Switch to English

కోడెల నుంచి అచ్చెన్నదాకా.. వైసీపీ ఏం సాధించింది.!

రాజకీయాల్లో ఆరోపణలు సర్వసాధారణం. కక్ష సాధింపు చర్యలు కూడా అంతే. ఎవరు అధికారంలో వున్నా ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు మామూలే. అధికారంలోకి రావడమెందుకు.? అంటే, ప్రత్యర్థుల మీద రాజకీయ దాడి చేయడానికే అన్నట్లు తయారయ్యింది తప్ప.. ప్రజలేమనుకుంటున్నారని మాత్రం ప్రధాన రాజకీయ పార్టీలు ఆలోచించడంలేదు. ప్రతిసారీ కొండని తవ్వుతున్నారు.. ఎలుకని కూడాపట్టుకోలేకపోతున్నారు. ఎందుకిలా.?

‘బట్టకాల్చి మొహాన వేయడం’ అనేది రాజకీయ పార్టీలు చేయొచ్చుగాక.. అదీ రాజకీయమే అనుకోవచ్చు. కానీ, ప్రభుత్వాలే ఆ పని చేస్తే.! ఆంధ్రప్రదేశ్‌ మాజీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. రాజకీయ వేధింపులు తాళలేక ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. మొత్తం రాజకీయ వ్యవస్థ సిగ్గుపడాల్సిన సందర్భమది. అధికార పక్షం, ప్రతిపక్షం.. ఇందుకు మినహాయింపు కాదు.

టీడీపీ నిర్లక్ష్యం చేసింది.. వైసీపీ కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఈ దుస్థితి రేప్పొద్దున్న ఏ రాజకీయ నాయకుడికైనా రావొచ్చు. కానీ, ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నాయి రాజకీయ పార్టీలు.

తాజాగా, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై అధికార వైఎస్సార్సీపీ ఆరోపణలు షురూ చేసింది. ఈఎస్‌ఐ మందుల కుంభకోణమట. ఏ ప్రభుత్వంలో అయినా అవినీతి జరగలేదు.. అని ఎవరూ అనరు. ఎందుకంటే, వ్యవస్థ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. కానీ, ఆ అవినీతిని వెలికి తీయడం ఎలా.? అవినీతి బయటకు రాదు.. కానీ, రాజకీయ బురద మాత్రం రాజ్యమేలుతుంది.

కోడెల శివప్రసాద్‌ వ్యవహారం తర్వాత, అమరావతి.. ఆ తర్వాత ఇంకోటి.. ఇప్పుడేమో, అచ్చెన్నాయుడి వ్యవహారం. ఇంతేనా.? ఇంకేమన్నా వుందా.? అధికారంలో వున్న పార్టీలు ఆరోపణలు చేయకూడదు.. చర్యలు తీసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఆరోపణలు చేస్తూ సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారు. కోడెల విషయంలో జరిగిన అవినీతి గురించి ఇప్పుడెవరూ ఎందుకు మాట్లాడటంలేదు.? ఆ ‘కొండ’ని తవ్వి ఏ ఎలుకని పట్టారు.? పార్టీ మారితే వేధింపులుండవ్‌.. అధికారం మారితే.. అవినీతిపరులూ అటూ ఇటూ జారిపోతారు. ఈ రాజకీయం ఇంకెన్నాళ్ళు.?

సినిమా

ఓటీటీ రిలీజ్‌ కు అభ్యంతరం లేదన్న తెలుగు స్టార్‌ హీరో

థియేటర్లు నాలుగు నెలలుగా మూతపడే ఉన్నాయి. మరో రెండు మూడు నెలల వరకు కూడా ఓపెన్‌ అయ్యేది నమ్మకం తక్కువే. ఆ తర్వాత అయినా ఓపెన్‌...

బాలీవుడ్‌ మరో స్టార్‌ కన్నుమూత

బాలీవుడ్‌ లో వరుసగా జరుగుతున్న సంఘటలు సినీ ప్రేక్షకులకు తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయి. పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ కరోనా బారిన పడటంతో పాటు సుశాంత్‌ తో...

ఎక్స్ క్లూజివ్: ఊహించని డైరెక్టర్ తో అల్లు అర్జున్ పొలిటికల్ థ్రిల్లర్.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. క్లాస్ నుంచి కంప్లీట్ మాస్ లుక్ లోకి మారి...

షార్ట్ ఫిలింని కాస్తా మినీ మూవీగా మార్చేసిన రెజీనా.!

తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించి క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ రెజీనా. ప్రస్తుతం వరుస తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఈ...

