవన్ కళ్యాణ్

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌరవ ప్రధాన మంత్రి Narendra Modi సూచించిన పొదుపు చర్యలకు మద్దతుగా...

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్.. 31 మందికి ఉచిత ఉన్నత విద్య

Pawan Kalyan పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు మరో కీలక నిర్ణయంతో అండగా నిలిచారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్‌ .. పెదపాడు పిల్లలకు కొత్త స్కూల్ భవనం

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల స్థానంలో కొత్త భవనం నిర్మాణం పూర్తయింది....

ఎక్కువ చదివినవి

Daily Horoscope: ధనుస్సు వారికి ఆర్థిక లాభాలు.. మీన రాశివారికి శుభవార్తలు

మే 8, 2026 శుక్రవారం రాశిఫలాలు: ఈరోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం,...

ఢిల్లీ గర్ల్స్ హాస్టల్‌లో షాకింగ్ ఘటన.. డ్రైనేజ్ నుంచి భారీగా కండోమ్స్ వెలుగులోకి!

ఢిల్లీలోని ఓ ప్రముఖ పీజీ గర్ల్స్ హాస్టల్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హాస్టల్ డ్రైనేజ్ లైన్ అకస్మాత్తుగా పూర్తిగా బ్లాక్ కావడంతో నిర్వాహకులు శానిటేషన్ సిబ్బందిని పిలిపించినట్లు...

Sirish: ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లోనే సమస్య గుర్తొచ్చిందా..? శిరీష్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ థియేటర్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా మల్టీప్లెక్స్‌ల తరహాలో పర్సంటేజీ విధానం...

“హలో ఇండియా!” పేరుతో చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు..

ఆంధ్రప్రదేశ్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddy తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu...

‘పెద్ది’ హవా మామూలు కాదు.. బుకింగ్స్‌తోనే కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తున్న రామ్ చరణ్ సినిమా!

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ విడుదలకు ఇంకా సమయం ఉండగానే సినీ వర్గాల్లో భారీ హైప్‌ను సొంతం చేసుకుంటోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న...