Switch to English

వైఎస్‌ జగన్‌ అంటే వైసీపీ నేతలకు లెక్కలేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

‘సోషల్‌ డిస్టెన్స్‌ పాటించండి.. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ళు విడిచి బయటకు రావొద్దు.. సభలు, సమావేశాలపై నిషేధం వుంది..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా, అధికార పార్టీ నేతలు మాత్రం లెక్క చేయడంలేదు. ‘స్వామి భక్తి’ ప్రదర్శించే క్రమంలో ర్యాలీలు నిర్వహిస్తున్నారు.. చిన్నపాటి బహిరంగ సభలు, సమావేశాలూ నిర్వహిస్తున్నారు. ‘పేదలకు సాయం’ పేరుతో పెద్ద సంఖ్యలో జనం గుమికూడేలా చేస్తున్నారు.

పరోక్షంగా వైసీపీ నేతలే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తికి ‘కృషి చేస్తున్నట్లు’ కన్పిస్తోంది పరిస్థితి. మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిథులూ ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, స్వచ్ఛంద సంస్థలూ పేదలను ఆదుకునేందుకు ముందుకొస్తున్నా, వైసీపీ తీరు మాత్రం అభ్యంతకరంగా మారుతోంది.

ఇటీవల శ్రీకాళహస్తిలో అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిది¸ భారీ ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. ఇప్పుడేమో పోలీసులు, వైద్య సిబ్బంది అంబులెన్సులతో ర్యాలీ నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. నెల్లూరులోనూ ఇదే పరిస్థితి. కరోనా ప్రభావం లేని శ్రీకాకుళం జిల్లాలో ఎలాగైనా కరోనా వైరస్‌ని వ్యాప్తి చెందేలా చేయాలనుకుంటున్నారో ఏమో.. అక్కడ ఓ ప్రజా ప్రతినిది¸ (ఆయన ఇప్పుడు ఓ కీలక పదవిలో వున్నారు) ఇటీవల ఓ మీటింగ్‌ పెట్టి, పెద్దయెత్తున జనం గుమికూడేలా చేశారు.

ఇవన్నీ సోషల్‌ మీడియా ద్వారా బయటకు వస్తున్నా, ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది తప్ప, ఎవరి మీదా చర్యలు తీసుకోలేకపోతోంది. సామాన్యుడు అత్యవసర పనుల నిమిత్తం రోడ్డెక్కితే చావగొడ్తున్న పోలీసులు, అధికార పార్టీ నేతలు కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నా ఏమీ చేయలేకపోతుండడం ఆశ్చర్యకరం.

పైగా, చిత్తూరు జిల్లాలో ఓ ప్రజా ప్రతినిది¸ నిర్వాకం కారణంగా కొందరు పోలీసులు కూడా కరోనా వైరస్‌ బారిన పడ్డారు. అయినా పోలీసు శాఖ స్పందించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? అధికార పార్టీ నేతలు నిస్సిగ్గుగా రోడ్డెక్కుతున్నారంటే.. వారికి తమ ముఖ్యమంత్రి మాట అంటే లెక్కలేకపోవమే కారణమయి వుండాలి.. లేదా, ముఖ్యమంత్రే జనాలకి ఓ మాట, తమ పార్టీకిచెందిన నేతలకు ఇంకో మాట చెబుతున్నారని అనుకోవాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఎక్కువ చదివినవి

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...