వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బెంగళూరుకే పరిమితమవుతుండడంతో వైసీపీ కార్యకర్తలకు ఏం పాలుపోని పరిస్థితి. తమిళ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు.. వాట్ నాట్.. చివరికి హరియాణా రాజకీయాలపైనా ప్రత్యేక శ్రద్ధ కనబర్చడమే కాదు, ఆ పేరు చెప్పి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద షరామామూలుగా విమర్శలు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు.
అసలు హరియాణా ఎన్నికలకీ, పవన్ కళ్యాణ్‌కీ ఏమైనా సంబంధం వుందా.? ఆ మాత్రం ఇంగితమే వుంటే, వాళ్ళు వైసీపీ కార్యకర్తలెందుకు అవుతారు.? రెండు మూడు రోజుల నుంచి హరియాణా, జమ్మూకాశ్మీర్ ఎన్నికల విషయమై, ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. వాటిని పవన్ కళ్యాణ్‌కి లింకప్ చేస్తూ.. పనికిమాలిన రాతలతో, సోషల్ మీడియా అంతా రోత పుట్టించేస్తూ వచ్చారు వైసీపీ కార్యకర్తలు.
ఫలితాలు రానే వచ్చాయ్. కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకున్న వైసీపీ కార్యకర్తలకు షాక్ తగిలింది. అటు కాశ్మీర్‌లోనూ కాంగ్రెస్ ఖేల్ ఖతం అయిపోయింది. హరియాణాలోనూ పాపం కాంగ్రెస్ ఓడిపోయింది. దాంతో, తెల్లవారు ఝాము నుంచీ హంగామా చేసిన వైసీపీ కార్యకర్తలు, ఉదయం పది తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.
అదేంటో, మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ కార్యకర్తలు ఎదుర్కొన్న దుస్థితే, ఇప్పుడు హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి సమయంలోనూ ఎదుర్కొనడం.. అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
అధినేత వైఎస్ జగన్, రాష్ట్రంలో ప్రతిపక్ష నేత హోదా కోరుకుంటున్నాగానీ.. ఆయనకు రాష్ట్ర రాజకీయాలపై పెద్దగా ఆసక్తి కనిపించకపోవడంతో, వైసీపీ శ్రేణులు.. చెట్టుకొకరు, పుట్టకొకరు.. అన్నట్లు చెల్లాచెదురైపోతున్నారు.
వైసీపీకి ఒకప్పుడు బలమైన సోషల్ మీడియా టీమ్ వుండేది. అందులో చాలామంది ఇప్పటికే ఔట్ అయిపోయారు. మిగిలినోళ్ళు.. వైసీపీ తరఫున సోషల్ మీడియాలో కామెంట్ చేయడానికి కంటెంట్ లేక, ఇతర రాష్ట్రాల్లో రాజకీయాల్లో వేలు పెట్టి, శునకానందం పొందుతున్నారు.. షాక్ ట్రీట్మెంట్లూ ఎదుర్కొనాల్సి వస్తోంది.
అయినా, కాంగ్రెస్ గెలిస్తే వైసీపీకి వచ్చే లాభమేంటి.? కాంగ్రెస్ కోసం ఎందుకింతలా వైసీపీ సోషల్ మీడియా టీమ్, స్పెషల్ డ్యూటీ చేస్తున్నట్లు.? విలీనంపై ఏమైనా స్పష్టమైన సంకేతాలు అధినాయకత్వం నుంచి వైసీపీ సోషల్ మీడియా టీమ్‌కి వచ్చాయని అనుకోవాలా.?
హరియాణాలో కాంగ్రెస్ ఓడిపోయింది.. ఈవీఎం గెలిచిందంటూ వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లే కాదు, గత ఐదేళ్ళుగా వైసీపీ హయాంలో ప్రజాధనాన్ని ప్రకటనల రూపంలో దోచేసిన నీలి కూలి మీడియా కూడా నెత్తీ నోరూ బాదుకుంటుండడం కొసమెరుపు. ఇందులో నీలి ఎర్నలిస్టుల పైత్యం పతాక స్థాయికి చేరుకోవడం మరో ఆసక్తికర అంశం.