Switch to English

మళ్ళీ పోటీ చేసేది ఎలా.? వైసీపీ మంత్రుల బిక్క మొహం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

మీడియా ముందుకొచ్చి రాజకీయ ప్రత్యర్థుల్ని తూలనాడటంలో వైసీపీ నేతలు.. అందునా మంత్రులు చూపిస్తున్న అత్యుత్సాహం అంతా ఇంతా కాదు.!

‘పవన్ కళ్యాణ్‌కి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పేర్లు అయినా తెలుసా.?’ అని ప్రశ్నిస్తారో మంత్రి.! అసలంటూ ఆ మంత్రిగారికి రాష్ట్ర రాజధాని పేరేంటో తెలుసా.? అని జనం కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారాయె.! ఇదీ, రాష్ట్రంలో పరిస్థితి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మంత్రులందరిదీ ఒకటే శాఖ.. అదే పవన్ కళ్యాణ్‌ని తిట్టే శాఖ. గత మంత్రి వర్గం చేసింది అదే (వైఎస్ జగన్ పార్ట్ వన్ మంత్రి వర్గం).. ఇప్పుడున్న మంత్రి వర్గం చేస్తున్నది కూడా అదే.! చిత్రమేంటంటటే, మెజార్టీ మంత్రులు వచ్చే ఎన్నికల్లో గెలవడం సంగతి అటుంచితే.. సీట్లు దక్కించుకోవడానికీ నానా తంటాలూ పడుతున్నారట.

ఉత్తరాంధ్రకు సంబంధించిన ఓ యువ మంత్రి, గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ, ఆయనగారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దొరక్కపోవచ్చునట. ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న చోట గెలిచే అవకాశం లేదనీ, వేరే చోట ట్రై చేసుకోమని అధినాయకత్వం నుంచి ఆయనగారికి సూచనలాంటి అల్టిమేటం జారీ అయ్యిందట.

ఓ మాజీ మంత్రి అప్పట్లో.. మంత్రిగా వుండి పవన్ కళ్యాణ్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారుగానీ, అధినేత మెప్పు పొందలేకపోయారు.. మంత్రి పదవికి పొడిగింపుని పొందలేకపోయారు. ఆయనేమో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం అనుమానమేనట. టిక్కెట్టు తనకు ఎలాగూ దక్కదని తెలిసి, తన కుమారుడ్ని ఆయన ముందుకు తెచ్చారట.

ఉత్తరాంధ్రకే చెందిన సీనియర్ మంత్రి పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది. ఓ మహిళా మంత్రికి నోటు దురుసు ఎక్కువ. ఆమెకు సొంత నియోజకవర్గంలో వైసీపీ నుంచే ఎదురైతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆమెకు టిక్కెట్టు ఇస్తే ఓడించి తీరతామని వైసీపీ నేతలే చెబుతున్నారు. దాంతో, ఆమెకీ టిక్కెట్టు కష్టమేనట.

చెప్పుకుంటూ పోతే కథ పెద్దదే.! పవన్ కళ్యాణ్‌ని తిట్టడం తర్వాత.. ముందైతే మీ టిక్కెట్లు మీకే వున్నాయో లేదో చూస్కోండంటూ ఆయా నేతలపై వారి వారి నియోజకవర్గాల్లోనే జనం సెటైర్లేస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...