Switch to English

ట్విస్ట్ అంటే ఇదీ: వైసీపీ ఎమ్మెల్యేలలో ఈ మార్పు వెనుక.!

అమరావతి అన్న పేరు వినిపిస్తే చాలు వైసీపీ నేతలు పూనకంతో ఊగిపోతుంటారు. ఒకరేమో అమరావతిని స్మశానం అంటారు.. ఇంకొకరు ఎడారి అంటారు.. ఇంకొరేమో రైతుల్ని ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులు, కూకట్‌పల్లి ఆంటీలు అని దిగజారుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇంకొందరైతే బూతులు కూడా తిట్టేస్తుంటారు అమరావతి ఉద్యమకారుల్ని.

అమరావతిని ‘కమ్మ’ ఉద్యమంగా వైసీపీ నేతలు అభివర్ణించడం అందరికీ తెలిసిన విషయమే. అమరావతి ఉద్యమం వెనుక టీడీపీ కుట్ర.. అన్న ఆరోపణల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి, వైసీపీ ఎమ్మెల్యే ఒకరు అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహా పాదయాత్ర’ కార్యక్రమానికి సంఘీభావం తెలపడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

నెల్లూరు జిల్లాకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, అమరావతి పరిరకషణ సమితికి చెందిన రైతులను కలిశారు. వారు బస చేస్తున్న ప్రాంతానికి వెళ్ళి, పాదయాత్ర సందర్భంగా వారెదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. తన పరిధిలో తనకు చేతనంత సాయం చేస్తానని, అండగా వుంటానని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, అమరావతి రైతులకు భరోసా ఇచ్చారు.

‘జై అమరావతి’ అనాలంటూ అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిథులు కోరగా, అందుకు నిరాకరించిన శ్రీధర్ రెడ్డి, తనకు ఆ విషయంలో కొన్ని సమస్యలున్నాయనీ, అర్థం చేసుకోవాలని వారికి నచ్చజెప్పారు. ఇప్పుడీ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మొన్నీమధ్యనే వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ వెళుతుండగా చంద్రబాబుని చూసి, చేతులు జోడించి నమస్కరించిన విషయం వైసీపీలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

వైసీపీ నేతల్లో.. అందునా వైసీపీ ఎమ్మెల్యేలలో ఈ ఆకస్మిక మార్పుకి కారణమేంటి.? మూడు రాజధానులపై వైఎస్ జగన్ సర్కారు రివర్స్ గేర్ వేశాక, శాసన మండలి విషయంలో యూ టర్న్ తీసుకున్నాక.. సొంత పార్టీపై వైసీపీ శ్రేణుల్లో నమ్మకం పోతోందా.? అలాగే అనుకోవాలేమో.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

అంటే సుందరానికి రంగో రంగ: ఆసక్తికరమైన సాంగ్

న్యాచురల్ స్టార్ నాని పలు సీరియస్ సినిమాల తర్వాత చేస్తోన్న పూర్తిస్థాయి ఎంటర్టైనింగ్ చిత్రం అంటే సుందరానికి. జూన్ 10న ఈ చిత్రం విడుదల కానుంది....

థాంక్యూ టీజర్ విడుదల తేదీ అనౌన్స్మెంట్

అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ సినిమా థాంక్యూ. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్టెనా కానీ ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్స్...

ఎన్టీఆర్ హీరోయిన్ పై ఇంకా క్లారిటీ లేదా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సాధించిన అద్భుతమైన విజయాన్ని ఆస్వాదించి ఇప్పుడు తన తర్వాతి సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని...

బిగ్ బాస్ తెలుగు టైటిల్ గెలిచిన మొదటి మహిళ – బిందు...

బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ నిన్నటితో పూర్తయింది. మొత్తం ఏడుగురు ఫైనలిస్ట్ లలో చివరికి అఖిల్, బిందు మాధవి మధ్య...

వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు సినిమా షూటింగ్ డీటెయిల్స్

మెగా హీరో వరుణ్ తేజ్, గని ఇచ్చిన ప్లాప్ నుండి త్వరగానే కోలుకుని తన నెక్స్ట్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు. మే 27న విడుదలవుతోన్న ఎఫ్3...

రాజకీయం

వైసీపీ, టీడీపీ, జనసేన.. తాము తిట్టుకుంటూ బీజేపీకే మద్దతు: ఉండవల్లి

వైసీపీ, టీడీపీ, జనసేన నేతలు తమలో తాము తిట్టుకుంటారే కానీ బీజేపీని ఏమీ అనరని.. వారంతా బీజేపీకే మద్దతిస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.....

జర్నలిస్టులతో ఆడుకంటున్న వైసీపీ, టీడీపీ.!

‘బాబూ, నీది ఏ ఛానల్.? ఏ పత్రిక.?’ అంటూ అడిగి మరీ జర్నలిస్టులతో ఆడుకుంటున్నాయి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ. ఆయా మీడియా సంస్థలపై అక్కసు వెల్లగక్కే క్రమంలో,...

దావోస్ లో.. ఏపీ సీఎం జగన్ ను కలిసిన తెలంగాణ మంత్రి కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ లో కలిశారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సుకు ఇరు రాష్ట్రాల...

వైసీపీ ఎమ్మెల్సీ కారు డ్రైవర్ ‘చావు కథ’.!

ఫాఫం.! అధికార పార్టీ ఎమ్మెల్సీని అరెస్టు చేయాలంటే ఎంత కష్టపడాల్సి వచ్చిందో.! దాని కోసం కట్టు కథ అల్లడానికి ఎంత శ్రమించాల్సి వచ్చిందో.! ఇలా సాగుతోంది సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద...

వీడిన మిస్టరీ..! సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ పాత్ర ఇదే: కాకినాడ ఎస్పీ

రాష్ట్రంలో సంచలనం రేపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య మిస్టరీ వీడింది. కేసు వివరాలను కాకినాడ ఎస్పీ రవీంద్రనాధ్ మీడియాకు వివరించారు. ‘సుబ్రహ్మణ్యం మృతిపై అతని తల్లి ఫిర్యాదు మేరకు మొదట అనుమానాస్పద కేసు...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్సీ కారులో డెడ్ బాడీ.! ఆ వైసీపీ నేత ఎక్కడ.?

ఎమ్మెల్సీ కారులో.. సదరు ఎమ్మెల్సీ మాజీ డ్రైవర్ మృతదేహం.! ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదొక వింత. ‘నా భర్తని తీసుకెళ్ళి చంపేసి, శవంగా తీసుకొచ్చి మా ఇంటి ముందు పడేశారు..’ అంటూ మృతుడి భార్య...

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఎమోషనల్ ట్వీట్

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది ప్రేక్షకులు ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ ముందు, తర్వాత చూసారు. వీరిద్దరి మధ్యా ఫ్రెండ్షిప్ కు మించిన బాండింగ్ ఉందన్న విషయం అర్ధమైంది....

పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్..

ఏపీలో సంచలనం రేపిన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ విషయాన్ని అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ ధ్రువీకరించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంత...

నా ఇమేజ్ వల్లే ఆ సినిమా ప్లాప్‌ : రాజశేఖర్‌

యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్‌ హీరోగా జీవిత దర్శకత్వంలో రూపొందిన శేఖర్ సినిమా విడుదల అయ్యింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా పెద్ద ఎత్తున మీడియా సమావేశాలు.. ఇంటర్వ్యూలకు రాజశేఖర్‌ హాజరు అయ్యారు....

జర్నలిస్టులతో ఆడుకంటున్న వైసీపీ, టీడీపీ.!

‘బాబూ, నీది ఏ ఛానల్.? ఏ పత్రిక.?’ అంటూ అడిగి మరీ జర్నలిస్టులతో ఆడుకుంటున్నాయి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ. ఆయా మీడియా సంస్థలపై అక్కసు వెల్లగక్కే క్రమంలో,...