Switch to English

వైఎస్ జగన్ పాదయాత్ర.! బెదిరిపోతున్న వైసీపీ నేతలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేయబోతున్నారట. ఈ విషయాన్ని వైసీపీ నేతలే చెబుతున్నారు. అయితే, అప్పుడే కాదు లెండి.. ఇంకాస్త సమయం వుంది. 2027లో పాదయాత్ర వుంటుందన్నది వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట.

కాస్త ముందుగానే.. అంటే, 2026 చివర్లో పాదయాత్ర ప్రారంభించే అవకాశాలూ లేకపోలేదుట. ఎందుకీ పాదయాత్ర.? అంటే, గతంలో తనకు పాదయాత్రే అధికార పీఠాన్ని ఇచ్చిందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బలంగా విశ్వసిస్తున్నారు గనుక.

నారా లోకేష్ పాదయాత్ర, టీడీపీకి అధికారం తెచ్చిందని కూడా వైసీపీ పరోక్షంగా అంగీకరించక తప్పని పరిస్థితి. అంతకు ముందు, చంద్రబాబు కూడా పాదయాత్ర చేసే అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు కంటే ముందు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, పాదయాత్ర ద్వారానే, అధికార పీఠమెక్కారు.

సరే, పాదయాత్ర చేసే హక్కు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. పైగా, పాదయాత్ర ఆయనకు అలవాటే. కానీ, ఒకప్పటి పాదయాత్రలకీ, ఇప్పటి పాదయాత్రలకీ చాలా తేడా. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్ర కూడా, ‘మార్నింగ్ వాక్.. ఈవినింగ్ వాక్’ అన్నట్లే వుండేది.

అక్రమాస్తుల కేసులో కోర్టు యెదుట వ్యక్తిగత విచారణకు హాజరవ్వాల్సి వున్న వైఎస్ జగన్, దాన్ని తప్పించుకునేందుకు పాదయాత్ర చేశారన్నదీ కాదనలేని వాస్తవం. ఈసారి కూడా అంతేనా.? అంటే, దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే, పాదయాత్ర అంటే బోల్డన్ని ఖర్చులుంటాయి. కొంత ఖర్చు పార్టీ పెడితే, ఇంకొంత ఖర్చు స్థానిక నాయకులు పెట్టుకోవాలి. ఇక్కడే, వైసీపీ నేతలు గుస్సా అవుతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నాయకులు తీవ్రంగా నష్టపోయిన మాట వాస్తవం.

వై నాట్ 175 అని వైఎస్ జగన్ చెబితే, గుడ్డి నమ్మేసి, అవసరానికి మించి ముందుగా ఖర్చు చేసేసి, చేతులు కాల్చుకున్నారు వైసీపీ నేతలు. ఎన్నికల్లో ఓడిపోయాక, మరిన్ని ఆర్థిక ఇబ్బందులు వైసీపీ నేతల్ని వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాదయాత్ర అంటేనే, ఖర్చు దండగ వ్యవహారం.. అనేస్తున్నారట వైసీపీలో.

మరీ, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలు, ‘ఖర్చు మా వల్ల కాదు’ అని అధినాయకత్వానికి ఆల్రెడీ తేల్చి చెప్పేశారన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ నుండి అందుతున్న సమాచారం.

సినిమా

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’...

Chiranjeevi: ‘చేతికి కట్టు’.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తన భుజానికి ఉన్న పట్టీ గురించి వివరాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రేయోభిలాషులు, అభిమానుల ఆందోళనకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘చేతికి...

కపుల్ ఫ్రెండ్లీ’పై సిద్ధు జొన్నలగడ్డ ప్రశంసల పోస్ట్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా థియేటర్లలో మంచి స్పందనతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాపై స్టార్ బాయ్ సిద్ధు...

రాజకీయం

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విశాఖలో సాధు పరిషత్ ఆందోళన

ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల దేవదేవుని లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు తయారు చేసే ప్రసాదమైన లడ్డూ పవిత్రతపై అనుమానాలు...

 జీఓ 117 రద్దుతో ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ విద్యార్థులు: అసెంబ్లీలో నారా లోకేష్ వెల్లడి 

అమరావతి: గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 117 కారణంగా పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన...

చంద్రబాబు మీద ద్వేషమా.? బిల్ గేట్స్ మీద ద్వేషమా.?

బిల్ గేట్స్ అంటే కంప్యూటర్.. కంప్యూటర్ అంటే బిల్ గేట్స్.. ఒకప్పుడు కంప్యూటర్ యుగంలోకి అడుగు పెట్టిన యువతీ యువకులంతా బిల్ గేట్స్ గురించి ఇలానే మాట్లాడుకునేవారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కి...

ఎక్కువ చదివినవి

ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులపై లోకేష్ కీలక వ్యాఖ్యలు

అమరావతిలో జరిగిన శాసనమండలి సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులు, నాడు–నేడు, మనబడి–మన భవిష్యత్ పథకాల అమలుపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విస్తృతంగా స్పందించారు. ప్రభుత్వ పాఠశాలలను...

కోనసీమకు భారీ నిధులు.. పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్యేల కృతజ్ఞతలు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్రామాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను అక్కడి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మర్యాదపూర్వకంగా కలిశారు. పల్లెపండగ 2.0, సాస్కీ నిధులతో...

Daily Horoscope: ఉద్యోగంలో అవకాశాలు, ఆర్థికంగా మెరుగుదల

ఫిబ్రవరి 11, 2026 బుధవారం రాశిఫలాలు మేషం (Aries): ఈ రోజు మీ పనుల్లో వేగం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఖర్చులపై నియంత్రణ అవసరం. మాటలతో ఎవరి...

ఈ వారం ఓటీటీల్లో ఎంటర్‌టైన్‌మెంట్ వర్షం!

ఫిబ్రవరి 16 నుంచి 22 మధ్య ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వరుసగా విడుదలకు వస్తుండటంతో డిజిటల్ ప్రేక్షకులకు వినోదోత్సవం మొదలైంది. సంక్రాంతికి థియేటర్లలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల పాటలను అనుమతి లేకుండా ఎక్కడా వినియోగించరాదని...