Switch to English

నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,323FansLike
57,764FollowersFollow

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని సీతానగరం లో వైసీపీ అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. నీటిపారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయాన్ని ఆక్రమంగా నిర్మిస్తున్నారు. బోట్ యార్డు గా పరిగణిస్తున్న ఆ భూమిని అప్పట్లో వైసీపీ ప్రభుత్వం నామమాత్రపు లీజు తో కొట్టేశారు. ఈ నిర్మాణంపై ఇప్పటికే సీఆర్డిఏ వైసీపీ కి నోటీసులు జారీ చేసింది. ఈ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ని సవాలు చేస్తూ నిన్న ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. చట్టాన్ని మీరి ప్రవర్తించొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్మాణాన్ని కూల్చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ భవనాన్ని .. శనివారం తెల్లవారు జామున 5.30 ప్రాంతంలో కూల్చివేత ప్రారంభించారు.

ఇదే కాకుండా రాష్ట్రంలోని జిల్లాల వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూమిని నామమాత్రపు లీజుకి అప్పగించారంటూ అప్పట్లో తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు ఆరోపించారు. మరోవైపు ఈ స్థలంలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కి మంచినీళ్లు అందించేలా ప్లాంట్ పెడతానని అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ఖాళీ స్థలం ఉందన్న విషయం వెలుగులోకి వచ్చింది. అందులో రెండు ఎకరాల స్థలాన్ని పార్టీ కార్యాలయం నిర్మించేందుకు ప్రభుత్వం లీజుకి అప్ప చెప్పింది.

కార్యాలయం కూల్చివేత పై జగన్ ట్విట్

వైసీపీ కార్యాలయం కూల్చివేత పై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ‘ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడిన చంద్రబాబు తన దమన కాండను మరో స్థాయికి తీసుకెళ్లారు. నియంతలా మారి దాదాపు పూర్తికావచ్చిన వైసీపీ కార్యాలయాన్ని కూల్చి వేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. దేశంలో చట్టం, న్యాయం కనుమరుగైపోయాయి. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు చర్యలను ఖండించాలి’ అని ట్వీట్ చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ట్రోల్స్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోండి.. డీజీపీకి “మా” సభ్యుల వినతి

సోషల్ మీడియా వేదికగా సినీ ఆర్టిస్టులపై వస్తున్న ట్రోల్స్, అసభ్యకర ప్రచారంపై చర్యలు తీసుకోవాలంటూ మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ( MAA ) సభ్యులు తెలంగాణ...

డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి చేతుల మీదుగా “జస్ట్ ఎ మినిట్” ట్రైలర్...

" ఏడు చేపల కథ" ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన హీరో అభిషేక్ పచ్చిపాల. ఇప్పుడాయన హీరోగా నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ హీరోయిన్లుగా "జస్ట్...

Murari: మహేశ్ ‘మురారి’ వెడ్డింగ్ కార్డు వైరల్.. మూవీ రీ-రిలీజ్ తో...

Murari: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) కెరీర్లో తొలి సూపర్ హిట్ మూవీ ‘మురారి’ (Murari). క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో తెరకెక్కిన...

Ram Charan: అంబానీ ఇంటి పెళ్లిసందడిలో మెరిసిన ‘రామ్ చరణ్’

Ram Charan: ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు.. కోట్లాది దేవతల ఆశీర్వాదం.. అంగరంగ వైభవంగా జరిపే వివాహానికి తెలుగు మాటల్లో ఉన్న ఓ నానుడి ఇది....

‘పుష్ప’ గలాటా: అల్లు అర్జున్ గడ్డం తెచ్చిన తంటా.!

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప 2 ది రూల్’ సినిమాకి సంబంధించి రచ్చ తెరపైకొచ్చింది. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ మధ్య అభిప్రాయ...

రాజకీయం

పదకొండు ప్రభావం: వైసీపీ.. రాజు లేని రాజ్యమైపోయిందే.!

