Switch to English

రోడ్ మ్యాప్ తెలీదు.! ‘వ్యతిరేక ఓటు’ అంటే అర్థం కాదు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

‘మీ పార్టీకి ఇంకెవరో రోడ్ మ్యాప్ ఇవ్వడమేంటి.?’ అన్నది వైసీపీ నుంచి జనసేన మీదకు దూసుకొచ్చిన ఓ ప్రశ్న. ‘వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చబోమని చెప్పడంలో అర్థం, టీడీపీ వైపుగా జనసేన అడుగులేస్తోందనే..’ అంటూ ఇంకో పెడార్ధం తీయడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే చెల్లింది.

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాటిని వక్రీకరిస్తూ, బీజేపీకి జనసేన హ్యాండ్ ఇస్తోందంటూ దుష్ప్రచారం షురూ చేశారు. నిజానికి, జనసేనాని అత్యంత బాధ్యతాయుతంగా జనసేన శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు పంపారు. సరైన దిశానిర్దేశం చేశారు.

కాంగ్రెస్, వామపక్షాలు, టీడీపీ, బీజేపీ మాత్రమే కాదు, వైసీపీ నేతలు కార్యకర్తలనుద్దేశించి కూడా కొన్ని సూచనలు చేయాలి. పార్టీలకతీతంగా రాష్ట్రం కోసం ఆలోచన చేయాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానికి ఎందుకు లేదన్న విషయాన్ని జనసేన అధినేత ప్రశ్నించారు.

సీపీఎస్ రద్దు విషయమై అవగాహన లేకుండానే ఎన్నికల హామీ ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసలు రూపాన్ని జనసేన ఆవిర్భావ సభ ద్వారా రాష్ట్ర ప్రజల ముందుంచారు. వైసీపీలో కొందరు మంచి నాయకులు, వైసీపీకి చెందిన కొందరు మంచి కార్యకర్తలు.. రాష్ట్రంలో వైసీపీ పాలన వల్ల నష్టపోతున్న సమాజం గురించి ఆలోచించాలని కోరారు.

అసలు రాజకీయాల్లో ఇలాంటి చిత్తశుద్ధితో కూడిన మాటల్ని ఎవరైనా ఆశించగలమా.? ఓ వ్యక్తి లేదా ఓ పార్టీ పాలన వల్ల రాష్ట్రం నాశనమైపోతోంటే, ఆ ప్రభుత్వాన్ని దించేందుకు తనతో అందరూ కలిసి రావాలన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు. ఆ ‘అందరూ’లో బీజేపీ వుండొచ్చు, టీడీపీ వుండొచ్చు, వామపక్షాలకు చెందినవారు వుండొచ్చు.. ఆఖరికి వైసీపీకి చెందినవారూ వుండొచ్చు.. అంతిమంగా అందరూ జనసేన గొడుగు కిందికి రావాలన్నది జనసేన అధినేత చెప్పిన మాట.

బీజేపీ పెద్దలు రోడ్ మ్యాప్ ఇచ్చారన్న పవన్ వ్యాఖ్యల విషయానికొస్తే, అందులో తప్పేముంది.? దేశంలో అధికారంలో వుంది బీజేపీ. దేశవ్యాప్తంగా తమదైన వ్యూహాలతో బీజేపీ విస్తరిస్తోంది. ఏపీలో కూడా అలాగే విస్తరించాలనుకుంటోంది.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పేరుని ఇప్పటికే బీజేపీకి చెందిన చాలామంది నాయకులు ప్రకటించారు. ఈ క్రమంలో మిత్రపక్షం ఏం రోడ్ మ్యాప్ ఇస్తోందో వేచి చూడాల్సిన బాధ్యత జనసేన మీద వుంది కదా.?

ఇంత స్పష్టంగా జనసేనాని పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడితే, అవి అర్థం కాక వైసీపీ నేతలు కొందరు కారుకూతలు కూస్తోంటే, ‘పవన్ మాట్లాడిన మాటల్లో తప్పేముందంటూ వైసీపీ వర్గాల్లోనే’ చర్చ జరుగుతుండడం గమనార్హం.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పుట్టినరోజు వేడుకల్ని టీమ్ సెట్లో...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...