Switch to English

రక్తం చిందిస్తున్న రైతు.. ఏంటీ పైశాచికత్వం.?

ఓ ఎంపీగారి కారు.. ఓ రైతుని ఢీకొట్టింది. ఈ క్రమంలో రైతు, సదరు ఎంపీగారి కారు కింద పడ్డాడు. అదృష్టవశాత్తూ ప్రాణం పోలేదు. కానీ, కాలికి మాత్రం తీవ్ర గాయమయ్యింది. సదరు ప్రజా ప్రతినిది¸, ఘటన జరిగిన సమయంలో కారులోనే వున్నారు. ప్రమాదం జరిగాక, కనీసం కారు దిగి.. సదరు రైతు పరిస్థితిని గమనించలేకపోయారు. ఇది అమరావతి పరిధిలో నిన్ననే జరిగింది. అయితే, చిత్రంగా అధికార పార్టీకి కొమ్ము కాసే మీడియా మాత్రం ‘ఎంపీపై దాడి..’ అంటూ పెద్ద హెడ్డింగ్‌ పెట్టి వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది.

మొన్నామధ్య కూడా ఇలాంటి వైపరీత్యమే చోటు చేసుకుంది. ఎంపీని కొందరు యువకులు నిలదీస్తే, అలా నిలదీసినందుకు.. సదరు యువకులు జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. దీన్ని ప్రజాస్వామ్యం అందామా.? రాజకీయాలు కులాల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ ప్రజా ప్రతినిది¸ని ఎవరన్నా నిలదీస్తే, దళితులపై దాడి అనో.. మహిళలపై దాడి అనో చిత్రీకరించడం.. సర్వసాధారణమైపోయింది. అక్కడ ఓ రైతు ప్రాణం పోయేది.

నిజానికి, ఇలాంటి సంఘటనలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. కానీ, అక్కడ గాయపడింది పేద రైతు. అందుక్కారణం.. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిది¸. ఇంకేముంది.? పోలీసులు, హత్యాయత్నం కేసుని రైతు మీద పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

రాజధాని అమరావతిలో 69 రోజులుగా రైతుల ఆందోళనలు జరుగుతున్నాయి. ఉద్యమం చేస్తోన్నది రైతులు.. ఆ ఉద్యమానికి చాలా రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. అందులో టీడీపీ కూడా వుంది. ‘టీడీపీ గూండాలు.. ఎంపీపై దాడి చేశారు..’ అంటూ, రైతుల ఉద్యమాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చాలా తెలివిగా వైసీపీ చేస్తోంది. టీడీపీ గూండాలే ఆ దాడికి పాల్పడితే.. వారిని అదుపులోకి తీసుకోవచ్చుగాక.. కానీ, రైతు ఏం పాపం చేశాడని అతనిపైకి లారీలు ఎగబడుతున్నాయి.? అధికార పార్టీలకు చెందిన వాహనాలు దూసుకెళుతున్నాయి.?

ఏ జనంలోకి వెళ్ళి ‘ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌..’ అంటూ అధికారం దక్కించుకున్నారో.. ఇప్పుడు ఆ ప్రజలే రక్తం చిందిస్తున్నప్పుడు.. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్లు.? బాధ్యత ఉండక్కర్లేదా.!

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

రవితేజ మూవీ క్యాన్సల్ అయ్యిందా?

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్ మూవీ ఈ సమ్మర్లో విడుదల కావాల్సి ఉంది. కానీ విపత్కర పరిస్థితుల్లో సినిమా షూటింగ్ ఆగిపోవడంతో సినిమా విడుదల కూడా ఆగిపోయింది. ఎప్పటికి క్రాక్...

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ గిఫ్ట్.. ఎప్పుడైతే అప్పుడే

తన సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడంలో రాజమౌళి శైలి వేరు. ప్రమోషన్స్ కు చాలా ప్రాధాన్యతను ఇస్తాడు జక్కన్న. తన హీరోల్ని ప్రోజెక్ట్ చేయడంలో కూడా ముందుంటాడు. బాహుబలికి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అంటూ హైప్...

విశాఖ వాసుల్ని బెంబేలెత్తించిన దట్టమైన పొగలు

12 మంది ప్రాణాలు బలిగొన్న ఎల్జీ పాలిమర్స్ ఘటన మరవక ముందే మరో ఘటన విశాఖ ప్రజల్ని భయాందోళనలకు గురి చేసింది. కొద్దిసేపటి క్రితం విశాఖ, మల్కాపురంలోని HPCL రిఫైనరీ నుంచి దట్టమైన...

ఫ్లాష్ న్యూస్: ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు, ముగ్గురు మృతి

విజయవాడ, హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీ యాక్సిడెంట్‌ జరిగింది. నల్లగొండ జిల్లా చిట్యాల సమీపంలో రిలయన్స్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఆగి ఉన్న ధాన్యం లారీని వెనుక నుండి వచ్చి కారు ఢీ...

క్రైమ్ న్యూస్: పూడ్చి పెట్టిన బాలిక శవం తీసి రేప్ చేసిన వృద్ధుడు

దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రతి రోజు మీడియాలో చూస్తూనే ఉన్నాం. పోలీసులు ఎంతగా కఠిన శిక్షలు విధిస్తున్నా, ఉరి శిక్షలు అమలు చేస్తున్న కూడా నిచులు తమ. బుద్దిని...