Switch to English

‘స్థానిక’ ప్రచారంపై నిషేధం సరే.. వైసీపీపై చర్యలుంటాయా.!

స్థానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది కరోనా వైరస్‌ కారణంగా. సర్వోన్నత న్యాయస్థానం ఎన్నికల కోడ్‌ ఎత్తివేయాలని ఆదేశించింది గతంలోనే. దాంతో, ఎన్నికల కోడ్‌ అమల్లో లేదుగానీ, ఎన్నికల ప్రచారం మాత్రం నిర్వహించకూడదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అయినాగానీ, వ్యవస్థల పట్ల ఏమాత్రం గౌరవం లేని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు నేతలు, ‘కరోనా వైరస్‌ – ప్రభుత్వ సాయం’ పేరుతో, స్థానిక ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించేస్తున్నారు.

ప్రభుత్వం, ప్రతి పేద కుటుంబానికీ వెయ్యి రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన విషయం విదితమే. ఆ సాయం అందించే క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే కాదు, అధికారిక పదవుల్లో లేనివారూ అత్యుత్సాహం చూపుతున్నారు. ‘జగనన్న వెయ్యి రూపాయలు ఇచ్చాడు.. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకే ఓటు వేయాలి..’ అంటూ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ ముఖ్య నేతలు, ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

‘మీ ప్రభుత్వం ఇస్తోందా.? మీ పార్టీ ఇస్తోందా.?’ అని చాలా చోట్ల జనం, అధికార పార్టీ నేతలకు ఎదురు తిరుగుతుండడం గమనార్హం. ‘అబ్బే, మా పార్టీ నేతలెవరూ అలా చేయరు..’ అంటూ కొందరు వైసీపీ నేతలు మీడియాకెక్కి బుకాయించినా, వాస్తవాలు సోషల్‌ మీడియాలో వీడియోల రూపంలో దర్శనమిస్తున్నాయ్‌.

ఇక, ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల ప్రచారంపై నిషేధం కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (ఎస్‌ఇసి) నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం చేస్తున్న వారికి సంబంధించి పూర్తి వివరాల్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలని కలెక్టర్లకు, ఎన్నికల పరిశీలకులకు ఆయన లేఖ రాయడం గమనార్హం.

అయితే, స్థానిక ఎన్నికల నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని బదిలీలకు సిఫార్సు చేసింది. ఆ బదిలీల్ని రాష్ట్ర ప్రభుత్వం లెక్క చేయకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. మరిప్పుడు, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఆదేశాల్ని ప్రభుత్వం పాటిస్తుందా.? లేదా.? వేచి చూడాల్సిందే.

సినిమా

సౌత్ ఇండియన్ స్టార్‌ హీరోకు గాయాలు.!

తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్‌ డంను సొంతం చేసుకున్న స్టార్‌ హీరో సూర్య తన హోం జిమ్‌ లో వర్కౌట్స్‌ చేస్తుండగా ప్రమాదం జరిగింది...

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ రంగుల పైత్యం.. ఈసారీ ‘సర్కారు’ పప్పులుడకలేదంతే.!

ఓ గ్రామంలో ఓ వంద ఇళ్ళు వున్నాయనుకుందాం.. అందులో 30 ఇళ్ళో 40 ఇళ్ళో వైసీపీ మద్దతుదారులవో వున్నాయనుకుందాం.. వాటికి వైసీపీ రంగులేసుకోవచ్చు కదా.? ప్రభుత్వ కార్యాలయాలకే వైసీపీ రంగులేయాలని వైఎస్‌ జగన్‌...

మనుషులకు డాల్ఫిన్లు గిఫ్టులిస్తున్నాయ్.. ఎక్కడో తెలుసా?

డాల్ఫిన్లు చాలా తెలివైనవన్న సంగతి తెలిసిందే కదా? అవి మనుషులతో చాలా స్నేహపూరితంగా కూడా ఉంటాయి. ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవడంలోనూ, సమస్యల్ని పరిష్కరించే విధానంలోనూ ఇతర జీవుల కంటే డాల్పిన్లు చాలా...

చైనా ఆరు రోజుల ఆలస్యం.. ప్రపంచం అల్లకల్లోలం!

ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న కరోనా వైరస్ కు కారణం ఎవరు అని అడిగితే.. ఠక్కున చైనా అనే సమాధానమే వస్తుంది. కావాలనే సృష్టించారో లేక ప్రపంచం కర్మ కొద్దీ వచ్చిందో అనే విషయాన్ని...

బాలీవుడ్ సూపర్ స్టార్ తో పూరి జగన్నాథ్?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. జెట్ స్పీడ్ లో...

క్రైమ్ న్యూస్: బాలికపై గ్యాంగ్ రేప్.. ఫ్రెండ్స్ తో కలిసి ప్రియుడి దారుణం

దేశం మొత్తం విపత్కర పరిస్థితుల్లో ఉన్నా మహిళలపై మృగాళ్ల అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో దిశ చట్టం అమలులో ఉన్నా కొందరు కామాంధులు ఏమాత్రం భయపడటం లేదు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బాలికపై...