అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, ఓ ఎంపీ మధ్య రాజకీయ చిచ్చు రేగింది. ఎంపీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఎంపీ పావులు కదుపుతున్నారు. ఇరువురు అనుచరులూ బాహాబాహీకి దిగే పరిస్థితులు ఏర్పుడుతున్నాయి. పేరుకే ఎంపీ.. కానీ, అక్కడ ఎమ్మెల్యేకి కాస్త పవర్ ఎక్కువ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాపులారిటీ మీద గెలిచారు ఆ ఎంపీ.. తన కుటుంబానికి వున్న పేరు ప్రఖ్యాతులకు జగన్ ఇమేజ్ తోడవడంతో గెలిచారు ఎమ్మెల్యే. ఇదీ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఎంపీ భరత్ అలాగే ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య తలెత్తిన రాజకీయ రచ్చకు సంబంధించి తాజా ఈక్వేషన్.
ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వకుండా రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎంపీ భరత్ పెత్తనం చెలాయిస్తున్నారన్నది ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అనుచరుల ఆవేదన. దానికి భరత్ రామ్ అనుచరుల నుంచి కౌంటర్ ఎటాక్ గట్టిగానే పడుతోంది. మొన్నీమధ్యనే టీడీపీలో అంతర్గత తగాదాలు రచ్చకెక్కడం చూశాం. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామాకి సైతం సిద్ధపడ్డారు. చంద్రబాబు రంగ ప్రవేశం చేయడంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు.. ఈసారి గోదారి యుద్ధం వైసీపీలో జరుగుతోంది.
ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకి.. నియోజకవర్గంలో బోల్డంత పలుకుబడి వుంది.. అంతేనా, తూర్పుగోదావరి జిల్లాలో జక్కంపూడి కుటుంబానికి ప్రత్యేక గౌరవం వుంది. దాంతో, ఈసారి మంత్రి వర్గ విస్తరణలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. దాన్ని సహించలేక ఎంపీ భరత్ రాజకీయ రచ్చకు తెరలేపారన్నది ఓ వాదన.
కాగా, ఆవ భూముల వ్యవహారం కాస్తా ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వివాదానికి కారణమైందనే వాదన కూడా వినిపిస్తోంది. కారణం ఏదైతేనేం.. తూర్పోగోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా ఈ వ్యవహారమ్మీదనే చర్చ జరుగుతోంది. సినీ పరిశ్రమతో భరత్‌కి వున్న సంబంధాలు, తద్వారా చెలాయిస్తున్న పెత్తనం (ఈ మధ్య పలు సినిమా వేడుకల్లో కనిపిస్తున్నారాయన..).. వీటిని జక్కంపూడి సహించలేకపోతున్నారనేవారూ లేకపోలేదు.
153291 342484hi and thanks regarding the specific post ive actually been searching regarding this kind of information online for sum time these days hence thanks a good deal 299378
665440 114034Paris Hilton: So lovely spending time with Manny and h 801712
909808 210808Hi! I discovered your internet site accidentally today, but am actually pleased that we did! Its not only entertaining, but in addition straightforward to make use of in contrast to lots that Ive viewed! 212114
172401 307925Definitely value bookmarking for revisiting. I surprise how a lot effort you place to make the sort of great informative site. 837228
249074 264752This internet internet site is often a walk-through for all of the understanding you wanted concerning this and didnt know who need to. Glimpse here, and youll absolutely discover it. 86198
836863 737767Hey! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im definitely enjoying your blog and look forward to new updates. 689683