సినిమా అవకాశమంటూ ఘరానా మోసం.. డబ్బులు వసూలు చేసి ఆపై..

సినిమా అంటే ఇష్టం అందరికీ ఉంటుంది. సినిమాల్లో నటించాలనే వ్యామోహం ఉంటుంది మరికొందరికి. ఇటువంటి వారిని సినిమా అవకాశాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఘటనలు గతంలో...

రాజకీయం

రాజస్థాన్ రగడ: పైలట్ దారెటు?

రాజస్థాన్ లో రాజకీయ రగడ మరింత ముదిరింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య కొనసాగుతున్న విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఇరువురూ తమ తమ బల ప్రదర్శనలు ఏర్పాటు...

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఎమ్మెల్యే

పశ్చిమ బెంగాళ్‌ హెమటాబాద్‌ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్‌ రాయ్‌ తన స్వగ్రామంలో తన ఇంటికి సమీపంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆయన్ను చంపేసి ఆ తర్వాత ఉరిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లుగా...

9 ఏళ్ల తర్వాత సుప్రీంలో పద్మనాభస్వామి ఆలయ కేసు తీర్పు

దేశంలోని అత్యంత సంపద ఉన్న దేవాలయంగా కేరళలోని తిరువనంతపురం పద్మనాభస్వామి వారి ఆలయం నిలిచిన విషయం తెల్సిందే. ట్రావెన్‌కోర్‌ రాజ వంశానికి చెందిన రాజులు ఈ భారీ సంపదను దాచారు. పద్మనాభస్వామి వారి...

పార్టీ పేరు రగడ: వైఎస్సార్సీపీకి నోటీసులు.!

ఇకపై యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనీ, వైఎస్సార్సీపీ అనీ పిలవడానికి వీల్లేదా.? ఏమో, ముందు ముందు ఆ పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మామూలుగా అయితే ఇప్పటిదాకా...

నిండా ముంచేసిన ముద్రగడ.. తెరవెనుక వున్నదెవరు.?

కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలన్న డిమాండ్‌ ఈనాటిది కాదు. నిజానికి, కాపు సామాజిక వర్గం కొత్తగా రిజర్వేషన్లు కోరడంలేదు. చాలా ఏళ్ళ క్రితం తమకున్న బీసీ-రిజర్వేషన్‌ని తిరిగి పునరుద్ధరించాలని మాత్రమే కోరుతోంది....

ఎక్కువ చదివినవి

ఓటీటీ రిలీజ్‌ కు అభ్యంతరం లేదన్న తెలుగు స్టార్‌ హీరో

థియేటర్లు నాలుగు నెలలుగా మూతపడే ఉన్నాయి. మరో రెండు మూడు నెలల వరకు కూడా ఓపెన్‌ అయ్యేది నమ్మకం తక్కువే. ఆ తర్వాత అయినా ఓపెన్‌ అవుతాయా అంటే అది కూడా చెప్పలేం...

పవన్ కళ్యాణ్ సినిమాకి పోటీగా తమిళ సూపర్ స్టార్ ఫిల్మ్.!

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా తెరకెక్కిన ‘మాస్టర్‌’ చిత్రం ఈ కరోనా లాక్‌ డౌన్‌ లేకుండా ఉండి ఉంటే ఇప్పటికే థియేటర్స్ లో సందడి చేసి ఉండేది. స్టార్ హీరోస్ కాస్త...

‘మంత్రి’గారి ఫిర్యాదు.. రఘురామకృష్ణరాజుపై చర్యలుంటాయా.?

పశ్చిమగోదావరి జిల్లాలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్సార్సీపీ)కి చెందిన ఇద్దరు ముఖ్య నేతల వ్యవహారం ఇప్పుడు తెలుగు నాట హాట్‌ టాపిక్‌గా మారింది. ఒకరేమో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కాగా,...

బిగ్ బ్రేకింగ్: అమితాబ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ లకు కరోనా పాజిటివ్​

ఇండియాలో రోజు రోజుకీ కరోనా వైరస్ వీర విజృంభణ చేస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదో ఒకరూపంలో ప్రజలపై దాడి చేస్తోంది. కరోనా బారిన పడ్డ వారి లిస్టులో తాజాగా బాలీవుడ్ కా...

125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం: అప్పుడు బాబు, ఇప్పుడు జగన్‌.!

రాజ్యాంగ రూపకర్త బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు గతంలో చంద్రబాబు సర్కార్‌ ప్రయత్నించింది. రాజధాని అమరావతి పరిధిలోని తుళ్ళూరులో ఇందు కోసం భూమిని కూడా కేటాయించారు. డిజైన్లు ఖరారయ్యాయి....