Switch to English

ప్రాణాలు పోతున్నా ‘పారాసిటమాల్‌’ పైత్యం ఆగడంలేదు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow

‘ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పనిలేదు.. పారాసిటమాల్‌ వేసుకుంటే సరిపోతుంది..’ అన్న మాట ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుంచి రావడమంటే, ‘ప్రజల్లో ఆందోళన పెంచకూడదు’ అన్న ఉద్దేశ్యాన్ని మాత్రమే ఆ పాలకుడి వ్యాఖ్యల నుంచి చూడాలి. కానీ, దానికి కొనసాగింపుగా బాధ్యతగలిగిన ఓ ఉన్నతాధికారి ’650 గ్రాముల పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ ఆరు గంటలకు ఓ సారి వేసుకోవాలి..’ అని సూచిస్తే మాత్రం, అది పూర్తిగా బాధ్యతారహిత్యమే.

సదరు అధికార పార్టీకి వత్తాసు పలికే మీడియా, ‘పారాసిటమాల్‌తో అద్భుత ఫలితం..’ అంటూ కరోనా వైరస్‌ గురించి ప్రచారం చేస్తే, అది నూటికి నూరుపాళ్ళూ దుష్ప్రచారమే. ఎందుకోసం ఇదంతా జరుగుతోంది.? నిజంగా ప్రజల క్షేమం ఆశిస్తే, ఇలాంటి ప్రకటనలు వస్తాయా.? ఇలాంటి ప్రచారాలు తెరపైకి వస్తాయా.? జ్వరం తగ్గించడానికి పారాసిటమాల్‌ దివ్యౌషధమే. కానీ, కరోనా వైరస్‌ ద్వారా జ్వరం ఒక్కటే వస్తుందని ఎలా చెప్పగలం.?

చాలామందికి అసలు వ్యాధి లక్షణాలే కన్పించకుండా వారి ద్వారా ఇంకొకరికి వ్యాప్తి చెందుతోందని పరిశోధనలు నిరూపించాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కొన్ని మెడిసిన్‌ కాంబినేషన్స్‌ గురించి సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. అవి ప్రయోగాల దశలో వున్నాయనీ, త్వరలోనే మందు దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకోపక్క, కరోనా బాధితులకు రకరకాల వైద్య చికిత్సలు అందిస్తున్నారు వైద్యులు.. ప్రపంచ వ్యాప్తంగా వైద్యుల మధ్య ఓ అవగాహనతో వ్యవహారం నడుస్తోంది. రకరకాల మందుల్ని ఉపయోగిస్తున్నారు. ఆ వైద్యుల నుంచి సమాచారం తీసుకుని, దాన్ని ప్రచారంలోకి తెస్తే అదో లెక్క.

కొందరు వైద్యులే, పారాసిటమాల్‌ ప్రచారాన్ని తప్పు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పారాసిటమాల్‌పై ప్రచారం, లేనిపోని దారుణాలకు కారణమవుతుందన్నది నిర్వివాదాంశం. ‘జ్వరం వస్తే దాన్ని తగ్గించడానికి పారాసిటమాల్‌ వాడతాం..’ అని వైద్యులు చెబుతున్నా, ఆ వైద్యులే, పారాసిటమాల్‌తోనే కరోనా తగ్గిపోతుందనేది దుష్ప్రచారమని స్పష్టం చేస్తున్న విషయాన్ని సోకాల్డ్‌ పాలకులు, వారికి వత్తాసు పలికే మీడియా మానుకోవాలి. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం, కరోనా వైరస్‌ విషయమై ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది. వైద్య నిపుణులు తగు సూచనలు సలహాలు ఇస్తున్నారు ప్రజలకి. అవన్నీ పాటించాల్సిందే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు....

రాజకీయం

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

ఎక్కువ చదివినవి

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

రామ్ చరణ్ కి డాక్టరేట్.. పవన్ కళ్యాణ్ అభినందనలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) మరో అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ చరణ్ కి గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది....

Love Guru Review: ‘లవ్ గురు’ మూవీ రివ్యూ: సినిమా పర్లేదు గురూ.!

తమిళ నటుడు విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘రోమియో’ని తెలుగులో ‘లవ్ గురు’ పేరుతో డబ్ చేశారు. ‘లవ్ గురు’ అని పేరు పెట్టి, ఫ్యామిలీ సినిమా.. అంటూ ఎలా ప్రమోట్ చేశారు.?...

Rajamouli: భార్యతో కలిసి రాజమౌళి రిథమిక్ డ్యాన్స్.. వీడియో వైరల్

Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) ఎంతటి క్రియేటివ్ డైరక్టరో తెలిసిందే. తెలుగు సినిమాని మాత్రమే కాదు.. భారతీయ సినిమాను సైతం ప్రపంచ సినీపటంలో నిలబెట్టిన గ్రేటెస్ట్ డైరక్టర్. కొత్త తరహాలో ఆలోచించి కథతో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పుట్టినరోజు వేడుకల్ని టీమ్ సెట్లో...