Switch to English

ఉండవల్లిపై వైసీపీ నేతలు విరుచుకుపడలేదు ఎందుకబ్బా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,477FansLike
57,764FollowersFollow

ఉండవల్లి అరుణ్ కుమార్.. రాజమండ్రి మాజీ ఎంపీగా, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా తెలుగు ప్రజలకు సుపరిచితులు. వైఎస్ హయాంలో మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి ఈనాడు అధినేత రామోజీరావును ఇబ్బందులు పెట్టింది ఈయనే. వైఎస్ తనయుడిగా జగన్ పై అభిమానం ప్రదర్శించిన ఉండవల్లి.. తాజాగా ఆయన పాలనలో లోటుపాట్లను ఏకిపారేశారు. రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి ఏపీ సీఎంపై విరుచుకుపడ్డారు.

ప్రజలు అధికారం ఇచ్చింది ప్రత్యర్థులపై కక్ష సాధించడానికి కాదని స్పష్టంచేశారు. ప్రత్యర్థుల విషయంలో ఎలా వ్యవహరించాలో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వ్యవస్థలు, ప్రత్యర్థులపై శత్రుత్వం మంచిది కాదని.. వ్యవస్థలను మెరుగపరిచేలా పాలన ఉండాలని హితవు పలికారు. అందరూ ఎల్వీ సుబ్రమణ్యంలా ఉండరని.. నిమ్మగడ్డ, ఏబీ వెంకటేశ్వరరావులే ఎక్కువ ఉంటారని చురకలంటించారు. మద్యం విక్రయాల నుంచి ఆవ భూముల్లో అవకతవకల వరకు అన్ని అంశాలను ప్రస్తావించి జగన్ సర్కారును చెడుగుడు ఆడేశారు.

మమూలుగా అయితే, వైసీపీ నేతల నుంచి ఈపాటికి కౌంటర్ వచ్చేయాలి. తిట్లు, విమర్శలతో విరుచుకుపడిపోవాలి. కానీ ఉండవల్లి విమర్శలు సంధించి రెండు రోజులు అవుతున్నా ఒక్కరు కూడా స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందులోనూ ఏపీ మంత్రుల భాష ఎలా ఉంటుందో అసలు చెప్పక్కర్లేదు. కానీ వైసీపీ నుంచి ఒక్క నేత కూడా ఉండవల్లిపై విరుచుకుపడలేదు.

ఇందుకు కారణం ఏమిటా అని ఆరా తీస్తే.. జగన్ నుంచి కచ్చితమైన ఆదేశాలు ఉండటమేనని తెలిసింది. ఉండవల్లిని ఎవరూ విమర్శించొద్దని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అందరికీ జగన్ స్పష్టంచేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉండవల్లి వ్యాఖ్యలు పట్టించుకోవద్దని, రాజకీయంగా ఎలాంటి విమర్శలూ చేయొద్దని సూచించినట్టు చెబుతున్నారు. ఒకవేళ ఆయన చెప్పిన విషయాల్లో మంచి సలహాలు ఏమైనా ఉంటే వాటి గురించి ఆలోచిద్దామని కూడా పేర్కొన్నట్టు సమాచారం. అందుకే ఉండవల్లిపై వైసీపీ తనదైన మార్కులో విరుచుకుపడలేదన్న మాట.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

ఎక్కువ చదివినవి

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

రామ్ చరణ్ కి డాక్టరేట్.. పవన్ కళ్యాణ్ అభినందనలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) మరో అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ చరణ్ కి గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది....

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

Viral News: భారతీయుడి పేరుతో వెటకారం.. 10వేల డాలర్లు చెల్లించిన కెనడా కంపెనీ

Viral News: భారతీయుడి పేరును వెటకారంగా ప్రచురించిన కెనడా (Canada) కు చెందిన సంస్థ తగిన మూల్యం చెల్లించుకుంది. తీవ్ర విమర్శలు రావడంతో క్షమాపణలు కోరి 10వేల డాలర్లు చెల్లించేందుకు సిద్ధమైంది. వివరాల్లోకి...

Tollywood: ‘సినీ వార్తల్లో జవాబుదారీతనం ఉండాలి..’ TFDMA సమావేశంలో దిల్ రాజు

Tollywood: తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్(TFJA) కు అనుబంధంగా నూతనంగా తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్(TFDMA) ఏర్పాటయింది. ఆవిర్బావ సమావేశంలో పొల్గొన్న దిల్ రాజు, దామోదర్ ప్రసాద్,  ప్రసన్నకుమార్ పాల్గొని శుభాకాంక్షలు...