వై నాట్ 175 అనే నినాదాన్ని నిజానికి, వైసీపీ శ్రేణులే నమ్మలేదు. అప్పటి వైసీపీ సిట్టింగ్ ప్రజా ప్రతినిథులూ నమ్మలేదు. కానీ, సాధ్యం కాని విషయాన్ని బలంగా రుద్దేందుకోసం ‘సిద్ధం’ అంటూ కోట్లు...

రేపే అల్పపీడనం.. రాష్ట్రంలో ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం గా ఉండాలని సూచించింది. శుక్రవారం మరో...

‘విజయ – శాంతి’ వివాదంపై సజ్జల మౌనం దేనికి సంకేతం.?

అధికారిణి శాంతి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మధ్య ఏదో సంబంధం వుందంటూ, శాంతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెద్ద రచ్చకు కారణమైన సంగతి తెలిసిందే. ఓ...

అయినా గులాబీ పార్టీ తెలంగాణలో ఖాళీ అయిపోతోందే.!

ఎక్కడ తేడా కొడుతోందో గులాబీ పార్టీ ఆత్మ విమర్శ చేసుకోలేకపోతోంది.! కేసీయార్ రాజకీయ వ్యూహాలు ఏమైపోయాయ్.? కేటీయార్ వాక్ చాతుర్యం ఎక్కడికి పోయింది.? అసలంటూ గులాబీ పార్టీ నాయకులకు అధినాయకత్వం నుంచి సరైన...

పవన్ కళ్యాణ్ మీద కార్టూన్: ‘పచ్చ’ బుద్ధి బయటపెట్టుకున్న ఆర్కే.!

టీడీపీ అను‘కుల’ మీడియాలో ఏబీఎన్ ఆర్కేని పెద్ద ముత్తైదువగా పేర్కొంటుంటారు.! కుల జాడ్యం నరనరానా జీర్ణించుకుపోయిన వ్యక్తిగా ఆర్కే అలియాస్ వేమూరి రాధాకృష్ణకి మీడియా, రాజకీయ వర్గాల్లో ఓ ఘనమైన పేరు ప్రఖ్యాతులున్నాయ్....

ఎక్కువ చదివినవి

వైసీపీకి వైఎస్సార్ గుర్తుకొచ్చారేంటో చిత్రంగా.!

‘ఇంకొంచెం తిను నాన్నా..’ అంటూ చాలాకాలం క్రితం ఓ తెలుగు దినపత్రికలో వచ్చిన కార్టూన్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోందిప్పుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో తన...

Anant Ambani-Radhika: అనంత్ అంబానీ-రాధిక వివాహం.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ హాజరు

Anant Ambani-Radhika: ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోగిపోతున్న అంశం అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ (Anant Ambani-Radhika) వివాహం. అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట జరుగుతున్న పెళ్లిసందడి కావడంతో యావత్ దేశం...

Heroine: క్యాన్సర్ తో పోరాడుతున్న నటి.. అయినా షూటింగులకు హాజరు..

Heroine: స్టేజి త్రీ క్యాన్సర్ తో పోరాడుతూ కూడా బాలీవుడ్ నటి హీనా ఖాన్ (Hina Khan) సినిమా షూటింగ్స్ లో పాల్గొనడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బాలీవుడ్ లో ఆమె సుపరిచితం....

హీరో రాజ్ తరుణ్ కి పోలీసుల నోటీసులు

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కి హైదరాబాద్ లోని నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అతనిపై లావణ్య అనే యువతి కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై...

Gladiator 2: ‘గ్లాడియేటర్ 2’.. 24ఏళ్లకి ఎపిక్ బ్లాక్ బస్టర్ సీక్వెల్.. రిలీజ్ డేట్ ప్రకటన

Gladiator 2: సరిగ్గా 24ఏళ్ల క్రితం విడుదలై ప్రపంచవ్యాప్తంగా బాక్సీఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన సినిమా ‘గ్లాడియేటర్’. రోమన్ కథతో తెరకెక్కిన సినిమాలో విజువల్స్, యుద్ధ సన్నివేశాలు, నటీనటుల నటన, కథకు...