Switch to English

కాపు జనసేన కాదు, కమ్మ జనసేన.! వైసీపీ ‘చెత్త’ పల్లవి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీని విమర్శిస్తున్నారో, ఆ పార్టీకి పొలిటికల్ మైలేజ్ ఇచ్చేందుకు అపరిపక్వ వ్యాఖ్యలు చేస్తున్నారోగానీ, ‘ఐటీ శాఖ మంత్రి’ పదవిని పక్కన పెట్టి, జనసేన పార్టీని విమర్శించే పదవిలో మాత్రం నూటికి నూరు శాతం బాగానే కష్టపడుతున్నారు వైసీపీ నేత, మంత్రి గుడివాడ అమర్నాథ్.

మొన్నామధ్యన ఏదో అధికారిక కార్యక్రమానికి వెళితే, ఈయనగార్ని గుడివాడ అమర్నాథ్ రెడ్డిగా అక్కడి నిర్వాహకులు పొరపాటున వ్యాఖ్యానించడంతో ఒకింత నొచ్చుకున్నారట. ఇదీ, ‘రెడ్డి’ ప్రభుత్వంలో నడుస్తున్న కథ.!

సరే, ఆ సంగతి పక్కన పెడితే, జనసేన పార్టీ మీద తాజాగా విమర్శలు చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్, ‘కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదెక్కడి చోద్యం.? రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కమ్మ తెలుగు దేశం పార్టీ.. ఇలా వుంటాయా ఎక్కడైనా.? ఆమాత్రం ఇంగితం లేనోళ్ళు రాజకీయాల్లోకి వచ్చేయడమేంటి.? పైగా, మంత్రి పదవులు వెలగబెట్టడమేంటి.?

జనసేన వ్యవహారాల్ని నాదెండ్ల మనోహర్ చూసుకుంటున్నారు కాబట్టి, నాదెండ్ల మనోహర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి.. జనసేన పార్టీ అనూహ్యంగా కమ్మ జనసేన పార్టీ అయిపోయింది మంత్రి గుడివాడ అమర్నాథ్ దృష్టిలో.

మరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏమని పిలవాలి.? కాపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అనిగానీ, రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనిగానీ అంటే దానికి గుడివాడ అమర్నాథ్ ఆమోద ముద్ర వేస్తారా.? వెయ్యరుగాక వెయ్యరు, వేస్తే ఏమవుతుందో.. తన పదవి వుంటుందో, ఊడుతుందో ఆయనకు బాగా తెలుసు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఇందులో రహస్యమేమీ లేదు. కానీ, ఆయనెప్పుడూ, ‘కాపు సామాజిక వర్గం అంతా నా వెంట రావాలి..’ అని అనలేదు. ఆయనలో ‘కాపు భావజాలం’ వుంటే, నాదెండ్ల మనోహర్‌కి ఎందుకు కీలక బాధ్యతలు అప్పగిస్తారు.?

‘ఆమాత్రం ఇంగితం వుంటే ఇకనేం.? ఏదో గాలి వాటంగా మంత్రి పదవి వచ్చేసిందంతే..’ అంటూ గుడివాడ అమర్నాథ్ మీద సెటైర్లు పడుతున్నాయ్. అన్నట్టు, విమర్శించే క్రమంలో జనసేనకు ఓ మేలు చేశారు గుడివాడ అమర్నాథ్. కాపు జనసేన మాత్రమే కాదు, కమ్మ జనసేన, దళిత జనసేన, రెడ్డి జనసేన.. ఇలా ఎవరైనా అభిమానంతో జనసేన పార్టీని ఎలాగైనా పిలుచుకోవచ్చు.

పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాట చాలా సందర్భాల్లో చెప్పారు. ‘నేను కాపు సామాజిక వర్గానికి చెందినవాడ్ని అయినంతమాత్రాన కాపు సామాజిక వర్గం అంతా నా వెంటే నడుస్తుందనే భ్రమల్లో నేను లేను. అన్ని కులాల్నీ, మతాల్నీ సమానంగా గౌరవించేదే జనసేన పార్టీ..’ అని పదే పదే జనసేనాని చెబుతూ వస్తున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఎందుకు మాట్లాడకూడదు.?

న్యాయస్థానం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి మాట్లాడకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.. అదీ వైసీపీ ఫిర్యాదు నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీసీసీ...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్, రియా సుమన్ హీరోయిన్లుగా 'జితేందర్ రెడ్డి'...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు,. ఇప్పటికే రిలీజ్...